వైసీపీ ఎమ్మెల్యే రోజా ఎన్నికల కమిషనర్ నిమ్మగడ్డ రమేష్ కుమార్‌పై సెటైర్లు వేశారు. 2019లో ప్రజలు టీడీపీని సమాధి చేశారని, ఆ సమాధిలోంచి శవాన్ని తీసి బతికించాలనే ప్రయత్నం నిమ్మగడ్డ చేశారని, అది జరిగే పనికాదని మొన్ననే ప్రెస్ మీట్‌లో చెప్పానన్నారు. అదే ఇవాళ జరిగిందన్నారు.
2018లో పెట్టాల్సిన ఎన్నికలు.. అప్పుడు పెట్టకుండా కుట్రపూరితంగా ఇప్పుడు పెట్టారని విమర్శించారు. అయితే ప్రజలు టీడీపీకి, ఆ పార్టీ కోవర్టు అయిన నిమ్మగడ్డకు బుద్ధి చెప్పారని రోజా అన్నారు.