Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia

వినుత మాజీ డ్రైవర్‌ను కాళహస్తిలో చంపి చెన్నై కూవం నదిలో పడేశారు: పోలీస్ కమీషనర్ అరుణ్

Advertiesment
Vinuta-s former driver murder case

ఐవీఆర్

, శనివారం, 12 జులై 2025 (19:10 IST)
శ్రీకాళహస్తి జనసేన మాజీ ఇన్‌చార్జి కోట వినుత, ఆమె భర్త చంద్రబాబు హత్య కేసులో నిందితులుగా తేలారు. తమ మాజీ డ్రైవర్ శ్రీనివాసులు ఉరఫ్ రాయుడిని ఆంధ్ర ప్రదేశ్ లోని కాళహస్తిలో హత్య చేసి అక్కడి నుంచి అతడి మృతదేహాన్ని తీసుకుని వచ్చి చెన్నై కూవం నదిలో పడేసి వెళ్లినట్లు చెన్నై పోలీసు కమీషనర్ వెల్లడించారు. ప్రెస్ మీట్లో ఆయన మాట్లాడుతూ... కూవం నదిలో మాకు మృతదేహం లభించింది. ఐతే మృతుడు ఎవరో వివరాలు తెలియలేదు. పోస్టుమార్టం రిపోర్టులో అతడిని ఎవరో హత్య చేసినట్లు తేలింది. దీనితో కూవం నది ప్రాంతంలో రోడ్లపై అమర్చిన సీసీ కెమేరాలు పరిశీలించాము. ఆ కమేరాల్లో శ్రీకాళహస్తికి చెందిన జనసేన నాయకురాలిదిగా గుర్తించాము. సీసీ కెమేరా దృశ్యాల ఆధారంగా నిందితులు ఐదుగురిని అదుపులోకి తీసుకున్నాము. ఈ హత్య ఎవరు చేసారు, వారు ఎందుకు చేసారన్నది దర్యాప్తులో తెలుస్తుంది'' అని అన్నారు.
 
డ్రైవర్ మర్డర్ కేసు: కాళహస్తి జనసేన ఇన్‌చార్జి వినుత సస్పెండ్
శ్రీకాళహస్తి జనసేన నియోజకవర్గ ఇన్ చార్జి కోట వినుతను పార్టీ నుంచి సస్పెండ్ చేస్తున్నట్లు జనసేన ఓ ప్రకటనలో తెలియజేసింది. చైన్నై నగరంలో కూవం నదిలో కాళహస్తికి చెందిన రాయుడు అనే యువకుడు శవమై తేలాడు. ఇతడిని ఐదుగురు వ్యక్తులు చిత్రహింసలకు గురిచేసి హత్య చేసి నదిలో పడవేసినట్లు వార్తలు వచ్చాయి. ఐతే ఈ నిందితుల్లో శ్రీకాళహస్తికి చెందిన జనసేన ఇంచార్జి వినుత, ఆమె భర్త చంద్రబాబు కూడా వున్నారంటూ వార్తలు రావడం తీవ్ర చర్చనీయాంశంగా మారింది.
 
రాయుడు హత్య కేసులో చెన్నై పోలీసులు ఐదుగురిని అరెస్ట్ చేసారు. వారిలో వినుత, చంద్రబాబు, శివకుమార్, గోపి, దాసర్ అనే ఐదుగురు వున్నారు. సీసీటీవి ఫుటేజిలో వీళ్లంతా అడ్డంగా దొరికిపోయినట్లు తెలుస్తోంది. ఈ వ్యవహారంపై జనసేన తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తూ వినుతను పార్టీ నుంచి సస్పెండ్ చేస్తూ నిర్ణయం తీసుకుంది.

Share this Story:

Follow Webdunia telugu

తర్వాతి కథనం

ఇన్‌స్టామార్ట్ 10 నిమిషాల డెలివరీని సాదరంగా ఆహ్వానించిన హైదరాబాద్