Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia
Advertiesment

రూ 4,500 కోట్లతో 30 వేల పనులు: అక్టోబర్ 14వ నుంచి 20 వరకు ‘పల్లె పండుగ- పంచాయతీ వారోత్సవాలు'

pawan kalyan

ఐవీఆర్

, ఆదివారం, 13 అక్టోబరు 2024 (21:02 IST)
ఆంధ్ర ప్రదేశ్ కూటమి ప్రభుత్వం ప్రపంచ రికార్డు సృష్టించిన గ్రామసభల్లో చేసుకున్న తీర్మానాలు కార్యరూపం దాల్చనున్నాయి. అక్టోబర్ 14వ తేదీ నుంచి 20వ తేదీవరకు జరగబోయే ‘పల్లె పండుగ- పంచాయతీ వారోత్సవాలు' కార్యక్రమం ద్వారా రూ. 4,500 కోట్ల నిధులతో 30,000 పనులు చేపట్టనున్నారు. ఈ పంచాయతీ వారోత్సవాల్లో భాగంగా... 500 కిలోమీటర్ల బీటీ రోడ్ల నిర్మాణం జరుగనుంది.
 
ఇంకా 3000 కిలోమీటర్ల మేర సిమెంట్ రోడ్ల నిర్మాణం, 8 లక్షల కుటుంబాలకు 100 రోజుల పని, 25,000 గోకులాలు, 10,000 ఎకరాల్లో నీటి సంరక్షణ ట్రెంచులు చేపట్టనున్నారు. చిత్తశుద్ధి, ప్రజలకు మంచి చేయాలనే ధృడ సంకల్పం కలిగిన నాయకత్వంతో రాష్ట్ర ప్రగతి పరుగులు పెడుతుందని కూటమి ప్రభుత్వం చెబుతోంది.

Share this Story:

Follow Webdunia telugu

తర్వాతి కథనం

6వ యువి స్పేస్ స్టేషన్‌ను విశాఖపట్నంలో ప్రారంభించిన అల్ట్రావయోలెట్