తిరుమల శ్రీవారి దర్శన టిక్కెట్లు అందుబాటులోకి రానున్నాయి. జులై, ఆగస్టు నెలలకు సంబంధించి కోటాను అందుబాటులోకి తీసుకొస్తున్నారు. రూ.300 ప్రత్యేక ప్రవేశ దర్శన టికెట్లను టీటీడీ నేడు ఉదయం 10 గంటలకు ఆన్‌లైన్‌లో విడుదల చేయనుంది.
రూ.300 ప్రత్యేక ప్రవేశ దర్శనం టికెట్ల ప్రతి నెలా 24న, తిరుపతిలో గదుల కోటాను 25న, తిరుమలలో గదుల కోటాను 26న విడుదల చేస్తారు.
టీటీడీ ప్రకటించిన షెడ్యూల్ ప్రకారం భక్తులు దర్శనం, సేవల టికెట్లు బుక్ చేసుకోవచ్చు. మరోవైపు తిరుమలలో రద్దీ పెరగింది. దర్శనానికి ఏకంగా 18 నుంచి 30 గంటలకుపైగా సమయం పడుతోంది.