Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia

తిరుమలలో ప్రసాదాలు దొరకడంలేదు... ఎందుకంటే?

తిరుమల శ్రీవారికి లడ్డూ మాత్రమే కాదు. ఎన్నో రకాల అన్నప్రసాదాలను నైవేధ్యంగా పెడుతూ ఉంటారు. శ్రీవారి లడ్డూలు ఎంత రుచిగా ఉంటాయో స్వామికి పెట్టే దద్దోజనం, సీర, కదంబం, పులిహోర, పాయసం, సుగ్గీ, జిలేబీ ఇవన్నీ అంతకుమించి రుచిగా ఉంటాయి. నెయ్యి కారుతూ జీడిపప్పు

Advertiesment
తిరుమలలో ప్రసాదాలు దొరకడంలేదు... ఎందుకంటే?
, బుధవారం, 30 మే 2018 (13:57 IST)
తిరుమల శ్రీవారికి లడ్డూ మాత్రమే కాదు. ఎన్నో రకాల అన్నప్రసాదాలను నైవేధ్యంగా పెడుతూ ఉంటారు. శ్రీవారి లడ్డూలు ఎంత రుచిగా ఉంటాయో స్వామికి పెట్టే దద్దోజనం, సీర, కదంబం, పులిహోర, పాయసం, సుగ్గీ, జిలేబీ ఇవన్నీ అంతకుమించి రుచిగా ఉంటాయి. నెయ్యి కారుతూ జీడిపప్పు తేలుతూ ఉండే శ్రీవారి అన్నప్రసాదం కొద్దిగానైనా ఆరగించాలని ఆశపడతారు భక్తులు. అయితే ఇటీవల కాలంలో అన్నప్రసాదం దొరకడమే అరుదైపోతోంది. 
 
వకుళామాత పోటు, పాకశాలలో దాదాపుగా వెయ్యేళ్ళుగా అన్నప్రసాదాలు తయారవుతున్నాయి. ఇక్కడ సిద్థమైన ప్రసాదాలను శ్రీవారి గర్భాలయంలోకి తీసుకెళ్ళి స్వామివారికి నైవేథ్యంగా సమర్పించి ఆ తరువాత భక్తులకు అందిస్తారు. గంగాళాలకు గంగాళాలు ప్రసాదాలు తయారై వస్తూనే ఉంటాయి. రోజులో ఒకటిరెండు గంటల సమయంలో మాత్రమే చిన్న లడ్డూలను భక్తులకు ప్రసాదంగా ఇచ్చేవారు. మిగతా సమయమంతా అన్నప్రసాదాలనే పంపిణీ చేసేవారు. కానీ ఇప్పుడా పరిస్థితి లేదు.
 
ఉదయం నైవేధ్యమైన తరువాత మధ్యాహ్నం 12 గంటలకల్లా అన్నప్రసాదాలు ఖాళీ అవుతున్నాయి. ఇక అన్నప్రసాదం దొరకాలంటే మరుసటి రోజు వరకూ ఆగాల్సిందే. దీనికి కారణం అన్నప్రసాదాల తయారీ గణనీయంగా తగ్గిపోతుండటమనేది బహిరంగ రహస్యం. ఒకప్పుడు అన్నప్రసాదంలో 120 నుంచి 150 మంది పనిచేసేవారు. ప్రస్తుతం 60 మంది మాత్రమే పనిచేస్తున్నారు. ఒక బ్యాచ్‌లో 30 మంది మరో బ్యాచ్‌లో 30మంది పనిచేస్తున్నారు.
 
ప్రసాదాలను తయారుచేయడమే కాదు ఆ ప్రసాదాలను నైవేధ్యం కోసం గర్భగుడిలోకి తరలించారు. పనిభారం వల్ల ఎక్కువ ప్రసాదాలను తయారుచేయలేకపోతున్నారు. దీంతో ప్రసాదాల కొరత ప్రారంభమైంది. అన్నప్రసాదాలు లభించకపోవడంతో భక్తులు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. టిటిడి ప్రత్యామ్నాయ చర్యలు చేపట్టాలని డిమాండ్ చేస్తున్నారు శ్రీవారి భక్తులు.

Share this Story:

Follow Webdunia telugu

తర్వాతి కథనం

ముగ్గురితో భర్త అక్రమ సంబంధం... ప్రేమగా అన్నం పెట్టి అలా చేసిన భార్య...