Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia

"కరోనా ఉంది.. ఎన్నికలు నిర్వహించవద్దు" .. స్థానిక పోరుకు సర్కారు మోకాలడ్డు!!!

Advertiesment
Andhra Pradesh
, గురువారం, 29 అక్టోబరు 2020 (10:01 IST)
ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో కరోనా వైరస్ కారణంగా ఆగిపోయిన స్థానిక సంస్థల ఎన్నికల ప్రక్రియను తిరిగి పునఃప్రారంభించాలని ఒధికార వైకాపా పార్టీ మినహా మిగిలిన అన్ని రాజకీయ పార్టీలు కోరుతున్నాయి. కానీ, అధికార వైకాపా మాత్రం కరోనా వైరస్ ప్రభావం ఇంకా తగ్గని పక్షంలో ఎన్నికలు ఎలా నిర్వహిస్తారంటూ ప్రశ్నిస్తోంది. అంటే.. ఇపుడు "కరోనా ఉంది.. ఎన్నికలు నిర్వహించవద్దు" అంటూ రాష్ట్ర ఎన్నికల సంఘానికి విన్నవించింది. 
 
స్థానిక ఎన్నికల నిర్వహణకు ఉన్న ఇబ్బందేంటని హైకోర్టు రాష్ట్ర ఎన్నికల సంఘాన్ని ప్రశ్నించి... నవంబరు 4న అఫిడవిట్‌ దాఖలు చేయాలని ఆదేశించిన నేపథ్యంలో బుధవారం రాష్ట్ర ఎన్నికల కమిషనర్‌ నిమ్మగడ్డ రమేశ్‌కుమార్‌ అన్ని రాజకీయ పార్టీలతో విడివిడిగా సమావేశమయ్యారు. మొత్తం 19 గుర్తింపు పొందిన రాజకీయ పార్టీలకు ఆహ్వానం పంపగా.. టీడీపీ, బీజేపీ, వామపక్షాలు, కాంగ్రెస్‌ సహా 11 పార్టీల ప్రతినిధులు స్వయంగా హాజరై వారి అభిప్రాయాలను తెలియజేశారు.
 
రాష్ట్రంలో మనుగడలో ఉన్న పార్టీల్లో ఒక్క వైసీపీ మాత్రమే హాజరుకాలేదు, ఎన్‌సీపీ, టీఆర్‌ఎస్‌, ఎంఐఎం, ఆర్‌ఎల్‌డీ, ఆర్ఎస్పీలకు ఆహ్వానం పంపినా ఆ పార్టీల నుంచి ఎవరూ రాలేదు. జనసేన, జేడీఎస్‌ ఈ-మెయిల్‌ ద్వారా తమ అభిప్రాయాలను తెలియజేశాయి. ఈ సమావేశానికి వచ్చిన నేతలంతా పాత నోటిఫికేషన్‌ను రద్దుచేసి కొత్త నోటిఫికేషన్‌తో ఎన్నికలు జరపాలని డిమాండ్‌ చేశారు. మార్చిలో ఎన్నికల ప్రక్రియ సందర్భంగా జరిగిన అక్రమాలు, హింసపై సీబీఐ విచారణ జరిపించాలని కోరాయి. 
 
కమిషనర్‌తో సమావేశమైన వారిలో కింజారపు అచ్చెన్నాయుడు(టీడీపీ), పాకా వెంకట సత్యనారాయణ(బీజేపీ), కె.రామకృష్ణ(సీపీఐ), వై.వెంకటేశ్వరరావు (సీపీఎం), షేక్‌ మస్తాన్‌వలీ(కాంగ్రెస్‌), బి.పుష్పరాజు(బీఎస్సీ), ఆంబ్రోస్‌ విల్సన్‌(ఏఐఏడీఎంకే), పీవీ సుందరరామరాజు(ఫార్వర్డ్‌ బ్లాక్‌), బషీర్‌ అహ్మద్‌(ఐయూఎంఎల్‌), ఎన్‌.సాంబశివరావు(జేడీయూ), వినయ్‌ పురుష్‌ యాదవ్‌(సమాజ్‌వాదీ) సమావేశమయ్యారు. తమ అభిప్రాయాలను ఆయనకు తెలియజేశా రు. అనంతరం ఆయా పార్టీల ప్రతినిధులు మీడియాకు వెల్లడించారు.

Share this Story:

Follow Webdunia telugu

తర్వాతి కథనం

చెన్నై నగరంలో రూ.5వేల కోట్లతో డబుల్ డెక్కర్ ఫ్లై ఓవర్-నితిన్ గడ్కరీ