Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia

హిందువులంతా కన్నీరుమున్నీరవుతున్నా సీఎం మాట్లాడరేం? బొండా ప్రశ్న

Advertiesment
హిందువులంతా కన్నీరుమున్నీరవుతున్నా సీఎం మాట్లాడరేం? బొండా ప్రశ్న
, గురువారం, 4 ఫిబ్రవరి 2021 (11:21 IST)
రాష్ట్రంలో అనేకమంది ముఖ్యమంత్రులను చూశామని, జగన్ అధికారంలోకివచ్చాక ఎన్నడూలేని విధంగా రాష్ట్రంలో హిందూ మతమే లక్ష్యంగా 161 వరకు ఘటనలు జరిగాయని, అవన్నీ వాస్తవమోకాదో ఈప్రభుత్వం చెప్పాలని టీడీపీ పొలిట్ బ్యూరో సభ్యులు, మాజీఎమ్మెల్యే బొండా ఉమామహేశ్వరరావు డిమాండ్ చేశారు.

ఆయన మంగళగిరిలోని పార్టీ జాతీయ కార్యాలయంలో విలేకరులతో మాట్లాడారు. గతంలో రాజశేఖర్ రెడ్డి ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడుకూడా ఇటువంటి ఘటనలు జరగలేదని, టీడీపీప్రభుత్వం అధికారంలో ఉన్నప్పుడు కూడా ఎక్కడా ఒక్కమసీదుపైగానీ, చర్చిపైగానీ, దేవాలయంపై గానీ దాడిజరిగింది లేదన్నారు.

ఈనాడు ప్రభుత్వఅసమర్థత వల్లే, మతమార్పుడులుచేసేవారు రాష్ట్రంలోరెచ్చిపోతున్నారని,  ప్రభుత్వ కనుసన్నల్లో జరగుతున్న బలవంతపు మత మార్పిడులకు టీడీపీ అడ్డుగాఉందన్న దురాలోచనతో, కావాలనే ప్రతిపక్షంపై పాలకులు ఎదురుదాడి చేస్తున్నారన్నారు. 

ముఖ్యమంత్రిగా అన్నిమత విశ్వాసాలను కాపాడాల్సిన బాధ్యత జగన్ పై లేదా అని ప్రశ్నించిన ఉమా, వ్యవస్థలన్నింటినీ చేతుల్లో ఉంచు కున్న ప్రభుత్వం టీడీపీపై నిందలేయడం ఏమిటన్నారు? టీడీపీ వారు ఎక్కడైనా అటువంటి చర్యలకు పాల్పడిఉంటే, ప్రభుత్వం పోలీసులు సాక్ష్యాధారాలతో సహా ఎందుకు బయటపెట్టడం లేదన్నారు.

రాష్ట్రంలో 32వేల దేవాలయాల్లో సీసీ.కెమెరాలు పెట్టించామని డీజీపీ చెప్పారని, మరి అలాంటప్పుడు  వాటిలో రికార్డైన దృశ్యాల ను ప్రభుత్వం ఎందుకు బయటపెట్టడం లేదన్నారు. ప్రవీణ్ చక్రవర్తి వంటి పాస్టర్లు బహిరంగంగా తాము దేవాలయాలను, విగ్రహాలను ధ్వంసంచేశామని చెప్పుకుంటుంటే అతనిపై ఏం చర్యలు తీసుకు న్నారని బొండా నిలదీశారు.

అసలు దోషులను పట్టుకోకుండా, ప్రభుత్వం తిరిగి రాజకీయ అంశాలకే ప్రాధాన్యతనిస్తూ, టీడీపీకి అంటగట్టాలని చూస్తోందన్నారు. తెలుగుదేశం కార్యకర్తలు, నేతలను దేవాలయాలపై దాడులకు లింకుపెడుతూ, వైసీపీప్రభు త్వం చేస్తున్న ప్రచారాన్ని ప్రజలెవరూ నమ్మరని ఉమా తేల్చిచెప్పారు.

