Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia

ఇలాంటి రాజకీయ నాయకులను చూసి ఊసరివెల్లిలు కూడా సిగ్గుతో తలదించుకుంటున్నాయ్

Advertiesment
AP Politics

ఐవీఆర్

, బుధవారం, 10 ఏప్రియల్ 2024 (13:54 IST)
ఏపీలో ఏం జరుగుతోంది? రాజకీయ నాయకుల్లో కొందరు ఊసరివెల్లులు కంటే మించిపోతున్నారా? ఊసరవెల్లులు కూడా వారిని చూసి సిగ్గుతో తలదించుకుంటున్నాయా? విలువలను తుంగలో తొక్కి స్వార్థ ప్రయోజనాలే ముఖ్యంగా కప్పగంతులు వేసేస్తున్నారు. ఇలాంటివారిని ఆయా పార్టీలైతే తమతమ రాజకీయాలకు వాడుకుంటున్నారు కానీ ప్రజలు వీరికి శాశ్వతంగా కఠినమైన గుణపాఠం చెబితేనే మార్పు వస్తుంది. ఒక పార్టీలో సీటు రాలేదని తెల్లారేసరికి జెండా మార్చేసి పరుగులు తీసే నాయకులను ఏమనాలి?
 
ఇలాంటివారితో ప్రజలకు మేలు కలుగుతుందా? వీరు ప్రజా ప్రయోజనాల కోసం పాటుపడతారా? రాష్ట్రంలో ఏ నాయకుడు ఎంతకాలం ఏ పార్టీలో వుంటాడో తెలియని పరిస్థితి. ఒకరోజు తన ప్రత్యక్ష పార్టీని, పార్టీ అధినేతను బూతులు తిడతాడు. తర్వాతి వారంలో సదరు ప్రత్యక్ష పార్టీ తాయిలం ఇవ్వగానే సిగ్గు లేకుండా కప్పదాటు దాటేస్తాడు. తెల్లారేసరికి మళ్లీ ఎలాంటి లజ్జ లేకుండా తను తిట్టిన నాయకుడి వద్దకు వెళ్లి వంగివంగి నమస్కారాలు చేస్తాడు. వాస్తవానికి అలాంటి నాయకుడిని తమ పార్టీలో చేర్చుకునే అధినాయకుడికి విలువలనేవి లేకపోతుంటే ఆయననే తిట్టి ఆ పార్టీలోనే చేరే ఊసరవెల్లి నాయకుడికి అసలు వ్యక్తిత్వమే లేదు.
 
మొత్తమ్మీద ఏపీ రాజకీయాలు రోజుకోరకంగా మారిపోతున్నాయి. ఏ పార్టీ నుంచి ఏ నాయకుడు ఎప్పుడు జారిపోతాడో ఎవ్వరికీ తెలియడంలేదు. ఐతే ప్రజలు మాత్రం ఈపాటికే తమ ఓటు ఎవరికి వేయాలో దృఢంగా నిశ్చయం తీసుకున్నారని అర్థమవుతుంది. ఊసరవెల్లి నాయకులకు గట్టి గుణపాఠం చెబుతూ ప్రజలు తీసుకునే నిర్ణయం ఎలా వుంటుందో చూసేందుకు మరికొన్ని రోజులు వేచి చూడాల్సిందే. 

Share this Story:

Follow Webdunia telugu

తర్వాతి కథనం

వ్యాయామం, శారీరక శ్రమతో ఊబకాయులకు మంచిదే..