Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia

షూటింగ్ గ్యాప్‌లో బాలయ్యతో పేకాట ఆడేదాన్ని : ఎమ్మెల్యే రోజా

వైకాపా ఎమ్మెల్యే, ఆ పార్టీ ఫైర్‌బ్రాండ్ ఆర్కే రోజా ఆసక్తికర వ్యాఖ్యలు చేసింది. తాను హీరోయిన్‌గా ఉన్న సమయంలో హీరో బాలకృష్ణతో పేకాట ఆడేదాన్ని అని చెప్పుకొచ్చింది. షూటింగ్ గ్యాప్‌లో బాలయ్య పేకాటకు పిలిచే

Advertiesment
షూటింగ్ గ్యాప్‌లో బాలయ్యతో పేకాట ఆడేదాన్ని : ఎమ్మెల్యే రోజా
, సోమవారం, 16 అక్టోబరు 2017 (11:06 IST)
వైకాపా ఎమ్మెల్యే, ఆ పార్టీ ఫైర్‌బ్రాండ్ ఆర్కే రోజా ఆసక్తికర వ్యాఖ్యలు చేసింది. తాను హీరోయిన్‌గా ఉన్న సమయంలో హీరో బాలకృష్ణతో పేకాట ఆడేదాన్ని అని చెప్పుకొచ్చింది. షూటింగ్ గ్యాప్‌లో బాలయ్య పేకాటకు పిలిచేవాడనీ, దీంతో తామిద్దరం కలిసి పేకాట ఆడేవాళ్ళమని తెలిపింది. ఈ ఘటన భైరవద్వీపం షూటింగ్ సమయంలో జరిగినట్టు తెలిపింది. 
 
తాజాగా ఆమె ఓ టీవీ చానెల్‌కు ప్రత్యేక ఇంటర్వ్యూ ఇచ్చింది. ఇందులో ఆమె మాట్లాడుతూ, తనకు చతుర్ముఖ పారాయణం ఎంతమాత్రమూ అలవాటు లేదనీ, కానీ, తాను పేకాట ఆడుతున్నట్టు తెలిస్తే, తన తల్లి కొట్టేదని చెప్పింది. హీరో బాలకృష్ణతో 'భైరవద్వీపం' చిత్రం చేసిన సమయంలో పేకాట ఆడానని చెప్పారు. ఆయనతో షూటింగ్ ఉంటే మాత్రం, సెట్లో పేకాట సందడి కనిపించేదన్నారు. 
 
'భైరవద్వీపం' సినిమా షూటింగ్ గ్యాప్‌లో తనను, సత్యనారాయణను పిలిచి పేకాటకు కూర్చేబెట్టేవారని, అప్పుడు మాత్రం తాను కూడా ఆడేదాన్నని చెప్పారు. డబ్బులకు మాత్రం కాదని నవ్వుతూ వెల్లడించారు. తనకేమీ పేకాటంటే ఇష్టం ఉండేది కాదని, అయితే, బాలయ్య ఒత్తిడితో నేర్చుకున్నానని అన్నారు. ఆపై మరెవరితోనూ ఆడలేదని అన్నారు. 
 
ఇకపోతే.. వందలాది సినిమాల్లో నటించి, ఎన్నో సూపర్ హిట్ చిత్రాలతో దక్షిణాది ప్రేక్షకులకు సుపరిచితురాలైన తనను కొంతమంది 'జబర్దస్త్ రోజా' అని పిలిచినప్పటికీ తాను పిసిరింత కూడా ఫీల్ కావడం లేదని చెప్పారు. 'జబర్దస్త్' కారణంగా, తనకు తెలుగు రాష్ట్రాల్లోని ప్రతి కుటుంబంలో బంధువులు దొరికారని అన్నారు. ఎన్నో కుటుంబాలకు నవ్వులను అందిస్తూ, వారి ఆరోగ్యాన్ని కాపాడుతున్న కార్యక్రమం 'జబర్దస్త్' అని, ఐదేళ్ల నుంచి ఓ కార్యక్రమం నడుస్తూ ఉన్నదంటే, అదేమీ ఆషామాషీ వ్యవహారం కాదని అన్నారు. 

Share this Story:

Follow Webdunia telugu

తర్వాతి కథనం

పాదయాత్రను జగన్ సద్వినియోగం చేసుకుంటే? వైఎస్సార్‌లా సీఎం కావడం ఖాయమా?