Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia
Advertiesment

జగన్ అభినవ ఆదర్శ అంబేద్కర్: ఎమ్మెల్యే జోగి రమేష్

జగన్ అభినవ ఆదర్శ అంబేద్కర్: ఎమ్మెల్యే జోగి రమేష్
, శుక్రవారం, 3 జులై 2020 (16:19 IST)
ఆంధ్రపదేశ్ ఔట్‌ సోర్సింగ్ కార్పొరేషన్‌ ఏర్పాటుతో రాష్ట్ర చరిత్రలో సువర్ణ అధ్యాయం నమోదైందని వైయస్‌ఆర్ కాంగ్రెస్‌ పార్టీ ఎమ్మెల్యే జోగి రమేష్ అన్నారు. ఔట్‌ సోర్సింగ్ వ్యవస్థను సమూలంగా సీఎం వైయస్ జగన్ మార్చేశారని జోగి రమేష్ తెలిపారు. 
 
తాడేపల్లిలోని పార్టీ కేంద్ర కార్యాలంలో ఆయన మీడియాతో మాట్లాడుతూ.... ఔట్‌సోర్సింగ్ ఉద్యోగులు పడిన బాధలు, కష్టాలను పాదయాత్రలో వైయస్‌ జగన్ మోహన్‌ రెడ్డి చూశారని అందుకే 50,449 మంది ఔట్‌సోర్సింగ్ ఉద్యోగస్తులకు భరోసా ఇచ్చేలా వారికి ప్రత్యేకంగా కార్పొరేషన్ ఏర్పాటు చేశారని తెలిపారు.

ఔట్‌సోర్సింగ్ ఉద్యోగులకు భద్రత ఇస్తూ సీఎం నియామక పత్రాలు ఇస్తున్నారని తెలిపారు. గతంలో ఔట్‌సోర్సింగ్ ఉద్యోగం కావాలంటే..ఎన్నో బాధలు, కష్టాలు పడాల్సి వచ్చేదన్నారు. ఔట్‌సోర్సింగ్ ఉద్యోగం పర్మినెంట్ కాదని తెల్సినా గత చంద్రబాబు ప్రభుత్వంలో కొన్ని లక్షలు లంచం ఇస్తే తప్ప ఉద్యోగం రాని పరిస్థితి ఉండేదని జోగి రమేష్ గుర్తు చేశారు.

ఆ ఉద్యోగంలో చాలీచాలని జీతాలతో, సక్రమంగా జీతాలు రాక వారు పడ్డ బాధలు, కష్టాలు, కన్నీళ్లు పాదయాత్రలో వైయస్‌ జగన్ మోహన్ రెడ్డి చూశారని తెలిపారు. నేడు ఔట్‌ సోర్సింగ్ కార్పొరేషన్ ఏర్పాటు ద్వారా ఉద్యోగులకు ఉద్యోగ భద్రతను కల్పిస్తూ.. అందులో కూడా ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనార్టీలకు 50 శాతం రిజర్వేషన్లు కల్పించిన మహానుభావుడు సీఎం వైయస్‌ జగన్ అన్నారు.

అంతేకాకుండా.. గ్రీన్‌ ఛానల్ ద్వారా ఒకటే తారీఖునే ఔట్‌సోర్సింగ్ ఉద్యోగులకు జీతాలు చెల్లించే గొప్ప కార్యక్రమానికి సీఎం వైయస్‌ జగన్‌ మోహన్ రెడ్డి శ్రీకారం చుట్టారని బీసీలు, ఎస్సీలు, ఎస్టీలు, మైనార్టీల తరఫున జోగి రమేష్ ధన్యవాదాలు తెలియజేశారు. 
 
