Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia

శక్తివంతమైన మీడియాటెక్ డిమెన్సిటి 7300X ప్రాసెసర్‌తో AGNI 3ను ప్రవేశపెట్టిన లావా

Advertiesment
AGNI 3

ఐవీఆర్

, శనివారం, 5 అక్టోబరు 2024 (23:19 IST)
ప్రముఖ భారతీయ స్మార్ట్‎ఫోన్ తయారీదారు, లావా ఇంటర్నేషనల్ లిమిటెడ్, తన అత్యంత వేగవంతమైన స్మార్ట్‎ఫోన్, లావా AGNI 3 ప్రారంభాన్ని ప్రకటించింది. ఇది ఈ పండుగ సీజన్లో వచ్చిన ఒక హై-టెక్ స్మార్ట్‎ఫోన్. ఐఎన్‎ఆర్ 19,999 ప్రారంభ ధరలో విభాగపు-మొదటి ఫీచర్స్‌తో కొత్త ఉత్కృష్టత ప్రమాణాలను ఏర్పరుస్తూ, AGNI 3 ఈనాటి టెక్ సావి జనరేషన్ కొరకు తయారుచేయబడింది. ప్రముఖ శ్రేణిని విస్తరిస్తూ, ఈ కొత్త స్మార్ట్‎ఫోన్ ఒక అద్భుతమైన యూజర్ అనుభవాన్ని ఇస్తుంది. ఇది కట్టింగ్ ఎడ్జ్ హార్డ్‎వేర్, సాఫ్ట్‎వేర్ అభివృద్ధులను కలుపుతుంది. చార్జర్ లేకుండా 8GB+128GB, చార్జర్‌తో 8GB+128GB, చార్జర్‌తో 8GB+256GB అనే మూడు వేరియంట్స్‌లో ప్రారంభమైన AGNI 3 అక్టోబరు 9, ఉదయం 12 గంటల నుండి అమెజాన్ పైన అమ్మకానికి అందుబాటులో ఉంటుంది. హెదర్ గ్లాస్, ప్రిస్టీన్ గ్లాస్ అనే రెండు రంగు వేరియంట్స్‌తో ప్రవేశపెట్టబడిన ఈ స్మార్ట్‎ఫోన్‌కు ఈరోజు మధ్యాహ్నం 12:00 గంటల నుండి ప్రీ-బుకింగ్ ప్రారంభం అవుతుంది.
 
ఈ సందర్భంగా వ్యాఖ్యానిస్తూ, శ్రీ. సుమీత్ సింగ్, హెడ్-ప్రాడక్ట్, లావా ఇంటర్నేషనల్ లి. ఇలా అన్నారు, “AGNI 3 లో సీరీస్‌ను నిర్వచించే ఆవిష్కరణ, ఉత్కృష్టతల సమ్మేళనం ఉంది. ఇది కేవలం ఒక స్మార్ట్‎ఫోన్ మాత్రమే కాదు; ఇది భారతదేశములో తయారుచేయబడిన, భారతదేశ సాంకేతిక నైపుణ్యానికి, అసమానమైన యూజర్ అనుభవాలతో నాణ్యమైన ఉత్పత్తులను అందించాలనే మా నిబద్ధతకు ఒక ప్రామాణికము. అనేక కట్టింగ్ ఎడ్జ్ ఫీచర్స్ ఉన్న ఈ కొత్త సీరీస్‌తో AGNI ఫ్యాన్ బేస్‌తో విస్తరిస్తుందని నేను ఆశిస్తున్నాను, విభాగములో స్మార్ట్‎ఫోన్ అనుభవాలను పునర్నిర్వచించుటకు సిద్ధంగా ఉంది.”
 
శ్రీ. అంకు జైన్, మేనేజింగ్ డైరెక్టర్, మీడియాటెక్ ఇండియా, ఇలా అన్నారు “మీడియాటెక్ డిమెన్సిటి 7300X అనేది ఉత్తమ 4nm ప్రాసెస్ నోడ్‌తో తయారుచేయబడిన ఒక ఫ్లాగ్‎షిప్-గ్రేడ్ చిప్సెట్, ఇది నెక్స్ట్-జనరేషన్ సామర్థ్యాలతో అద్భుతమైన పనితీరు, శక్తి సామర్థ్యాన్ని అందిస్తుంది. మీడియాటెక్ డిమెన్సిటి 7330X లో డ్యుయల్ డిస్ప్లే సపోర్ట్, మీడియాటెక్ ఇమేజ్iq 950తో అప్గ్రేడ్ ఫోటోగ్రఫీ నైపుణ్యము ఉన్నాయి. అలాగే ఇందులో మీడియాటెక్ హైపర్ ఇంజన్ ఆప్టిమైజేషన్స్ ద్వారా అనుకూలం చేయబడిన వేగవంతమైన గేమింగ్ ఫీచర్స్‌తో ప్రీమియం-గ్రేడ్ 12-బిట్ HDR-ISP ఉంటుంది."
 
విప్లవాత్మక డ్యుయల్ AMOLED డిస్ప్లే
లావా AGNI 3 విభాగములో డ్యుయల్ AMOLED డిస్ప్లేలు కలిగిన మొట్టమొదటి స్మార్ట్‎ఫోన్- ఒకటి ఫ్రంట్, మరొకటి బ్యాక్ వైపు. ప్రైమరీ డిస్ప్లే 120Hz రిఫ్రెష్ రేట్, HDR మరియు వైడ్‎వైన్ L1 సపోర్ట్ తో అద్భుతమైన 6.78 ఇంచులు 1.5K 3D కర్వ్డ్ AMOLED డిస్ప్లే. ఇది 1.7 బిలియన్ రంగులు మరియు 1200 nits లోకల్ పీక్ ప్రకాశాన్ని ఇస్తుంది. వెనుకవైపు ఉండే సెకండరీ డిస్ప్లే 1.74 ఇంచుల 2D AMOLED డిస్ప్లే. ఇది రియర్ కెమెరా ఉపయోగించి సెల్ఫీలు తీసుకోవడం, కాల్స్ అటెండ్ చేయడం, త్వరిత నోటిఫికేషన్స్ అందుకోవడం మరియు మ్యూజిక్ కంట్రోల్, స్టెప్స్ & క్యాలరీ ట్రాకర్, రికార్డర్ మొదలైన అనేక ఇతర అప్లికేషన్స్ ఉపయోగించడానికి ఖచ్చితమైనది.

Share this Story:

Follow Webdunia telugu

తర్వాతి కథనం

శబరిమల ఆలయ ప్రవేశం... రోజుకు 80వేల మంది మాత్రమే..