Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia
Advertiesment

22న పోలవరం సందర్శన.. డిసెంబరు 1 నుంచి ఇళ్ల పట్టాల ఉద్యమం: సీపీఐ

22న పోలవరం సందర్శన.. డిసెంబరు 1 నుంచి ఇళ్ల పట్టాల ఉద్యమం: సీపీఐ
, బుధవారం, 18 నవంబరు 2020 (07:46 IST)
ప్రజాసమస్యల పరిష్కారం కోసం గళమెత్తి పోరాటం చేయడమే భారత కమ్యూనిస్టు పార్టీ అజెండా అని సిపిఐ రాష్ట్ర కార్యదర్శి కె.రామకృష్ణ స్పష్టం చేశారు. ఏ ప్రభుత్వం అధికారంలో ఉన్నప్పటికీ సీపీఐ ప్రజల పక్షాల పోరాటాలు కొనసాగిస్తుందని వెల్లడించారు.

సీపీఐ రాష్ట్ర కార్యదర్శివర్గ సభ్యులు, మాజీ ఎమ్మెల్సీ జల్లి విల్సన్ అధ్యక్షతన రాష్ట్రంలోని వివిధ జిల్లాల పార్టీ కార్యదర్శులు, నగర, పట్టణ కార్యదర్శులుతో వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించారు. సమావేశంలో పాల్గొన్న రామకృష్ణ మాట్లాడుతూ... రాష్ట్రంలో అపరిషృతంగా ఉన్న టిడ్కో ఇళ్ల సమస్వను లేవనెత్తి లక్దిదారులకు పంచే కార్యక్రమానికి శ్రీకారం చుట్టి ప్రభుత్వంపై ఒత్తిడి పెంచామని పేర్కొన్నారు.

లబ్ధిదారులతో కలసి సామూహిక గృహప్రవేశాలకు నడుంబిగించి ప్రభుత్వం కళ్లు తెరిచేలా ఉద్యమాన్ని నిర్వహించామన్నారు. ఎన్ని నిర్భంధాలు, అరెస్టులు చేసినా ప్రతి లబ్దిదారుడికి ఇల్లు అందేవరకూ తమ ఉద్యమాన్ని కొనసాగిస్తామన్నారు. ఎన్నికల సమయంలో వైసీపీ ఇచ్చిన హామీ ప్రకారం టిడ్కో ఇళ్లపై ఉన్న రుణాల‌ను పూర్తిగా రద్దు చేయాలని డిమాండ్ చేశారు.

వాలంటీర్లు, అధికారులు ప్రజల సేవకులనే విషయాన్ని గుర్తు పెట్టుకోవాలని, వైసీపీ కార్యకర్తల్లా ప్రజా ఉద్యమాలకు అడ్డుపడితే ఎక్కడికక్కడ నిలువరించాలని పార్టీ శ్రేణులకు పిలుపునిచ్చారు టి‌డ్కో ఇళ్ల వద్ద సరైన సౌకర్యాలు లేవని ఆ కారణంగానే లబ్దిదారులకు అందించలేకపోయాలని మంత్రులు, ఆధికారులు పేర్కొనడం హాస్యాన్పదంగా ఉందన్నారు. అధికారంలోకి వచ్చి 18 నెలలు గడుస్తున్నా అక్కడ సౌకర్యాలు కల్పించకుండా ప్రభుత్వం ఏం చేస్తోందని ప్రశ్నించారు.

రాష్ట్రంలో పూర్తైన ఇళ్లను లబ్ధిదారులకు అందించాలని, అక్కడ రోడ్లు, త్రాగునీరు, డ్రైనేజీ సహా పూర్తి స్థాయిలో సౌకర్యాలు కల్పించాలని డిమాండ్ చేతారు, మధ్యలోనే ఆగిపోయిన నిర్మాణాలను కూడా పూర్తి చేయాల్సిన బాధ్యత జగన్ ప్రభుత్వం పైనే ఉందని స్పష్టం చేశారు.

పేదలకు ఇళ్ల స్థలాల పేరుతో రాష్ట్ర వ్యాప్తంగా 7 వేల కోట్లకుపైగా ధనాన్ని వెచ్చించిందనీ, ఆయా ఇళ్ల స్థలాల పంపిణీ విషయంలోనూ ప్రభుత్వం నిర్లక్ష్యంగా వ్యవహరిస్తోందని వ్యాఖ్యానించారు. కోర్టు కేసుల పేరుతో ఇప్పటికే అనేక సార్లు ఇళ్ల స్థలాల పంపిణీని వాయిదా వేశారని గుర్తు చేశారు.