టీడీపీ హయాంలో చంద్రబాబు బంధువు చెప్పుచేతల్లోనే ఔట్‌సోర్సింగ్ వ్యవస్థ..
ప్రభుత్వ ఉద్యోగులకు ఏవిధంగా ఈఎస్‌ఐ, పీఎఫ్‌ కట్‌ అవుతాయో.. ఇకపై నుంచి ఔట్‌సోర్సింగ్ ఉద్యోగస్తులకు కూడా ఆ సదుపాయాలను సీఎం కల్పించారని రమేష్ పేర్కొన్నారు. టీడీపీ హయాంలో ఔట్ సోర్సింగ్ ఉద్యోగుల కాంట్రాక్టర్లు మొత్తం కూడా చంద్రబాబు చుట్టం, తాబేదార్లు, భాస్కరనాయుడు చెప్పుచేతల్లో ఉండేవారని రమేష్ గుర్తు చేశారు.

ఏ ఔట్‌సోర్సింగ్ ఉద్యోగం కావాలన్నా ఉద్యోగస్తుల దగ్గర డబ్బులు తీసుకొని ప్రభుత్వం దగ్గర డబ్బులు దండుకునేవారన్నారు. అంతేకాకుండా 50 మంది ఔట్‌సోర్సింగ్ ఉద్యోగులు పనిచేయాల్సిన చోట కేవలం 30 మందితోనే పనిచేయిస్తూ 20 మంది జీతాలు కూడా తీసుకొని ఖాతాల్లో వేసుకున్నారని మండిపడ్డారు.

వందల కోట్ల ప్రజాధనాన్ని గత చంద్రబాబు ప్రభుత్వం దుర్వినియోగం చేసిందని జోగి రమేష్ ఆగ్రహం వ్యక్తం చేశారు. ఇవాళ బీసీ, ఎస్సీ, ఎస్టీ, మైనార్టీలకు ఔట్‌సోర్సింగ్ ఉద్యోగాల్లో 50% రిజర్వేషన్ కల్పించిన అభినవ పూలే, ఆదర్శ అంబేద్కర్ సీఎం వైయస్‌ జగన్ మోహన్ రెడ్డి అని అన్నారు.

సీఎం వైయస్ జగన్ నిర్ణయంపై రాష్ట్ర ప్రజలంతా జేజేలు పలుకుతున్నారని నిజంగా ఇది ఒక చరిత్ర అన్నారు. మళ్లీ ఈ ఉద్యోగాల్లో 50% మహిళలకు రిజర్వేషన్లు ప్రవేశపెట్టిన ఘనత ముఖ్యమంత్రి వైయస్‌ జగన్ గారిదే అని అన్నారు. 
 
50వేలతో మొదలై.. లక్షల్లో ఉద్యోగాలు
దేశ చరిత్రలోనే బీసీ, ఎస్సీ, ఎస్టీ, మైనార్టీలకు ఒక చట్ట ప్రకారం, ఒక కార్పోరేషన్ పెట్టి రిజర్వేషన్లు ఇవ్వలేదు. కానీ మొట్టమొదటి శాసనసభా సమావేశాల్లోనే బీసీ, ఎస్సీ, ఎస్టీ, మైనార్టీలకు 50% నామినేటెడ్ పదవుల్లో, నామినేటెడ్ వర్కుల్లో చట్టం చేసి శాశ్వత బీసీ కమీషన్‌ను సీఎం వైయస్‌ జగన్ మోహన్ రెడ్డి ఏర్పాటు చేసిన సంగతిని ఈ సందర్భంగా జోగి రమేష్ గుర్తు చేశారు.

ఇప్పుడు మరో అడుగు ముందుకు వేస్తూ ఔట్‌సోర్సింగ్ ఉద్యోగాలను చట్టబద్ధత చేసి వారికి అండగా ఉంటానన్న మాటను వైయస్‌ జగన్ నిలబెట్టుకున్నారని తెలిపారు. జ్యోతిరావు పూలే, అంబేద్కర్ మాటలను తూ.చ తప్పకుండా అమలు చేసిన సీఎం వైయస్ జగన్ వెన్నంటే ఆయా వర్గాల ప్రజలంతా ఉన్నామని అన్నారు. చెప్పిన మాటను చేసి చూపించిన వైయస్‌ జగన్ కి అందరం కలిసికట్టుగా జేజేలు పలుకుతున్నామన్నారు.

