Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia

తల్లి అతడిని రమ్మంది... కుమార్తెనూ ఫిక్స్ చేశాడు... ఉరి వేశారు..

పాశ్చాత్య సంస్కృతి మన దేశంలో చాపకింద నీరులా విస్తరిస్తోందనడానికి ఇదొక ఉదాహరణ. తల్లీకూతుళ్లు ఒకడినే ప్రేమించారు. ఇద్దరూ కలిసి అతనితో సహజీవనం చేశారు. అనుమాన్పదంగా కూతురు చనిపోయింది. అసలేం జరిగింది. తమిళ

Advertiesment
తల్లి అతడిని రమ్మంది... కుమార్తెనూ ఫిక్స్ చేశాడు... ఉరి వేశారు..
, బుధవారం, 30 మే 2018 (14:10 IST)
పాశ్చాత్య సంస్కృతి మన దేశంలో చాపకింద నీరులా విస్తరిస్తోందనడానికి ఇదొక ఉదాహరణ. తల్లి ఓ వ్యక్తితో సంబంధం పెట్టుకుంటే అతడు ఆమె కుమార్తెకు కూడా వల వేశాడు. దీనితో ఒకరికి తెలియకుండా మరొకరితో సదరు వ్యక్తి సహజీవనం చేశాడు. ఆ తర్వాత అనుమానాస్పదంగా కూతురు చనిపోయింది.

అసలేం జరిగిందంటే.... తమిళనాడు రాష్ట్రం చెన్నై పరిధిలోని గిండికి చెందిన వెంకటేశ్వర్లు, మంజులకు 17 సంవత్సరాల కుమార్తె దీక్ష ఉంది. వెంటేశ్వర్లు మార్కెటింగ్ పనుల కోసం బయటి ప్రాంతాలకు వెళ్ళివస్తుండేవాడు. మంజుకు ఫేస్‌బుక్ పిచ్చెక్కువ. ఫేస్‌బుక్ ద్వారా ఆమెకు కువైట్‌లో విజయ్ అనే వ్యక్తి పరిచయమయ్యాడు. ఆ పరిచయం కాస్తా సన్నిహిత సంబంధానికి దారి తీసింది. దాంతో అతడిని వారం రోజుల పాటు చెన్నైకు రమ్మని ఆహ్వానించింది. విజయ్ చెన్నైకు వచ్చాడు. 
 
కుమార్తెను కళాశాలకు పంపించి విజయ్‌తో లైంగికం సుఖాన్ని తీర్చుకోవడం మొదలుపెట్టింది. ఇదిలా సాగుతుండగా కళాశాలకు వెళ్ళిన దీక్ష ఒకరోజు మధ్యాహ్నమే ఇంటికి వచ్చేసింది. ఈ క్రమంలో తన తల్లితో పాటు ఇంట్లో ఉన్న విజయ్‌ను చూసింది. తల్లి మంజు ఏమాత్రం తడబాటు లేకుండా అతడు తన స్నేహితుడని కుమార్తెకు పరిచయం చేసింది.

మంజుతో ఎంజాయ్ చేస్తున్న అతగాడు ఆమె కుమార్తె దీక్షపై కూడా కన్నేశాడు. అంతే... రెండు రోజుల్లోనే దీక్షను కూడా లైన్లో పెట్టాడు. నిన్ను ప్రేమిస్తున్నానంటూ ఆమెను కూడా లొంగదీసుకున్నాడు. అలా ఇద్దరితోనూ అక్రమ సంబంధం కొనసాగించాడు. ఆ తర్వాత మెల్లిగా మంజుతో పెట్టుకున్న అక్రమ సంబంధాన్ని దీక్షకు చెప్పేశాడు. ఆ మాట విని షాక్ తిన్న దీక్ష చేసేదేమి లేక, తల్లితో ఆ సంబంధం మానుకోవాలనీ, మనిద్దరం పెళ్ళి చేసుకుందామని  పట్టుపట్టింది. అంతేకాదు... అతడి పేరును తన చేతిపై పచ్చబొట్టు వేయించుకుంది. 
 
విజయ్‌తో తనకున్న సంబంధాన్ని తల్లికి చెప్పింది. అతడిని పెళ్లాడుతానంటూ వెల్లడించింది. అయితే దీక్ష తల్లి అందుకు ఒప్పుకోలేదు. తనతో విజయ్ సాగిస్తున్న అక్రమ సంబంధాన్ని తన భర్తకు ఎక్కడ చెప్పేస్తుందేమోనన్న భయంతో  కన్న కూతురును హతమార్చాలని ప్లాన్ చేసింది. ఈ క్రమంలో మంజు, విజయ్‌లు ఇద్దరూ కలిసి ఇంటిలోనే దీక్షను ఉరి తీసి చంపేశారు. పోలీసులు అనుమానస్పద మృతిగా కేసు నమోదు చేసి దర్యాప్తు చేయగా అసలు విషయం బయటపడింది. నిందితులను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు.

Share this Story:

Follow Webdunia telugu

తర్వాతి కథనం

తిరుమలలో ప్రసాదాలు దొరకడంలేదు... ఎందుకంటే?