Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia

వచ్చే 24 గంటల్లో ఏపీలో భారీ వర్షాలు... తెలంగాణాకు కూడా...

Advertiesment
rain
, ఆదివారం, 23 జులై 2023 (16:36 IST)
వచ్చే 24 గంటల్లో ఏపీలోని పలు ప్రాంతాల్లో విస్తారంగా వర్షాలు కురుస్తాయని వాతావరణ కేంద్రం తెలిపింది. దీనికి కారణం దేశంలో రుతుపవన్ ద్రోణి స్థిరంగా, క్రియాశీలకంగా కొనసాగుతుందని తెలిపారు. ఇప్పటికే ఉపరితల ఆవర్తనం మధ్యప్రదేశ్‌పై కొనసాగుతుందని, సోమవారం వాయువ్య, పశ్చిమ మధ్య బంగాళాఖాతాన్ని ఆనుకుని మరో ఉపరితల ఆవర్తనం ఏర్పడుతుందని తెలిపింది. దీని ప్రభావం కారణంగా 24 గంటల్లో అదే ప్రదేశఁలో అల్పపీడన ప్రాంతం ఏర్పడనుందని భారత వాతావరణ శాఖ తెలిపింది. 
 
దీంతో తెలుగు రాష్ట్రాలకు భారీ వర్ష సూచన చేసింది. ఈ నెల 23 నుంచి 27వ తేదీ వరకు ఏపీ, తెలంగాణ రాష్ట్రాల్లోనూ, యానాంలోనూ తేలిక పాటి నుంచి మోస్తరు వర్షాలు, అక్కడక్కడ భారీ వర్షాలు కురిసే అవకాశందని తెలిపింది. ముఖ్యంగా, ఈ నెల25 నుంచి 27వ తేదీ వరకు రాయలసీమలోని పలు ప్రాంతాల్లో పలు చోట్ల భారీ వర్షాలు కురిసే అవకాశాలు ఉన్నాయని, కోస్తాంధ్ర, యానాం ప్రాంతాల్లో 25, 26 తేదీల్లో అతి భారీ వర్షాలు కురుస్తాయని ఐఎండీ వెల్లడించింది. 
 
మరోవైపు, తెలంగాణ రాష్ట్రానికి కూడా వాతావరణ శాఖ హెచ్చరిక జారీచేసింది. రాష్ట్రంలో వచ్చే మూడు రోజులు భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని తెలిపింది. ఈ నెల 25, 26 తేదీల్లో భారీ నుంచి అతి భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని పేర్కొంది. ఈ మేరకు రెండు రోజుల పాటు ఆరెంజ్ అలెర్ట్‌ను జారీచేసింది. దక్షిణ ఒడిశా - ఉత్తర ఆంధ్రా దగ్గరలోని వాయవ్య బంగాళాఖాతం పరిసరాల్లో 24వ తేదీన ఒక అల్పపీడనం ఏర్పడే అవకాశం ఉందని వాతావరణ కేంద్రం వెల్లడించింది. ఈ మేరకు గంటకు 40 నుండి 50 కి.మీ వేగంతో గాలులు వీచే అవకాశం ఉందని హెచ్చరించింది. 

Share this Story:

Follow Webdunia telugu

తర్వాతి కథనం

మైడియర్ వాట్సన్ ... ఈ ప్రశ్నలకు సమాధానం చెప్పు.. జగన్‌కు పవన్ ప్రశ్నలు