Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia
Advertiesment

పోలవరం జంట సొరంగాల పనులు ప్రారంభం

పోలవరం జంట సొరంగాల పనులు ప్రారంభం
, సోమవారం, 4 జనవరి 2021 (12:27 IST)
పోలవరం ప్రాజెక్టు నిర్మాణంలో ఆగిపోయిన ట్విన్‌ టన్నెల్స్‌ (జంట సొరంగాలు) నిర్మాణ పనులకు ఆదివారం జలవనరుల శాఖ అధికారులు, కాంట్రాక్టు సంస్థల అధికారులు పూజలు చేసి శ్రీకారం చుట్టారు.

ప్రాజెక్టు కుడి ప్రధాన కాలువకు ప్రధాన ద్వారాలైన ఈ జంట సొరంగాల పనులు 2018 నవంబరులో ఆగిపోయాయి. ఈ సొరంగాల నిర్మాణానికి ప్రొటెక్షన్‌ వాల్‌ కాంక్రీటు పనులను అధికారులు ఇప్పుడు ప్రారంభించారు.

డిప్లేషన్‌ స్లూయిజ్‌ గేట్లలో 4 ఎమర్జెన్సీ గేట్లు, 2 సర్వీస్‌ గేట్లు ఉంటాయి. వీటి నిర్మాణం ఫిబ్రవరి నెలాఖరుకు పూర్తవుతుందని.. సొరంగాల పనులు జూలై నాటికి పూర్తవుతాయని అధికారులు తెలిపారు.

Share this Story:

Follow Webdunia telugu

తర్వాతి కథనం

పోలీస్ నాన్న పోలీస్ కూతురికి 'సెల్యూట్'.. ఎక్కడ?.. ఏమాకథ?