Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia

జగన్ పై వున్న కోపాన్ని చంద్రబాబు పై చూపుతున్నావా రోజా?: వంగలపూడి అనిత

Advertiesment
జగన్ పై వున్న కోపాన్ని చంద్రబాబు పై చూపుతున్నావా రోజా?: వంగలపూడి అనిత
, బుధవారం, 13 జనవరి 2021 (15:41 IST)
జగన్ పై వున్న కోపాన్ని చంద్రబాబు పై చూపుతున్నావా రోజా అంటూ టీడీపీ మహిళా విభాగం అధ్యక్షురాలు నిలదీశారు. బుధవారం ఆమె విలేఖరులతో మాట్లాడుతూ...

"జగన్ మంత్రి పదవి ఇవ్వలేదన్న ఆక్రోశాన్ని చంద్రబాబుపై చూపుతున్నావా రోజా? రైతులకు మద్దతు ధరలు లేక పంటలు తడిసి అలమోరుతుంటే ఇష్టానుసారంగా మాట్లాడటానికి సిగ్గుగాలేదా? ఇళ్ల పట్టాల పేరుతో దొరికికాడికి ఇష్టానుసారంగా దోచుకున్నారు. దీంతో సంక్రాంతి ఏంటి..మీరు ఏపండగైనా చేసుకుంటారు.

వచ్చే భోగిలో మీ చెత్త పాలనను తగలబెట్టేందుకు ప్రజలు సిద్ధంగా ఉన్నారు. అన్నింటా మీ చేతిలో మోసపోయిన ప్రజలకు పండగ ఎలా చేసుకోవాలో అర్థం కావడంలేదు. నీ పార్టీ నాయకులు, నీ కుంటుంబం సంతోషంగా ఉంటే సరిపోతుందా? సంక్రాంతి కానుకను పేదలకు ఎందుకు ఇవ్వలేదో జగన్ ను అడిగే ధైర్యం ఉందా.?

నగరిలో నీళ్ల బోరింగ్ తప్ప ఏ అభివృద్ధి కార్యక్రమాన్ని ప్రారంభించావో చెప్పు.? చంద్రబాబును తిడితే మంత్రి పదవి దక్కుతుందన్న ఆశతో పిచ్చికూతలు కూయవద్దు. నియోజకవర్గంలో సమస్యలపై ఏనాడైనా సమీక్ష నిర్వహించారా? నీ నియోజకవర్గానికి  అవసరమైన నిధులు కోసం ఎప్పుడైనా జగన్ ను ప్రశ్నించావా.? 

సినిమాల్లో ఐటం సాంగ్ వచ్చినట్లు నియోజకవర్గానికి గుర్తొచ్చినప్పుడు వచ్చి రోజా నోటికొచ్చింది మాట్లాడిపోతుంది. గ్రామాల్లో తిరిగి చూస్తే ప్రజలు పండగ చేసుకుంటున్నారో లేదో తెలుస్తుంది. ఏపీఐఐసీకి చైర్మన్ గా ఉండి ఒక్క ఉద్యోగాన్నైనా కల్పించావా?" అని నిలదీశారు.

Share this Story:

Follow Webdunia telugu

తర్వాతి కథనం

రైతు చ‌ట్టాల‌కు వ్య‌తిరేకంగా ఏక‌గ్రీవ‌ తీర్మానం చేయాలి: కేసీఆర్ కు భ‌ట్టి లేఖ