తెలంగాణ రాష్ట్ర కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకుడు వి.హనుమంతరావు మంగళవారం నాడు ఆంధ్ర ప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు, ఉప ముఖ్యమంత్రి పవన్ కల్యాణ్‌తో భేటీ అయ్యారు. చంద్రబాబు నాయుడుతో పలు అంశాలపై ఆయన ముచ్చటించినట్లు సమాచారం. ఆ తర్వాత పవన్ కల్యాణ్ తో సమావేశమయ్యారు.
విహెచ్‌ను శాలువాతో డిప్యూటీ సీఎం సత్కరించి గణేష్ పటాన్ని ఇచ్చారు. అనంతరం ఇద్దరూ కొద్దిసేపు కూర్చుని ఆయా విషయాలపై చర్చించుకున్నట్లు కనబడింది. ఐతే వారు కూర్చున్న ఆసనం ఏవో ఖరీదైన సోఫాలు కావు. కేవలం టేకు మంచంపై కూర్చుని ఇద్దరూ కనిపించారు. మొత్తమ్మీద పవన్ కల్యాణ్ సింప్లిసిటీ మార్క్ ను ప్రతిచోటా ప్రతిబింబిస్తున్నట్లు కనబడుతోంది.