Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia

125 అడుగుల అంబేడ్కర్ కాంస్య విగ్రహం.. 14 నెలల్లో పనులు పూర్తి

Advertiesment
bronze statue
, బుధవారం, 4 నవంబరు 2020 (08:21 IST)
webdunia
విజయవాడ స్వరాజ్య మైదానంలో ఏర్పాటు చేయనున్న 125 అడుగుల భారీ అంబేడ్కర్‌ విగ్రహం, స్మృతివనం ఆక‌ర్ష‌ణీయంగా ఉండాల‌ని, స్మృతివనం వద్ద లైబ్రరీ, మ్యూజియం, గ్యాలరీ ఏర్పాటు చేయాలని ముఖ్య‌మంత్రి వైయ‌స్ జ‌గ‌న్ మోహ‌న్ రెడ్డి అధికారుల‌ను ఆదేశింశించారు.

స్వరాజ్య‌ మైదానంలో అంబేడ్కర్‌ విగ్రహం ఏర్పాటుపై సీఎం జగన్ సమీక్ష నిర్వ‌హించారు. ‌పరిశ్రమలు, ఐటీ శాఖ మంత్రి మేకపాటి గౌతమ్‌రెడ్డి, సీఎస్‌ నీలం సాహ్ని, పరిశ్రమల శాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి ఆర్‌.కరికాల వలవన్, పలువురు అధికారులు హాజర‌య్యారు.

ఈ సంద‌ర్భంగా విగ్ర‌హం ఏర్పాటుకు సంబంధించి అధికారులు రెండు రకాల ప్లాన్లను పవర్‌ పాయింట్ ప్రజెంటేషన్‌‌లో సీఎం జ‌గ‌న్‌కు చూపించారు. అందులో భాగంగా నాగపూర్‌లో ఉన్న అంబేడ్కర్‌ దీక్ష భూమి, ముంబైలో ఉన్న చైత్య భూమి, లఖ్‌నవూలోని అంబేడ్కర్‌ మెమోరియల్, నోయిడాలోని ప్రేరణాస్థల్‌ను అధికారులు చూపించారు.

అలాగే గ్యాలరీ, ఆడిటోరియమ్‌ ఎలా ఉంటుందన్న దానిపైనా కూడా అధికారులు ప్రజెంటేషన్ ఇవ్వ‌డంతో పాటు ప‌నులు మొదలుపెట్టిన 14 నెలల్లో పూర్తి చేసేలా ప్రణాళిక రూపొందించామని ముఖ్య‌మంత్రికి వివ‌రించారు.

ఈ సంద‌ర్భంగా సీఎం జ‌గ‌న్ మాట్లాడుతూ అంబేడ్కర్‌ స్మృతివనంలో ఏర్పాటు చేసే విగ్రహం దీర్ఘకాలం నాణ్యంగా ఉండాలని, స్ట్రక్చర్‌లో మెరుపు, కళ తగ్గకుండా ఉండాలని పేర్కొన్నారు. ల్యాండ్‌స్కేప్‌లో గ్రీనరీ బాగా ఉండాలని, అది ఏ మాత్రం చెడిపోకుండా చూడాలని అధికారుల‌ను ఆదేశించారు.

అంబేడ్కర్‌ స్మృతివనం వద్ద లైబ్రరీ, మ్యూజియం, గ్యాలరీ ఏర్పాటుతో పాటు, ఆయన జీవిత విశేషాలు ప్రదర్శించాలని నిర్దేశించారు. అంబేడ్కర్‌ సూక్తులను కూడా ప్రదర్శించాలని సూచన చేసిన సీఎం జ‌గ‌న్ పార్కు వద్ద రహదారిని విస్తరించి, ఫుట్‌పాత్‌ను కూడా అభివృద్ధి చేయాలని, రెండింటిని ఆకర్షణీయంగా తీర్చిదిద్దాలని అధికారుల‌ను ఆదేశించారు.

2022 ఏప్రిల్14 అంబేడ్కర్‌ జయంతి రోజున విగ్రహావిష్కరణ, స్మృతివనం ప్రారంభించాలని అధికారుల‌ను ఆదేశించారు.. కన్వెన్షన్‌ సెంటర్‌, పబ్లిక్‌ గార్డెన్‌, ధ్యానస్థూపం, బౌద్ద శిల్పాలు ఏర్పాటు . అదే విధంగా రెస్టారెంట్‌, లాబీ, ధ్యానకేంద్రం, చిల్డ్రన్స్ ప్లే ఏరియా, వాకర్స్ ట్రాక్‌, పౌంటెయిన్సూ ఏర్పాటు చేయాలని అధికారుల‌ను ఆదేశించారు.

Share this Story:

Follow Webdunia telugu

తర్వాతి కథనం

అమెరికా అధ్యక్ష ఎన్నికలు : ట్రంప్ ఆశలు గల్లంతు.. ఆధిక్యంలో బైడెన్