కోర్టు వివాదాలు లేని 39 వేల ఎకరాల్లో స్థలాలను తక్షణం పంపిణీ చేసి ప్రజలకిచ్చిన మాటను నిలుపుకోవాలని సూచించారు, ఇళ్ల పట్టాలకు సంబంధించి కేటాయిస్తున్న స్థలం విషయంలో ప్రభుత్వం తీసుకున్న నిర్ణయం సరిగా లేదని గ్రామీణ ప్రాంతాల్లో మూడు సెంట్లు, పట్టణ ప్రాంతాల్లో రెండు సెంట్లకు తక్కువ కాకుండా పట్టాల పంపిణీ చేయాలన్నారు.

లేని పక్షంలో డిసెంబరు నుంచి ఇళ్ల స్థలాల విషయంలో సీపీఐ ప్రత్యక్ష కార్యచరణలోకి దిగాల్సి వస్తుందని ప్రభుత్వాన్ని హెచ్చరించారు. ఈ నెల 23 నుంచి 30 వరకూ రాష్ట్ర వ్యాప్తంగా వివిధ మున్సిపాలిటీల్లో టిడ్కో గృహాల వద్ద సౌకర్యాల కల్పన కోసం నిరసన కార్యక్రమాలు నిర్వహింరాలని సూచించారు.

ఒంగోలు, మలిలీపట్నం రాజమండ్రి నగరాల్లో భారీ బహిరంగ సభలు నిర్వహించాలని నిర్ణయం తీసుకున్నట్టు వివరించారు. డిసెంబరు 1 నుంచి పేదల ఇళ్ల పట్టాల పంపిణీ విషయంపై దృష్టి సారించాలని, గ్రామ, మండల స్థాయిల్లో ఉద్యమాలను ముమ్మరం చేసి పేద ప్రజలకు అందగా నిలవాలని కార్యకర్తలకు దిశానిర్దేశం చేశారు.

కేంద్ర ప్రభుత్వం తెచ్చిన వల్ల చట్టాలకు వ్యతిరేకంగా ఈ నెల 26న జరుగనున్న సార్వత్రిక సమ్మెకు సీపీఐ సంపూర్ణ మద్దతు ఇస్తుందని తెలిపారు. సీపీఐ రాష్ట్ర సహాయ కార్యదర్శి ముప్పాళ్ల నాగేశ్వరరావు మాట్లాడుతూ.. పోలవరం విషయంలో ప్రభుత్వ వైఖరిని తప్పుబట్టారు కేంద్రం నుంచి పూర్తి స్థాయి నిధులను సాధించి ముందుగా నిర్ణయించిన మేరకు నిర్మాణాన్ని పూర్తి చేయాలని డిమాండు చేశారు.

ఈ నెల 22న సీపీఐ రాష్ట్ర నేతల బృందం పోలవరం ప్రాజెక్టు పనుల పరిశీలించనున్నట్లు తెలిపారు. ఈ సమావేశంలో సీపీఐ రాష్ట్ర కార్యదర్శివర్గ సభ్యులు పి.హరినాథరెడ్డి రాష్ట్ర కార్యవర్గ సభ్యులు కె.రామాంజనేయులు, కృష్ణా జిల్లా కార్యదర్శి అక్కినేని వనజ, ఆయా జిల్లాల కార్య‌ద‌ర్శులు జంగాల అజయ్‌కుమార్, ఎ.రామానాయుడు, ఎం.ఎల్.నారాయణ, జగదీష్, ప్రభాకర్, బి.గిడ్డయ్య, డేగా ప్రభాకర్, టి.మధు, ఒమ్మి రమణ,

నరసింహులు, ఏపీ మహిళా సమాఖ్య రాష్ట్ర ప్రధాన కార్యదర్శి పి.దుర్గాభవాని, విజయవాడ నగర కార్యదర్శి దోనేపూడి శంకర్, రాష్ట్రంలోని పలు నగరాల, పట్టణాల కార్యదర్శులు మరుపెళ్ల పైడిరాజు, ఇల్లా విశ్వనాధ్, శ్రీరాములు, ఎస్.వెంకటశివ మారుతీ వరప్రసాద్, బుగత అశోక్, కోనాల భీమారావు, శంకరరావు, సత్యప్రకాష్ తదితరులు పాల్గొన్నారు.

Share this Story:

Follow Webdunia telugu

తర్వాతి కథనం

24న తిరుమలకు రాష్ట్రపతి