Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia
Advertiesment

చంద్రబాబుకు జైలు రెడ్డి మార్పు పాఠాలా? బెయిలు పక్షికి భయం వల్ల మతిచెడిందా !?

చంద్రబాబుకు జైలు రెడ్డి మార్పు పాఠాలా? బెయిలు పక్షికి భయం వల్ల మతిచెడిందా !?
, శుక్రవారం, 15 జనవరి 2021 (14:09 IST)
అభివృద్ధికి అర్థం చెప్పిన టిడిపి అధినేత చంద్రబాబుకు మార్పును గూర్చి వైకాపా ఎంపి విజయసాయిరెడ్డి చెప్పడం విడ్డూరంగా వుందని టిడిపి రాష్ట్ర అధికార ప్రతినిధి డాక్టర్ ఎన్ బి సుధాకర్ రెడ్డి వ్యంగాస్త్రాలు సందించారు.

శుక్రవారం ఆయన మీడియాతో మాట్లాడుతూ.. అవినీతి ఆరోపణలపై 16 నెలలు జైలులో గడిపి బెయిలుపై వున్న జైలు రెడ్డికి మార్పకు అర్థం తెలుసా అంటూ ఎద్దేవా చేశారు. మార్పు అంటే జ్ఞానం, పరివర్తన అన్న విషయం
జైలుకెల్లినా, ప్రజలు నెత్తిన  చెప్పులేసినా మారని విజయసాయి గుర్తించాలని హితవు పలికారు.

"చిత్తుగా ఓడిపోయి రెండేళ్లవుతున్నా ఎలా ఓడిపోయాడో  తెలియదంట" అనే ముందు చంద్రబాబు 14 సంవత్సరాలు ముఖ్యమంత్రిగా పని చేశారన్న విషయం గుర్తుకు రాదా అంటూ ప్రశ్నించారు. నీడలా వెంటాడుతున్న ఈడీ , సిబిఐ కేసులకు భయపడి, మతిచెడిన విజయసాయి అసంబద్దంగా మాట్లాడుతున్నారని తెలిపారు.

అడ్డదారిలో రాజ్యసభకు 
ఎన్నికైన  అవినీతి చక్రవర్తికి గెలుపు, ఓటములను గూర్చి మాట్లాడే అర్హత లేదన్నారు. చంద్రబాబు సంక్రాంతి ముగ్గు అయితే విసా రెడ్డి గోడకు కొట్టిన పిడక లాంటి వాడని చెప్పారు. రాష్ట్రంలో సాగుతున్న భూకబ్జాలు, అవినీతి, అక్రమాలకు బాసయిన విజయసాయి ఇకనైనా తీరు మార్చుకోవాలని హితవు పలికారు.

చట్టవిరుద్ధంగా సంపాదించిన వ్యక్తి నీతివంతుడు, ధనవంతుడు ఏనాటికి కాలేడన్న విషయం వైకాపా నేతలు గుర్తించాలన్నారు. ఏదోవిధంగా ఆ సొమ్ము పరుల చేతికే వెళుతుందనేది చాణిక్యనీతని తెలిపారు. ఏపీలో లక్షల కోట్ల అక్రమ సంపాదన ఈడీ, సీబీఐ వశం చేసుకున్నది ఎవరివద్దో అందరికీ తెలుసన్నారు.

ప్రజల దృష్టి మరల్చేందుకు విగ్రహాల విధ్వంసాలు సృష్టించిన వైకాపా నేతలు పోలీసుల అండతో ఆ నేరాలలో టిడిపి కార్యకర్తలును ఇరికించేదుకు కుట్ర పన్నుతున్నారని ఆరోపించారు.

పిల్లకాకికేమి తెలుసు ఉండేలు దెబ్బ అన్నట్టు నిర్మాణాత్మక రాజకీయలలో ఓనమాలు రాని విజయసాయి రెడ్డికి చంద్రబాబు గొప్పదనం ఎలా తెలస్తుందన్నారు. దీనిపై సుధాకర్ రెడ్డి ఒక వీడియోను విడుదల చేశారు.

Share this Story:

Follow Webdunia telugu

తర్వాతి కథనం

సీఎం జగన్‌పై అచ్చెన్న ఫైర్.. గోవును అడ్డం పెట్టుకుని రాజకీయాలా?