ఈ ఔట్‌సోర్సింగ్  ఉద్యోగాలు 50వేలతో మొదలై.. లక్షల ఉద్యోగాలు రాబోతున్న శుభసందర్భంలో ముఖ్యమంత్రి వైయస్ జగన్ కి అభినందనలు తెలుపుకుంటున్నానని అన్నారు. దళారులు, అధికారులు, అవినీతిపరుల ప్రమేయం లేకుండా జిల్లా స్థాయిలో కలెక్టర్, జాయింట్ కలెక్టర్ అధ్యక్షతన ఔట్‌సోర్సింగ్ ఉద్యోగాలు ప్రభుత్వం ఇస్తోందన్నారు.

మరోవైపున ఇంఛార్జి మంత్రులతో ఔట్‌సోర్సింగ్ ఉద్యోగాల్లో రిజర్వేషన్ల ప్రక్రియ అమలవుతున్నదో లేదో చూస్తున్నారని తెలిపారు. ఎక్కడా కూడా ఎవ్వరూ లంచాలకు తావులేకుండా మంచి పరిపాలన సీఎం జగన్ అందిస్తున్నారని వివరించారు.  
 
అచ్చెన్నాయుడు ఆ స్కాం చేయకపోతే.. మరి బాబు, లోకేష్ చేయించారా..?
బీసీలను అణగదొక్కుతున్నారు, కక్ష కట్టి అరెస్ట్ చేస్తున్నామని కాల్వ శ్రీనివాసులు, దేవినేని ఉమామహేశ్వరరావు ట్వీట్లు, పత్రికా ప్రకటనలు చేయటంపై జోగి రమేష్ మండిపడ్డారు. అచ్చెన్నాయుడు అరెస్ట్‌ను తప్పుపడుతున్న వారు అవినీతిని సమర్థిస్తున్నారా అని ప్రశ్నించారు.

అచ్చెన్నాయుడు బీసీ అయినంత మాత్రాన కార్మికుల్లో బీసీలు, ఎస్సీలు, ఎస్టీలు, మైనార్టీలు లేరా అని ప్రశ్నించారు. వారు దాచుకున్న ధనం రూ.151 కోట్లు దోచుకుంటే దాన్ని వత్తాసు పలకటం ఏంటని మండిపడ్డారు. మరి అచ్చెన్నాయుడు ఒక్కరే రూ.151 కోట్లు తీసుకోలేదు.. నాకు సంబంధముందని చంద్రబాబు, లోకేశ్ చెప్పవచ్చు కదా అని ప్రశ్నించారు.

ఒకవేళ అచ్చెన్నాయుడు అప్రూవర్‌గా మారితే అది చంద్రబాబు, లోకేష్ మెడకు చుట్టుకుంటుందని హెచ్చరించారు. మాకు తెల్సి రూ.151 కోట్లు ఒక్క అచ్చెన్నాయుడు దోచుకొని ఉండరని చంద్రబాబుకు తెలియకుండా ఇంత పెద్ద స్కాం జరిగే అవకాశం ఉండదని అన్నారు.

అంతపెద్ద అవినీతి చేస్తే కేసులు పెట్టి అరెస్ట్ చేస్తే తప్పు ఏం ఉందని జోగి ప్రశ్నించారు. టీడీపీ నీచ రాజకీయాలను రాష్ట్ర ప్రజలు గమనిస్తున్నారని తెలిపారు. 
 
