Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia

లక్ష 26 వేల ఉద్యోగాలతో గ్రామ స్వరాజ్యం.. పర్యాటక శాఖ మంత్రి

Advertiesment
లక్ష 26 వేల ఉద్యోగాలతో గ్రామ స్వరాజ్యం.. పర్యాటక శాఖ మంత్రి
, మంగళవారం, 1 అక్టోబరు 2019 (07:04 IST)
3 మాసాల్లో 80 శాతం వాగ్దానాలను అమలు చేసిన తొలి ముఖ్యమంత్రి గా వైయస్ జగన్మోహన్ రెడ్డి చరిత్ర సృష్టించారని పర్యాటక, సాంస్కృతిక, యువజన సర్వీసుల శాఖ మంత్రి ముత్తంశెట్టి శ్రీనివాసరావు పేర్కొన్నారు.

బీచ్ రోడ్డులో గల ఏయు కన్వెన్షన్ హాల్లో ఏర్పాటుచేసిన గ్రామ వార్డు సచివాలయ ఉద్యోగుల నియామక ఉత్తర్వుల పంపిణీ కార్యక్రమానికి ఆయన ముఖ్య అతిథిగా విచ్చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. భారతదేశానికి సంపద యువతే నని, వారిని, వారి శక్తిని రాష్ట్ర దేశ ప్రజా సేవకు ఉపయోగ పరిచే క్రమంలో ముఖ్యమంత్రి ముందుగా సచివాలయ ఉద్యోగాలను భర్తీ చేస్తున్నారన్నారు.

తమ ప్రభుత్వం చారిత్రాత్మక, నిజమైన ఫలవంతమైన పారదర్శకమైన ప్రజాస్వామ్య ప్రభుత్వమని చెప్పారు. వయస్సు అనుభవం కంటే సేవ చేయాలనే మనసు ఆశయం ముఖ్యం అని ఆయన నిరూపించారు అన్నారు. సమాజంలో అంతరాలు తగ్గించి సమసమాజ నిర్మాణానికి యువత కృషి చేయాలని పిలుపునిచ్చారు.

ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డికి ధనము పదవిపై వ్యామోహం లేదని ప్రజాసేవ ఆయనకు ఆనందం కలిగించే అంశమని చెప్పారు. నాయకుడంటే జగనేనని నిరూపించారని అన్నారు.  దేశంలో 60 శాతం ఉన్న యువత ఈ అవకాశాలను వినియోగించు కోవాలని, దేశం నీకేమిచ్చింది అనేకన్నా దేశానికి నువ్వేమి ఇచ్చావన్నది కాదన్నారు.

ఇది ఆరంభం మాత్రమేనని సాధించవలసింది ఇంకా ఉన్నదన్నారు. విఎంఆర్ డిఎ అధ్యక్షులు ద్రోణంరాజు శ్రీనివాస్ మాట్లాడుతూ ముఖ్యమంత్రి రాష్ట్రంలో కొత్త చరిత్రకు శ్రీకారం చుట్టారని పేర్కొన్నారు అన్ని రాష్ట్రాలకు ఆదర్శవంతమైన సాహసోపేత నిర్ణయం తీసుకున్నారని చెప్పారు. బాపూజీ కలలు కన్న గ్రామ స్వరాజ్యం నిజం చేసేందుకు పూనుకున్నారు అన్నారు.

 
రాష్ట్ర శాసనసభ విప్ బూడి ముత్యాలనాయుడు మాట్లాడుతూ ముఖ్యమంత్రి ఆశయాలకు అనుగుణంగా సచివాలయ ఉద్యోగులు పని చేయాలని పిలుపునిచ్చారు.  తల్లిదండ్రుల గౌరవాన్ని నిలబెడుతూ గ్రామ అభివృద్ధికి కృషి చేయాలన్నారు.

ఉద్యోగాలు పొందిన మాకవరపాలెం మండలం తూటిపాల గ్రామానికి చెందిన కిల్లాడి  అనురాధ, నాతవరం మండలం సరుగుడు గ్రామానికి చెందిన కుర్రా కిరణ్ కుమార్, అనకాపల్లికి చెందిన సి ఎస్ కుమార్ దేవరపల్లి కి చెందిన దివ్యాంగుడు ఎస్ కుమార్ మాట్లాడుతూ ముఖ్యమంత్రి జగన్మోహన రెడ్డి కి కృతజ్ఞతలు తెలిపారు.

 
జిల్లా కలెక్టరు వి.వినయ్ చంద్ మాట్లాడుతూ పురపాలక గ్రామపంచాయతీ లను బలోపేతం చేయడం ప్రజల వద్దకే ప్రభుత్వ సేవలు అందించడం ప్రభుత్వ లక్ష్యమని దానికి అనుగుణంగా 19 రకాల ఉద్యోగాలకు జూలై 26న నోటిఫికేషన్ విడుదల చేశారన్నారు.

జిల్లాలో 807 గ్రామ, వార్డు సెక్రటేరియట్ లలో 10, 873 పోస్టులకు 406 కేంద్రాల్లో పరీక్షలు నిర్వహించామన్నారు.7, 724 అభ్యర్థులను ధ్రువపత్రాల పరిశీలనకు పిలువగా 62 43 మంది హాజరయ్యారు అన్నారు. వారిలో 4362 మందిని ఎంపిక చేయడం జరిగిందని వివరించారు.

వీరు అక్టోబరు 1వ తేదీన సంబంధిత శాఖల లో రిపోర్టు చేసినట్లయితే కౌన్సెలింగ్ ఇస్తారని అనంతరం రెండవ తేదీన 7 గంటల నుండి విధులలో చేరవలసి ఉంటుందని తెలిపారు.

ఈ కార్యక్రమంలో అనకాపల్లి ఎంపీ బీవీ సత్యవతి శాసనసభ్యులు కరణంధర్మశ్రీ, గొల్ల బాబురావు తిప్పల నాగిరెడ్డి అన్నం రెడ్డి అదీప్ రాజు గుడివాడ అమర్నాథ్ కొట్టగుల్లి భాగ్యలక్ష్మి పెట్ల ఉమాశంకర్ గణేష్, జీవీఎంసీ కమిషనర్ డా జి సృజన జాయింట్ కలెక్టర్ ఎల్. శివ శంకర్, జె సి 2 సూర్య కళ నియోజకవర్గ ప్రత్యేక అధికారులు వివిధ శాఖల జిల్లా అధికారులు తదితరులు పాల్గొన్నారు.

Share this Story:

Follow Webdunia telugu

తర్వాతి కథనం

గాయ‌త్రీదేవిగా దుర్గ‌మ్మ