డాక్టర్ సుధాకర్ కేసులో హైకోర్టు ఇచ్చిన తీర్పుపై మాజీ ఎమ్మెల్యే ఆమంచి కృష్ణ మోహన్ సంచలన వ్యాఖ్యలు చేశారు. డాక్టర్ సుధాకర్ కేసు ఒక పెటీ కేసు అని వ్యాఖ్యానించారు.
ఆ కేసుపై సీబీఐ విచారణ వేయడంపై యావత్ రాష్ట్రం విస్తుపోయిందన్నారు. కోర్టు తీర్పులను ప్రశ్నించకూడదని.. కానీ ఇలాంటి తీర్పులతో న్యాయస్థానాలపై నమ్మకం పోతోందని విమర్శించారు.
కరోనా లేకపోతే హైకోర్టు తీర్పుకి వ్యతిరేకంగా ఆందోళన చేసి ఉండేవాడినని చెప్పుకొచ్చారు. చిన్న చిన్న కేసులకు కూడా సీబీఐ విచారణ వేసే పనైతే.. ప్రతి పొలీస్‌స్టేషన్‌కు అనుబంధంగా కేంద్ర ప్రభుత్వం సీబీఐ ఆఫీసులు పెట్టాల్సి ఉంటుంది అంటూ ఆమంచి కృష్ణ మోహన్ అన్నారు.