చంద్రబాబు ప్రోద్భలంతో.. కొల్లు రవీంద్ర ఆధ్వర్యంలో..మోకా భాస్కర్ హత్య
మచిలీపట్నంలో కొల్లు రవీంద్ర మీద కేసులు పెట్టామని టీడీపీ నాయకులు విమర్శిస్తున్నారు. మత్స్యకార వర్గానికి చెందిన వైయస్ఆర్సీపీ బీసీ నాయకుడు మోకా భాస్కర్ ని హత్య చేయించారు. మచిలీపట్నం చుట్టుపక్కల ప్రశాంతంగా ఉన్న వాతావరణాన్ని నాశనం చేశారు.

మోకా భాస్కర్ బలహీనవర్గానికి చెందిన వ్యక్తి కాదా? మార్కెట్ యార్డు ఛైర్మన్‌గా రెండుసార్లు పనిచేశారు. కౌన్సిలర్‌గా, బీసీ వర్గాల్లో బలమైన నాయకుడుగా ఎదుగుతున్న మోకా భాస్కర్‌రావును పొట్టన పెట్టుకున్నారని మండిపడ్డారు. కొల్లు రవీంద్ర ఒక్కడే బలహీన వర్గాల నాయకుడు అన్నట్లు చంద్రబాబు చెప్పటం ఏంటని జోగి నిలదీశారు.

మోకా భాస్కరరావు, కొల్లు రవీంద్ర ఒకేసామాజిక వర్గానికి చెందినవారే అని తెలిపారు. మోకా భాస్కరరావు ప్రజలతో సత్సంబంధాలు ఉన్నాయని... రాజకీయంగా ఎదుగుతున్నారని పొట్టన పెట్టుకున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. బలహీనవర్గాల్లో చిచ్చుపెట్టడమే కాకుండా, బలహీనవర్గాల కులాల్లో ఎవరు తమకు అడ్డువస్తారో వారిని రాజకీయంగా హత్య చేయించటంలో చంద్రబాబు మించిన ఘనుడు రాష్ట్రంలో ఇంకొకరు లేరని మండిపడ్డారు.

చంద్రబాబు ప్రోద్భలంతోనే ఈ హత్యలు అన్నీ జరుగుతున్నాయి. మోకా భాస్కరరావు హత్య కూడా చంద్రబాబు ప్రోద్భలంతో కొల్లు రవీంద్ర ఆధ్వర్యంలో జరిగిందని స్పష్టంగా చెబుతున్నామని అన్నారు. పాత్రధారి, సూత్రధారి కొల్లు రవీంద్రే. అందువల్ల కొల్లు రవీంద్రను అరెస్ట్ చేసి విచారించాల్సిందే అని డిమాండ్ చేశారు.

బీసీ వర్గాల పట్ల చంద్రబాబు మొసలి కన్నీరు కారుస్తూ.. కేసులు పెడుతున్నారనటంలో నిజం లేదన్నారు. బీసీ, ఎస్సీ, ఎస్టీ, మైనార్టీలను గొప్ప అవకాశాలు ఇస్తున్న సీఎం వైయస్ జగన్ మోహన్ రెడ్డిని అభినవపూలేగా, ఆదర్శ అంబేద్కర్‌గా కొనియాడుతున్నామని రమేష్ తెలిపారు.

దేశంలో అంబేద్కర్ రాజ్యాంగం ద్వారా ప్రభుత్వంలో రిజర్వేషన్లు ఇస్తే.. ఆస్ఫూర్తితో ఈరోజు దేశ చరిత్రలోనే మొట్టమొదటిసారిగా ఔట్‌సోర్సింగ్‌లో రిజర్వేషన్లు ఇచ్చినందుకు ఈ వర్గాల తరఫున మనస్పూర్తిగా సీఎం వైయస్‌ జగన్ కి ధన్యవాదాలు జోగి రమేష్ తెలియజేశారు.

Share this Story:

Follow Webdunia telugu

తర్వాతి కథనం

వైఎస్సార్‌లో వై అంటే వైవీ.సుబ్బారెడ్డి, ఎస్ అంటే సాయిరెడ్డి, ఆర్ అంటే రామకృష్ణారెడ్డి, దోచుకోమనీ...