Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia

యూపీఎస్సీ 2022 ఫలితాలు.. సత్తా చాటిన తెలుగు విద్యార్థులు

Advertiesment
UPSC
, బుధవారం, 24 మే 2023 (09:23 IST)
యూనియన్‌ పబ్లిక్‌ సర్వీస్‌ కమిషన్‌ సివిల్ సర్వీసెస్‌ (యూపీఎస్సీ) 2022 తుది ఫలితాలు విడుదలయ్యాయి. ఈ ఫలితాల్లో మొత్తం 933 మంది అభ్యర్థులు ఎంపికైనట్లు యూపీఎస్‌సీ ప్రకటించింది. యూపీఎస్‌స్సీ విడుదల చేసిన ఫలితాల్లో ఇషితా కిషోర్‌ టాపర్‌గా నిలిచింది. గరిమా లోహియా రెండో స్థానం, ఉమా హాథిన్‌ మూడో స్థానంలో నిలిచారు. ఇక ఈ ఫలితాల్లో తెలుగు రాష్ట్రాల అభ్యర్థులు సత్తా చాటారు. 
 
జీవీఎస్‌ పవన్‌ దత్తా 22వ ర్యాంకు సాధించగా.. శాఖమూరి శ్రీసాయి అర్షిత్‌ 40, ఆవుల సాయికృష్ణ 94, అనుగు శివమారుతీరెడ్డి 132, రాళ్లపల్లి వసంతకుమార్‌ 157, కమతం మహేశ్‌కుమార్‌ 200 ర్యాంకు, రావుల జయసింహారెడ్డి 217, బల్లం ఉమామహేశ్వర్‌రెడ్డి 270, చల్లా కల్యాణి 285, పాలువాయి విష్ణువర్దన్‌రెడ్డి 292, గ్రంథె సాయికృష్ణ 293, వీరగంధం లక్ష్మి సుజిత 311, ఎన్‌.చేతనారెడ్డి 346, శృతి యారగట్టి 362, యప్పలపల్లి సుషకమిత 384, సీహెచ్‌ శ్రావణ్‌కుమార్‌ రెడ్డి 426 ర్యాంకులు సాధించారు.
 
ఈ ఫలితాల్లో మహిళలు చరిత్ర సృష్టించారు. తొలి నాలుగు ర్యాంకులు మహిళలే సాధించడం విశేషం. తొలి ర్యాంక్‌ను ఇషిత కిషోర్ సాధించగా, రెండో ర్యాంక్‌ను గరిమా లోహియా, మూడో ర్యాంక్‌ను ఉమా హారతి, నాలుగో ర్యాంక్‌ను స్మృతి మిశ్రా సాధించారు.

Share this Story:

Follow Webdunia telugu

తర్వాతి కథనం

‘మోదీ ఈజ్ బాస్' అని ఆస్ట్రేలియా ప్రధానమంత్రి ఆల్బనీస్ ఎందుకు అన్నారు?