Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia

7గురు మహిళలు, 14మంది కవలలు! ఫెర్టిలిటీలో అరుదైన రికార్డు!!

Advertiesment
7 women
విజయవాడ , గురువారం, 16 సెప్టెంబరు 2021 (13:44 IST)
మాతృత్వం అపురూపం.. ప్రతి మహిళా కోరుకునే ఓ వరం... సంతాన యోగం లేక ఏళ్ల తరబడి పిల్లల కోసం పరితపించే దంపతులకు ఆధునిక వైద్యంలో ఫెర్టిలిటీ వైద్య సేవలు అందుబాటులోకి వచ్చాయి. గత మూడేళ్లుగా ఫెర్టిలిటీ వైద్య విధానంలో వందల సంఖ్యలో దంపతులకు సంతాన ప్రాప్తి కలిగిస్తున్న ఖమ్మం బిలీఫ్‌ ఆస్పత్రిలో ఫెర్టిలిటీ వైద్య సేవల్లో అరుదైన రికార్డును నెలకొల్పింది. గత వారం రోజుల్లో ఏడుగురు మహిళలు 14 మంది బిడ్డలను కన్నారు.
 
ఒక్కో మహిళ (ట్విన్స్‌) ఇద్దరిద్దరు చొప్పున సంతానం లభించడం ఇక్క‌డ విశేషం. వీరంతా ఎంతో ఆరోగ్యంగా ఉన్నట్లు ఆస్పత్రి వైద్యురాలు డాక్టర్‌ శృతి మువ్వా తెలిపారు. ఆరుగురు మహిళలకు ఒక మగబిడ్డ, ఒక ఆడబిడ్డ చొప్పున జన్మించగా ఏడవ మహిళకు ఇద్దరు మగపిల్లలు జన్మించారు. దీంతో బిలీఫ్‌ ఆస్పత్రిలో ట్విన్స్‌ పిల్లల పంట పండిందని ఆ పిల్లల దంపతులు, బంధువులు సంతోషాన్ని వ్యక్తం చేస్తున్నారు. 
 
ఫెర్టిలిటీ వైద్య విధానంలో ఖమ్మం బిలీఫ్‌ ఆస్పత్రి ఉమ్మడి తెలుగు రాష్ట్రాల్లోనే అత్యథిక సంతాన ప్రాప్తి శాతాన్ని నమోదు చేసుకుందని ఆస్పత్రి వైద్యురాలు డాక్టర్‌ శృతి మువ్వా, డాక్టర్‌ మువ్వా రోహిత్‌ తెలిపారు. అరుదైన రికార్డును సాధించిన డాక్టర్లను హాస్పటల్‌ నిర్వాహకులు డాక్టర్‌ రమాజ్యోతి అభినందించారు.

Share this Story:

Follow Webdunia telugu

తర్వాతి కథనం

ఆన్‌లైన్ క్లాసులు తెచ్చిన తంటా.. చదువుల నిలయంగా శ్మశానం