దేవాలయాలపై దాడిఘటనలో ఏంచర్యలు తీసుకున్నారో, దోషుల్లోఎందరిని అరెస్ట్ చేశారో చెప్పకుండా ప్రతిపక్షాన్ని బూచిగా చూపడం సిగ్గుచేటన్నారు. దేవాలయాలపై దాడులన్నీ వైసీపీ ప్రభుత్వ మద్ధతుతోనే జరుగుతున్నాయని టీడీపీ ఆధారాలతో సహా నిరూపించిందని, రామతీర్థంలో వైసీపీప్రభుత్వ మద్ధతుతోనే రాములవారి శిరస్సు ఖండింపబడిందన్నారు.

చంద్రబాబునాయు డు రామతీర్థం వెళ్లేవరకూ, జగన్ ఆ ఉదంతంపై ఎందుకు మాట్లాడ లేదన్నారు? రామతీర్థం ఘటనతో కడుపుమండిప్రజలు ఏవిధంగా వ్యవహరించారో విజయసాయిరెడ్డివాహనంపై జరిగిన దాడే రుజు వన్నారు.  అంతర్వేది రథం తగలబడినప్పుడు, పోలీస్ అధికారు లు తలాఒకమాట చెప్పారని, ఒకరు తేనెతుట్టే అంటే, మరొకరు విద్యుత్ షార్ట్ సర్క్యూట్ అని చెప్పారన్నారు.

అంతర్వేథి రథం తగలబడిన ఘటనను సీబీఐకి అప్పగించామని చెప్పిన ప్రభుత్వం,  ఆ కేసువిచారణను తాడేపల్లి ప్యాలెస్ లో డస్ట్ బిన్ లో పడేసిందా అని బొండా ఎద్దేవాచేశారు. బిట్రగుంటలో రథం కాలిపోతే దానిపై ఎటువంటి విచారణ జరగలేదన్నారు. ఈ విధంగా 161 ఘటనలు జరిగితే, ప్రవీణ్ చక్రవర్తి వంటివారు తామేచేశామని చెబుతుంటే, ప్రభుత్వం ఎందుకు ఘటనలకు కారకులైనవారిని అరెస్ట్ చేయలేక పోయిందన్నారు? 

ప్రవీణ్ చక్రవర్తిఎవరు, అతనికి బ్రదర్ అనిల్ కుమార్ కు ఉన్నసంబంధాలేమిటి? సదరు పాస్టర్ కు కడపలో బ్యాంక్ ఎకౌంట్ ఎందుకుంది? ఆ అకౌంట్ కు డబ్బులు ఎక్కడి నుంచి వస్తున్నాయి, ఎవరిమద్థతుతో ప్రవీణ్ చక్రవర్తి దేవాలయాలపై దాడులుచేశాడు అనేఅంశాలపై ప్రభుత్వం ఎందుకు లోతైన విచారణ జరపడంలేదన్నారు? 

ప్రభుత్వ మద్ధతు లేకుండా 161 ఘటనలు జరిగాయంటే ఎవరూ నమ్మేస్థితిలో లేరన్న బొండా ప్రవీణ్ చక్రవర్తి వంటివారు తాముచేసిన దురాగతాలను బహరంగం గా చెబుతున్నా అతన్నిపాలకులు ఎందుకు ఉపేక్షిస్తున్నారన్నా రు.  హిందూమతపరిరక్షకులు, స్వామీజీలు జగన్ మద్ధతుతోనే రాష్ట్రంలో హిందూమతంపై దాడులుజరుగుతున్నాయని బహిరంగం గానే చెబుతున్నారన్నారు.

హిందూమతంకోసం, దానిరక్షణకోసం ఎన్నోఏళ్లనుంచి పనిచేస్తున్నవారే ప్రభుత్వతీరుని తప్పుపడుతు న్నారన్నారు. జగన్మోహన్ రెడ్డి అధికారంలోకి వచ్చాకే ఇలా ఎందుకు జరుగుతున్నాయనే ఆలోచన ప్రతిఒక్కరిలోనూ ఉందన్నారు. 

