Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia

సూళ్లు తెరుచుకున్నా ముందుకు సాగని 'మన ఊరు- మన బడి'

Advertiesment
school
, సోమవారం, 13 జూన్ 2022 (16:26 IST)
వేసవి సెలవుల తర్వాత సోమవారం నుంచి స్కూళ్లు తెరుచుకోనుండగా, 'మన ఊరు- మన బడి' కింద సర్కారు స్కూళ్లలో చేపట్టిన పనులు మాత్రం ఇంకా పూర్తి కాలేదు.
 
సిద్దిపేట జిల్లా కొమురవెల్లి మండలంలోని ఐనాపూర్ గవర్నమెంట్​ స్కూల్​. దీన్ని 'మన ఊరు మన బడి' కింద ఎంపిక చేసి, అడిషనల్​ క్లాస్​ రూమ్స్​ సహా వివిధ పనులు చేపట్టాలని నిర్ణయించారు. రూ.64 లక్షల పనులకు పర్మిషన్​ వచ్చింది. రూ.30 లక్షల బడ్జెట్​ మించితే టెండర్లు పిలవాలి. 
 
కానీ ఇప్పటికీ టెండర్ల ప్రక్రియ పూర్తి కాకపోవడంతో పనులు ప్రారంభించలేదు. స్కూల్​ శిథిలావస్థకు చేరింది. పాత గదుల్లోనే క్లాసులు నిర్వహించాల్సిన పరిస్థితి ఏర్పడింది.
 
మంచిర్యాల జిల్లా భీమారం మండల కేంద్రం కొత్తగూడెం కాలనీలోని ప్రైమరీ స్కూల్​ను 'మన ఊరు - మన బడి' స్కీం కింద ఎంపిక చేశారు. ఇక్కడ కాంపౌండ్, కిచెన్ షెడ్, డైనింగ్ హాల్, టాయిలెట్స్ తదితర పనులు చేపట్టేందుకు రూ.6 లక్షలు కేటాయించారు. 
 
కానీ ఫండ్స్​రాకపోవడంతో పనులు ప్రారంభించలేదు. కేవలం ఈజీఎస్​ స్కీం కింద టాయిలెట్స్​కు ఇలా గుంతలు తవ్వి వదిలేశారు. సర్కారు నుంచి నిధులు అందకపోవడంతో పనులు సాగట్లేదు 
 
తద్వారా వేసవి సెలవుల తర్వాత ఇయ్యాల్టి నుంచి స్కూళ్లు తెరుచుకోనుండగా, 'మన ఊరు మన బడి' కింద సర్కారు స్కూళ్లలో చేపట్టిన పనులు మాత్రం ఇంకా పూర్తి కాలేదు.
 
మొదటి విడతలో ఎంపిక చేసిన 9వేల స్కూళ్లలో జూన్​12లోగా అన్ని సౌకర్యాలు కల్పించాల్సి ఉంది. కానీ వెయ్యికి పైగా స్కూళ్లలో ఇప్ప టికీ పనులు మొదలు కాలేదు. అసంపూర్తి పనుల వల్ల అటు టీచర్లు, ఇటు స్టూడెంట్లకు కష్టాలు తప్పేలా లేవు.
 
సర్కారు బడుల దశ మారడం లేదు. ప్రభుత్వం చెప్తున్న మాటలు ఉత్తిమాటలే అవుతున్నాయి. రాష్ట్రవ్యాప్తంగా 26,065 గవర్నమెంట్​ స్కూళ్లు ఉండగా.. 'మన ఊరు.. మనబడి' కింద రూ.7,289.54 కోట్లతో మూడు విడతల్లో మౌలిక వసతులు కల్పిస్తామని ఆరునెలల కింద రాష్ట్ర సర్కార్​ ప్రకటించింది. 
 
మొదటి విడతలో 9,123 బడులను ఎంపిక చేసి, రూ. 3,497.62 కోట్లతో12 రకాల సౌకర్యాలు కల్పిస్తామని ఫిబ్రవరిలో జీవో రిలీజ్ చేసింది. ఈ స్కీంలో భాగంగా ఎంపిక చేసిన స్కూల్​భవనాలకు అవసరమైన అన్ని రిపేర్లు, శిథిలమైన గదుల స్థానంలో కొత్త క్లాస్​రూమ్స్‌తో పాటు వంటగదులు, ప్రహరీ, మరుగుదొడ్లు, డైనింగ్​రూంల​ నిర్మాణం చేపట్టాలి. 
 
ఇంకా తాగునీటి వసతితోపాటు కుర్చీలు, బెంచీలు సహా అన్ని రకాల ఫర్నిచర్​, గ్రీన్​ చాక్​ బోర్డ్స్, డిజిటల్​ఎడ్యుకేషన్​కు కావాల్సిన అన్ని రకాల పరికరాలు ఏర్పాటు చేయాల్సి ఉంది. సర్కారు నుంచి సరిపడా ఫండ్స్​ రాకపోవడంతో చాలా స్కూళ్లలో పనులు మొదలు కాలేదు. 
 
మొదలైన చోట నిధులు చాలక ఎక్కడికక్కడే ఆగిపోయాయి. రూ.30 లక్షలకు మించి బడ్జెట్​అవసరమయ్యే స్కూళ్లలో పనులకు ఇప్పటికీ టెండర్లు పిలవలేదు. ఈ క్రమంలో సోమవారం నుంచి స్కూళ్లు మొదలైతే పనులు కొనసాగడం కష్టమేననే అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి.

Share this Story:

Follow Webdunia telugu

తర్వాతి కథనం

నా ఆత్మహత్యకు నా భర్తే కారణం... గోడపై రాసి ప్రాణాలు తీసుకుంది...