Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia

అధికారమంటే దోచుకోవడం.. దాచుకోవడం కాదు : విజయసాయి రెడ్డి

Advertiesment
అధికారమంటే దోచుకోవడం.. దాచుకోవడం కాదు : విజయసాయి రెడ్డి
, సోమవారం, 3 జూన్ 2019 (12:50 IST)
వైకాపా రాజ్యసభ సభ్యుడు విజయసాయి రెడ్డి మరోమారు మాజీ సీఎం చంద్రబాబు నాయుడు, ఆయన సారథ్యంలోని టీడీపీని లక్ష్యంగా చేసుకుని విమర్శలు గుప్పించారు. అధికారమంటే దోచుకోవడం.. దాచుకోవడం కాదని వ్యాఖ్యానించారు. 
 
ఈ మేరకు ఆయన తన ట్విట్టర్ ఖాతాలో వరుస ట్వీట్లు చేశారు. "అధికారం అంటే దోచుకోవడం, దాచుకోవడమేనని  పచ్చ పార్టీ వాళ్లు అనుకున్నారు. అందుకే ప్రజలు వారిని తరిమి కొట్టారు. మనం మాత్రం దీన్నొక పవిత్ర బాధ్యతగా భావించాలి. ప్రజలిచ్చిన అఖండ మెజారిటీ వారికి సేవ చేసేందుకు మాత్రమే అని అర్థం చేసుకోవాలి. జగన్ ఆశయాలకు అనుగుణంగా పనిచేయాలి" అని పేర్కొన్నారు. 
 
అలాగే," తానేం చేసినా అడ్డుకోరాదని చంద్రబాబు ఒక ఉద్యమమే చేశారు. సీబీఐని బ్యాన్ చేశారు. ఐటీ దాడులను అడ్డుకున్నారు. ఈడీ ఎలా వస్తుందని గుడ్లురిమారు. సీబీఐని రాష్ట్రంలోకి అనుమతిస్తూ జగన్ ఆదేశాలు జారీ చేశారు. దొంగలను రక్షించేది లేదని తేల్చిచెప్పారు. చూస్తున్నారా చంద్రబాబూ?" అంటూ మరో ట్వీట్‌లో పేర్కొన్నారు.

Share this Story:

Follow Webdunia telugu

తర్వాతి కథనం

వామ్మో.. వైరల్ అవుతున్న వాకమ్ ఛాలెంజ్.. చాలా డేంజర్