అచ్చెన్నాయుడు తనసమీప బంధువుతో ఫోన్ లో మాట్లాడితే, ఆయనపై హత్యాయత్నం కేసులుపెట్టి, జైలుకుపంపిన ప్రభుత్వం, ప్రవీణ్ చక్రవర్తి అనేవ్యక్తి బహిరంగంగా సోషల్ మీడియాలో తాను చేసిందిచెప్పినా, జగన్ అండ్ కో అతనిపై ఎందుకు చర్యలు తీసుకో లేకపోయిందో సమాధానంచెప్పాలని బొండాఉమా నిలదీశారు. 
 
రాజమహేంద్రవరంలో టీడీపీవారే పూజారికి డబ్బులిచ్చి విగ్రహాన్ని ధ్వంసంచేయించారని చెప్పిన అధికారపార్టీ,  ఆ ఘటనలో పూజా రులే విగ్రహాన్ని ధ్వంసం చేశారని చెప్పి, నేరాన్ని వారిపై మోపిందన్నారు. తాను నిత్యం కొలిచే దైవాన్ని ఏ అర్చకుడు తనకు తానుగా ధ్వంసం చేయడనే ఇంగితంకూడా లేకుండా ప్రభుత్వం, పాలకులు ఇటువంటి కథలు అల్లడం సిగ్గుచేటన్నారు.

దేవాలయాలపై దాడులకు సంబంధించి ప్రభుత్వం ఏర్పాటుచేసిన సిట్ ఇప్పటి వరకు కొండనుతవ్వి ఎలుకనుకూడా పట్టలేకపోయిందన్నారు. తిరుమల తిరుపతి బస్ టిక్కెట్ల వెనకాల అన్యమత ప్రచారానికి సంబంధించిన సమాచారాన్ని ముద్రించిన ప్రభుత్వం, టీడీపీ ఆందో ళనతో వెనక్కుతగ్గిందన్నారు.

స్వామివారి కార్యక్రమాలను ప్రసారం చేయాల్సిన ఎస్వీబీసీ ఛానల్లో పోర్న్ సైట్ల లింకులు రావడంఎంతటి దారుణమో ఆలోచించాలన్నారు. శ్రీశైలంలో, సింహాచలంలో, అన్నవరంలో జరిగినఘటనలపై ప్రభుత్వం ఏంచర్యలు తీసుకుందన్నారు.

కనకదుర్గమ్మ గుడిలో వెండిసింహాలు మాయమైతే ఏంచర్యలు తీసుకున్నారన్నారు. పనికిమాలిన దేవాదాయమంత్రి ఇవేవీ తనకు పట్టవన్నట్టు తిరుగుతన్నా, అతనిపై ప్రభుత్వం ఒక్కటంటే ఒక్కచర్యకూడా తీసుకోలేదన్నారు. తనకువచ్చే కలెక్షన్లలో వాటాను అతను తాడేపల్లికి ఇస్తున్నాడు కాబట్టే అతన్ని వదిలేశారన్నారు.

ఏ తప్పుచేయకపోయినా, అశోక్ గజపతిరాజు అనే మహోన్నతవ్యక్తి గురించి వెల్లంపల్లి  నీచంగా మాట్లాడాడని, తప్పులమీద తప్పులుచేస్తూ, నిత్యం వాటాలు తాడేపల్లికి చేరవేస్తున్న వెల్లంపల్లి శ్రీనివాస్ పై మాత్రం ఈ ప్రభుత్వంలో ఎటువంటి చర్యలు లేవన్నారు. 

