Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia
Advertiesment

మళ్లీ అర్ధరాత్రి ఉత్తర్వుల కలకలం

మళ్లీ అర్ధరాత్రి ఉత్తర్వుల కలకలం
, శనివారం, 7 డిశెంబరు 2019 (11:34 IST)
ప్రభుత్వ,కాంట్రాక్టు,అవుట్‌ సోర్సింగ్‌ ఉద్యోగులు మూడేళ్లకు మించి మంత్రులు,ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి,ముఖ్యకార్యదర్శులు,జిల్లాల కలెక్టర్లు,ఎస్పీల కార్యాలయాలలో ఎవరూ పనిచేయరాదని తాజాగా GO.Ms.No.150 తేదీ5.11.2019 ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి నీలం సహాని పేరుమీద అర్థరాత్రి ఉత్తర్వులు జారీ అయ్యాయి.
 
ఇలాంటి నిర్ణయాలు తీసుకోవటం వెనుక ముఖ్యమంత్రి జగన్మోహనరెడ్డిని ఎవరు తప్పుదోవ పట్టిస్తున్నారు,అసలు ఏం జరుగుతోంది..?? అనే విషయంపై రకరకాల ఊహాగానాలు వినిపిస్తున్నాయి.మంత్రుల కార్యాలయాలలో గత ప్రభుత్వ హయాంలో తెలుగుదేశం మంత్రుల వద్ద పనిచేసిన సిబ్బందే ఎక్కువ మంది పని చేస్తున్నారని ముఖ్యమంత్రి కార్యాలయ ముఖ్యకార్యదర్శి ప్రవీణ్‌ ప్రకాష్‌ దృష్టికి కొంతమంది తీసుకువెళ్లారట. ఆయన ఈ విషయాన్ని ముఖ్యమంత్రి జగన్‌ దృష్టికి తీసుకెళ్లటం,వారివురు చర్చించిన అనంతరం ముఖ్యమంత్రి ఆమోదంతో ఉత్తర్వులు జారీ అయ్యాయి.
 
 గతంలో మూడేళ్లు నుండి పనిచేసిన ఆంతరంగికులు ఎవరూ తాజాగా ఆయా అధికారుల పేషీలలో పని చేయకూడదట.అనేక మంది ఆంతరంగిక సిబ్బంది ఎప్పటి నుండో మంత్రుల కార్యాలయాలలో పాతుకుపోయారట. మిగతా వారికి అవకాశం లభించటం లేదని ఆయా ఉత్తర్వుల్లో పేర్కొనటం విశేషం.

30 నవంబరు 2019వ తేది నాటికి మూడేళ్లు పూర్తి చేసుకున్నఉద్యోగులు,అధికారులందరికీ ఉద్వాసన పలికేందుకు రంగం సిద్దమైంది. అవుట్‌సోర్సింగ్‌ ఉద్యోగులను కూడా తప్పించాలని ఆ ఉత్తర్వుల్లో ఉండటం గమనార్హం. ఈ తతంగం అంతా ప్రవీణ్‌ ప్రకాష్‌ ఆధ్వర్యంలో ఈ కధ నడిచిందని చెప్పుకుంటున్నారు.

ఈ ఉత్తర్వులు ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి నీలం సహాని పేరుతో జారీ అయినా ఆమెకు అసలు విషయం తెలియదట.ఇదంతా నాకు ఎందుకులే అని ఆమె ఒక సంతకం పెట్టి ఉంటారని, తక్షణమే ఈ ఆదేశాలను అమలు చేయాలని లేకపోతే కఠిన చర్యలు తీసుకోవాల్సి వస్తుందని అధికారులు, మంత్రులతో ప్రవీణ్‌ ప్రకాష్‌ చెప్పినట్లు విశ్వనీయ వర్గాల సమాచారం.
 
చివరకు మంత్రులు, కలెక్టర్లు, శాఖాదిపతుల కార్యాలయాలలో పని చేస్తున్న నాలుగోతరగతి సిబ్బందికి కూడా ఈ ఉత్తర్వులు వర్తిస్తాయి.అంటే ఆంతరంగింక అధికారులు, సిబ్బందే కాదు అవుట్‌సోర్సింగ్‌ సిబ్బందితో పాటు నాలుగో తరగతి ఉద్యోగులు సైతం మూడేళ్లు పైగా ఒకే చోట పని చేస్తే తప్పించాల్సిందేనని అంటున్నారు.

ఈ ఉత్తర్వులు జారీ చేయటం వెనుక చంద్రబాబు ప్రభుత్వ హయాంలో మంత్రుల కార్యాలయాలలో ఆంతరంగిక అధికారులు, సిబ్బంది, అవుట్‌ సోర్సింగ్‌,కాంట్రాక్ట్‌, నాలుగోతరగతి ఉద్యోగులలో ఎక్కువ మంది మళ్లీ మంత్రుల కార్యాలయాలలో నియమితులయ్యారనే విషయం తెలుసుకున్న ముఖ్యమంత్రి జగన్‌ మంత్రి వర్గ సమావేశాలలో ఆవిధంగా నియమించకున్న మంత్రులను పలుదఫాలు హెచ్చరించినా వారు ఖాతరు చేయకపోవటంతో తాజాగా ఉత్తర్వులు జారీ చేసినట్లు స్పష్టమవుతోంది.

ఈ మధ్యలో ఎక్కడ ఏమి జరిగిందో కానీ శాఖాదిపతులు, డైరెక్టేట్‌, మరియు కమీషనరేట్‌ కార్యాలయాలలో కూడా పాత సిబ్బందే యధావిధిగా పని చేస్తున్నారని తెలుసుకున్న ప్రవీణ్‌ ప్రకాష్‌ వారందరికీ వర్తించే విధంగా ఒకే ఈ ఉత్తర్వును జారీ చేయించి ఉంటారని అనుకుంటున్నారు. ఆ ఉత్తర్వుల వివరాలు తెలుసుకున్న ఐఎఎస్‌ అధికారులు, మంత్రులు వాటిని అమలు చేస్తారా..? వేచి చూసే దోరణి అవలంభిస్తారా..? వేచి చూడాల్సిందే.

Share this Story:

Follow Webdunia telugu

తర్వాతి కథనం

బాలికపై అత్యాచారం.. మూడు నెలల గర్భిణిని కిరాతకంగా..?