Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia

వీడు నరరూప రాక్షసుడు..! 16 మంది మహిళలను ఎలా చంపాడంటే..?

Advertiesment
Telangana
, ఆదివారం, 29 డిశెంబరు 2019 (12:53 IST)
ఎవరి ఊహకీ అందనంత ఘోరంగా మానవులు మారిపోతున్నారని చెప్పడానికి పై చిత్రంలో ముసుగులో కనిపిస్తున్న వ్యక్తే నిలువెత్తు నిదర్శనం. అమెరికాలో సీరియల్ కిల్లర్స్ లాగా మన దేశంలో కూడా మానవుని చంపే రాక్షసులు ఉన్నారంటే నమ్ముతారా? నమ్మక తప్పదు అండి. ఒకటి కాదు రెండు కాదు ఏకంగా 16 మంది యువతులని అతి దారుణంగా చంపి దేశవ్యాప్తంగా కలకలం సృష్టించాడు ఈ మానవ మృగం. 
 
వివరాల్లోకి పోతే, ఎరుకుల శ్రీను మహబూబ్ నగర్ జిల్లా బాలానగర్‌లోని గుండేడ్ గ్రామంలో నివసించేవాడు. అయితే గతంలో పలు నేరాలు చేసి కటకటాల పాలయ్యాడు. కొన్ని రోజుల పాటు జైలు జీవితం కొనసాగించి ఆపై విడుదలై బయటకు వచ్చాడు. జైలులో జీవితం గడిపినప్పటికీ అతని ప్రవర్తనలో అనువంత అయినా మార్పు రాలేదు. అలాగే హత్యలు చేయడం ప్రారంభించాడు. 
 
2007లో సొంత తమ్ముని హతమార్చి జైలుకు వెళ్లిన ఇతను మూడు సంవత్సరాల తర్వాత విడుదలయ్యాడు. ఆ తర్వాత కూడా అనేక నేరాలు చేస్తూ అరెస్టయ్యాడు. మళ్లీ కొన్ని సంవత్సరాల తర్వాత విడుదలయ్యాడు.
 
ఎరుకుల శ్రీను 2018వ సంవత్సరం నుంచి నలుగుర్ని హత్య చేసినట్టు పోలీసులు నిర్ధారించారు. ఇతని హత్యలలో స్పెషాలిటీ ఏంటంటే.. కల్లు దుకాణం దగ్గరికి వెళ్తాడు.. అక్కడికి కల్లు సేవించడానికి వచ్చిన మహిళలను టార్గెట్ చేస్తాడు.
 
మాయ మాటలు చెప్పి అతనితో తీసుకెళ్లి నిర్మానుష్య ప్రదేశంలో ఆ మహిళలను చంపి వారి దగ్గర ఉన్న నగదును బంగారాన్ని దొంగలించి పరారవుతాడు. అయితే, డిసెంబర్ 17న అలివేలమ్మ (53) మృతదేహాన్ని పోలీసులు గుర్తించారు. ఈమెను ఎవరో హత్య చేశారని క్లూస్ టీమ్ ద్వారా వీరు నిర్ధారించారు. ఈ హత్యలో ఎరుకల శ్రీను పాత్ర ఉంటుందని అనుమానించారు.
 
ఆ తర్వాత అతనిని విచారించగా తానే హత్య చేశాడని ఒప్పుకున్నాడు. అతన్ని పోలీసులు ఇతర నేరాల ఏమైనా చేశారా అని అడిగితే అతను చేసిన 16 హత్యల గురించి చెప్పి పోలీసులను విస్తుపోయేలా చేశాడు. మహబూబ్‌నగర్‌ జిల్లా ఎస్పీ రెమా రాజేశ్వరి మాట్లాడుతూ.. శ్రీనుపై పీడీ చట్టం నమోదు చేస్తున్నామని వెల్లడించారు.

శ్రీనుకు సహకరించిన అతని భార్య సాలమ్మను కూడా అదుపులోకి తీసుకున్నట్లు వెల్లడించారు. శ్రీను నుండి ఒకటిన్నర తులాల బంగారం 60 తులాల వెండిని పోలీసులు స్వాధీనం చేసుకున్నారు.

Share this Story:

Follow Webdunia telugu

తర్వాతి కథనం

దేశంలో కంటే రాష్ట్రంలోనే రోడ్డు ప్రమాదాలు అధికం : డీజీపీ