Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia

ఆ ఫుడ్ అంటే ఉపరాష్ట్రపతి వెంకయ్యకి చాలా ఇష్టం... కానీ రోడ్డుపైనే..?

Advertiesment
ఆ ఫుడ్ అంటే ఉపరాష్ట్రపతి వెంకయ్యకి చాలా ఇష్టం... కానీ రోడ్డుపైనే..?
, శనివారం, 8 జూన్ 2019 (19:08 IST)
విశాఖ సాగర తీరానికి వచ్చిన వారికి మూరీ మిక్చర్ ఎంతగానో మెప్పిస్తుంది. ఎక్కడా లేని విధంగా ఈ మిక్చర్‌కు ప్రత్యేకత ఉంది. సాగర తీరంలో మూరీ మిక్చర్ ఎంతో రుచిగా ఉంటుంది కాబట్టి ప్రముఖులు కూడా ఇక్కడకు వచ్చి దీనిని ఆరగిస్తుంటారు. ఉపరాష్ట్రపతి ముప్పవరపు వెంకయ్యనాయుడునే ఈ మిక్చర్ మురిపించిందంటే ఇది ఎంత రుచిగా ఉంటుందో ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. 
 
ఇంతకీ ఇందులో ఏమేం కలుపుతారోనని తెలుసుకోవాలన్న ఆశక్తి చాలామందిలో ఉంటుంది. తాజా మూరీలో టమోటా, అల్లం, బఠాణీ, బజ్జీ, కొత్తిమీర, నిమ్మకాయరసం, ఉప్పు, కారం ఇలా పలురకాల వస్తువులను కలిపి అమోఘంగా ఈ మిక్చర్‌ను తయారుచేస్తారు. సాగర తీరంలో చల్లని గాలుల మధ్య, ఎగిసిపడుతున్న కెరటాల మధ్య ఈ మిక్చర్ తింటే ఆ రుచే వేరు. అందుకే విశాఖ నగరవాసులతో పాటు పర్యాటకులు కూడా ఈ మూవీ మిక్చర్‌కు ఫిదా అవుతారు.
 
అన్నింటికీ మించి మిక్చర్‌ను కలిపే పద్థతిలోనే ఏదో టెక్నిక్ ఉంటుందట. అదే ఈ మూరీ మిక్చర్‌కు మంచి టేస్ట్‌ను తెస్తుంది. అందుకేనేమో ఏకంగా ఉపరాష్ట్రపతి, ఇంకా మరెందరో జాతీయ ప్రముఖులు లొట్టలు వేసుకుని ఈ మిక్చర్‌ను తింటారు.

Share this Story:

Follow Webdunia telugu

తర్వాతి కథనం

కేరళలో ఉరుములు, పిడుగులు... నత్తలా నడుచుకుంటూ రుతు పవనాలు...