Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia
Advertiesment

AP Assembly Election 2024 : ఆ మూడు స్థానాలకు మినహా 18 సీట్లలో అభ్యర్థుల ఖరారు!!

pawan kalyan

వరుణ్

, ఆదివారం, 24 మార్చి 2024 (10:37 IST)
రానున్న అసెంబ్లీ ఎన్నికల్లో తమకు కేటాయించిన 21 స్థానాల్లో పోటీ చేసే అభ్యర్థుల ఎంపికపై జనసేన పార్టీ అధినేత పవన్ కళ్యాణ్ ముమ్మర కసరత్తులు చేస్తున్నారు. ఇందులో భాగంగా, ఇప్పటికే 18 స్థానాలకు అభ్యర్థులను ఖరారు చేసిన ఆయన మరో మూడు స్థానాలకు అభ్యర్థులను ఎంపిక చేయాల్సివుంది. నిజానికి జనసేన పార్టీ ఇప్పటివరకు ఏడు స్థానాలకు అభ్యర్థులను ప్రకటించింది. మరో 11 స్థానాలపై స్పష్టతనిచ్చింది. ఎంపిక చేసిన అభ్యర్థులను పిలిపించి ప్రచారం చేసుకోవాలని చెప్పినట్టు సమాచారం. అలాగే, ప్రకటించాల్సిన మూడు స్థానాల్లో పార్వతీపురం మల్యం జిల్లాలోని పాలకొండ, కృష్ణాజిల్లాలోని అవనిగడ్డ, అన్నమయ్య జిల్లాలోని రైల్వే కోడూరు స్థానాలు ఉన్నాయి. టీడీపీ, బీజేపీ పొత్తులో బాగంగా దక్కిన కోనసీమ జిల్లా పి.గన్నవరం అసెంబ్లీ స్థానం నుంచి గిడ్డి సత్యనారాయణ పేరును ఖరారు చేశారు. ఆయనకు శనివారం మంగళగిరిలోని పార్టీ ప్రధాన కార్యాలయానికి పిలిపించి పార్టీ అధినేత పవన్ కళ్యాణ్ ప్రచారం చేసుకోవాలని సూచించారు. 
 
అయితే, తిరుపతి అసెంబ్లీ స్థానం విషయంలో పీటముడి పడింది. ఇటీవల వైకాపాను వీడి జనసేన పార్టీలో చేరిన ఆరణి శ్రీనివాసులు ఆ స్థానాన్ని ఆశిస్తున్నారు. ఆయన స్థానికేతరుడు కావడంతో బీజేపీ, టీడీపీ నుంచి ఆయనకు సహకారం అందడం లేదు. పైగా, ఆ స్థానాన్ని హరిప్రసాద్, కిరణ్ రాయల్, టీడీపీ నుంచి మరో ఇద్దరు నాయకులు జనసేన టికెట్‌ను కోరుతున్నారు. సీటు ఇస్తే కనుక పార్టీలో చేరేందుకు వారు సిద్ధంగా ఉన్నారు. అలాగే, మచిలీపట్నం ఎంపీ స్థానం బాలశౌరికి దాదాపుగా ఖరారైంది. అయితే, ఆయన అవనిగడ్డ నుంచి బరిలోకి దించే యోచనలో పార్టీ ఉన్నట్టు సమాచారం. 
 
జనసేన ప్రకటించిన అభ్యర్థులు వీరే 
పిఠాపురం : పవన్ కల్యాణ్
తెనాలి : నాదెండ్ల మనోహర్
నిడదవోలు : కందుల దుర్గేశ్
అనకాపల్లి : కొణతాల రామకృష్ణ
నెల్లిమర్ల : లోకం మాధవి
కాకినాడ రూరల్ : పంతం నానాజీ
రాజానగరం : బత్తుల బలరామకృష్ణ
 
తాజాగా ఖారారైన 11 స్థానాలు
పెందుర్తి : పంచకర్ల రమేశ్
యలమంచిలి : సుందరపు విజయకుమార్
విశాఖపట్టణం దక్షిణం : వంశీకృష్ణ యాదవ్
తాడేపల్లిగూడెం : బొల్లిశెట్టి శ్రీనివాస్
భీమవరం : పులపర్తి ఆంజనేయులు
నరసాపురం : బొమ్మిడి నాయకర్
ఉంగుటూరు : పత్సమట్ల ధర్మరాజు
రాజోలు : దేవ వరప్రసాద్
తిరుపతి : ఆరణి శ్రీనివాసులు (అభ్యర్థిని మార్చే అవకాశం వుంది)
పి.గన్నవరం : గిడ్డి సత్యానారాయణ
పోలవరం : చిర్రి బాలరాజు 

Share this Story:

Follow Webdunia telugu

తర్వాతి కథనం

కిరాయి మూకలకు సుపారీ ఇచ్చిమరీ తండ్రిని చంపించిన టీజర్.. ఎక్కడ?