ఇన్నిజరుగుతుంటే ఇన్నాళ్లూ  చోద్యంచూసిన ప్రభుత్వం, ఇప్పుడు హిందూమతంపై దాడుల నెపాన్ని టీడీపీపై వేయాలని చూస్తోందన్నారు.  ప్రవీణ్ చక్రవర్తి కాల్ డేటాపరిశీలన, అతనికి కడపకు ఉన్నసంబంధం, అతని ఎకౌంట్ కు ఎక్కడినుంచి నిధులువస్తున్నాయి, అతని వ్యాఖ్యలు, సోషల్ మీడియాలో అతనుహిందూమతానికి వ్యతిరేంగాచేసిన ప్రచారం, వంటి ఘటనలపై ప్రభుత్వం తక్షణమే సీబీఐ విచారణకు ఆదేశించాలని బొండా ఉమా డిమాండ్ చేశారు.

సిట్ అధికారులకు చేతనైతే అసలు దొంగలను పట్టుకోవాలని, అలా కాకుండా తప్పుడు ప్రకటనలు చేస్తూ, జరుగుతున్న వాటినుంచి ప్రజలదృష్టి మళ్లించాలని చూస్తే, టీడీపీ న్యాయపోరాటం చేయడాని కి సిద్ధంగా ఉందన్నారు. సిట్ అధికారులు, ప్రభుత్వం, ప్రభుత్వ పెద్దలు తమ అసమర్థతను కప్పిపుచ్చుకునే క్రమంలోనే టీడీపీ వారిని దేవాలయాలపై జరుగుతున్న ఘటనల్లోకి లాగాలని చూస్తున్నారన్నారు.

సజ్జల రామకృష్ణారెడ్డి మాటలతోనే వైసీపీ భవి ష్యత్ ప్రణాళికఏమిటో తేలిపోయిందన్నారు. విగ్రహాలు ధ్వంసాల పేరుతో జగన్ ప్రభుత్వం తనరాజకీయ ఎజెండాను సజ్జల మాటల్లో నే బహిర్గతంచేసిందన్నారు. వంగవీటి మోహన్ రంగా, డాక్టర్ బీ.ఆర్. అంబేద్కర్ విగ్రహాల ధ్వంసానికి టీడీపీప్రణాళికలు వేస్తోందని ఆయన చెబుతుంటే, అధికారంలోఉన్న ప్రభుత్వం ఏం పీకుతోందని మాజీఎమ్మెల్యే మండిపడ్డారు.

అంబేద్కర్, రంగా విగ్రహాల ధ్వంసంతో ప్రశాంతమైన గ్రామాల్లో చిచ్చుపెట్టడానికి ప్రభుత్వం కుట్రలు పన్నుతున్నట్లు తేలిపోయిందన్నారు. కాపులు, ఎస్సీలకు మధ్యచిచ్చుపెట్టేలాచేసి, బీసీలు, ఇతరవర్గాలకు మధ్య కలహాలు రాజేసేలా ప్రభుత్వం తనకుటిలరాజకీయాలను అమలు చేయబోతోందని, సజ్జల మాటలతోనే తేలిపోయిందన్నారు.

రాము  డితలను ఖండించినవారు, రంగా, అంబేద్కర్ విగ్రహాలను ధ్వంసం చేయడానికి వెనుకాడరనే వాస్తవాన్ని గ్రహించి, ప్రతిఒక్కరూ వారి వారిప్రాంతాల్లోని విగ్రహాలను వారే కాపాడుకోవాలని బొండా పిలుపునిచ్చారు. అంబేద్కర్, రంగా విగ్రహాలపై దాడిజరిగితే, ప్రభుత్వం అంతుచూసేదాకా తగ్గబోమని ఉమా ఈసందర్భంగా తీవ్ర స్వరంతో హెచ్చరించారు. ప్రశాంత్ కిషోర్ డైరెక్షన్ లో ప్రభుత్వం, ప్రతిపక్షాలపై నిందలేయడం మానుకోవాలన్నారు.

Share this Story:

Follow Webdunia telugu

తర్వాతి కథనం

నేడు క్యాన్సర్ డే.. వరల్డ్ క్యాన్సర్ డే రోజు ఏం చేస్తారు?