Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia
Advertiesment

టీటీడీ పాలక మండలి సంచలన నిర్ణయం.. ఏంటది?

venkateswara swamy

ఠాగూర్

, సోమవారం, 18 నవంబరు 2024 (17:09 IST)
తిరుమల తిరుపతి దేవస్థానం పాలక మండలి (తితిదే బోర్డు) సంచలన నిర్ణయం తీసుకుని, భక్తులకు శుభవార్త చెప్పింది. సామాన్య భక్తులకు కేవలం రెండు మూడు గంటల్లోనే శ్రీవారి దర్శనం చేయించేలా ఇకపై చర్యలు తీసుకోనున్నారు. అలాగే, తితిదేలో పని చేస్తున్న ఇతర మతాలకు చెందిన వారికి వీఆర్ఎస్ ఇవ్వడం లేదా ప్రభుత్వ శాఖల్లోకి బదిలీ చేయాలని నిర్ణయించింది. 
 
తితిదే కొత్త పాలక మండలి చైర్మన్ బీఆర్ నాయుడు అధ్యక్షతన సోమవారం తిరుమలలోని అన్నమయ్య భవన్‌లో జరిగింద. ఇందులో అనేక కీలక నిర్ణయాలు తీసుకున్నారు. శ్రీవాణి ట్రస్టును రద్దు చేస్తూ ప్రకటన జారీచేసింది. సామాన్య భక్తులకు రెండు లేదా మూడు గంటల్లో దర్శనం కల్పించేలా మార్పులు చేసేందుకు చర్యలు చేసింది. కంపార్టుమెంట్లలో భక్తులు ఇబ్బందులు పడకుండా త్వరతిగతిన స్వామివారి దర్శనం కల్పించేందుకు ప్రణాళికలు రూపొందించింది. తితిదే పనిచేస్తున్న అన్యమత ఉద్యోగులకు వీఆర్ఎస్ లేదా ప్రభుత్వం శాఖల్లోకి బదిలీ చేయాలని నిర్ణయించింది. 
 
డంపింగ్ యార్డులోని చెత్తను మూడు నెలల్లో క్లియర్ చేయాలని నిర్ణయం తీసుకున్నారు. అలిపిరిలో దేవలోక్‌కు కేటాయించిన 20 ఎకరాల భూమిని తిరిగి తితిదేకు అప్పగించే విధంగా ప్రభుత్వానికి లేఖ రాయాలని నిర్ణయం తీసుకున్నారు. తిరుమలలో రాజకీయాలు మాట్లాడటాన్న నిషేధించారు. ఈ నిబంధనను ఉల్లంఘించేవారిపై కేసులు నమోదు చేస్తారు. స్థానికులకు ప్రతి నెల మొదటి మంగళవారం శ్రీవారి దర్శనం కల్పిస్తారు. ప్రైవేట్ బ్యాంకుల్లో డిపాజిట్లు ప్రభుత్వ బ్యాంకుల్లో జమ చేయాలని నిర్ణయం తీసుకున్నారు. 
 
అన్నదాన ప్రసాదంలో కొత్తగా మరో ఐటమ్‌ వడ్డించాలని నిర్ణయించారు. శ్రీవారి ప్రసాదాల్లో నాణ్యమైన నెయ్యి వినియోగించేందుకు కమిటీ ఏర్పాటు చేయాలని, శారదా పీఠానికి కేటాయించిన భూములు రద్దు చేసి, శారదా పీఠం నిర్మించిన భవనాన్ని కూల్చివేయాలని పాలక మండలిలో నిర్ణయం తీసుకున్నారు. అలాగే, పర్యాటక శాఖకు కేటాయిస్తున్న నాలుగు వేల ఎస్ఈడీ టిక్కెట్లను రద్దు చేశారు. 

Share this Story:

Follow Webdunia telugu

తర్వాతి కథనం

ఉచిత గ్యాస్ పథకాన్ని వైకాపా నేతలు జీర్ణించుకోలేక పోతున్నారు : నాదెండ్ల మనోహర్