Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia

అవి ఆర్మీ హెలికాఫ్టర్లు... దేశ భద్రతలో జోక్యం చేసుకోలేం : వైవీఎస్ చౌదరి

Advertiesment
yv subbareddy
, గురువారం, 27 ఏప్రియల్ 2023 (13:55 IST)
ఇటీవల తిరుమల గిరులపై హెలికాఫ్టర్లు చక్కర్లు కొట్టాయి. దీనిపై టీటీడీ ఛైర్మన్ వైవీ సుబ్బారెడ్డి స్పందించారు. అవి మిలిటరీకి చెందిన హెలికాఫ్టర్లు అని, దేశ భద్రత విషయంలో జోక్యం చేసుకోలేమని ఆయన అన్నారు.
 
ఈ నెల 25వ తేదీన తిరుమల కొండపై మూడు హెలికాఫ్టర్లు చక్కర్లు కొట్టాయి. ఇవి కలకలం రేపాయి. తిరుమల గగనతలంపై విమానాలు, హెలికాఫ్టర్లు ఎగరడంపై నిషేధం ఉంది. అయినప్పటికీ హెలికాఫ్టర్లు చక్కర్లు కొట్టాయి. దీనిపై వైవీ సుబ్బారెడ్డి స్పందించారు. తిరుమలపై చక్కర్లు కొట్టిన హెలికాఫ్టర్లు మిలిటరీకి చెందినవని చెప్పారు. దేశ భద్రతకు సంబంధించిన విషయంలో మనం జోక్యం చేసుకోలేమని చెప్పారు.
 
ఇకపోతే, సులభ కార్మికుల ఆకస్మికంగా విధులను బహిష్కరించడంపై ఆయన స్పందిస్తూ, భక్తులను ఇబ్బంది పెట్టడం సరికాదన్నారు. విధులకు హాజరైన తర్వాత డిమాండ్లు అడిగితే తప్పకుండా పరిష్కరిస్తామని తెలిపారు. తితిదే ఉద్యోగులకు త్వరలోనే ఇళ్ల స్థలాలను మంజూరు చేస్తామని ఆయన చెప్పారు. తితిదే ఉద్యోగులకు కోసం నిర్మించిన కమ్యూనిటీ హాల్‌ను ఆయన గురువారం ప్రారంభించారు. 

Share this Story:

Follow Webdunia telugu

తర్వాతి కథనం

ప్రేమకు నో చెప్పారనీ... హాస్టల్‌లో యువతి ఆత్మహత్య