Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia

"చంద్రబాబుకో దండం" పవన్ కాపుల గురించి మాట్లాడట్లేదు.. తోట తూర్పు

Advertiesment
Thota
, ఆదివారం, 15 సెప్టెంబరు 2019 (16:19 IST)
గోదావరి :  టీడీపీ సీనియర్‌ నాయకులు, రామచంద్రాపురం మాజీ ఎమ్మెల్యే తోట త్రిమూర్తులు వైఎస్సార్‌ కాంగ్రెస్‌ పార్టీలో చేరారు. ఆంధ్రప్రదేశ్‌ ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి సమక్షంలో ఆదివారం పార్టీ కండువా కప్పుకున్నారు. ఆయనతో పాటు భారీగా అనుచరులు, కార్యకర్తలు ముఖ్య నాయకులు పార్టీలో చేరారు. రెండు రోజుల క్రితమే టీడీపీకి రాజీనామా చేస్తున్నట్లు ఆయన ప్రకటించిన విషయం తెలిసిందే. 
 
ఈ సందర్భంగా తోట త్రిమూర్తులు మాట్లాడుతూ నియోజకవర్గ, జిల్లా అభివృద్ధి కోసమే తాను వైఎస్సార్‌సీపీలో చేరానని తెలిపారు. ఆంధ్రప్రదేశ్‌ భవిష్యత్తును దృష్టిలో ఉంచుకొని సమర్థవంతమైన నేతను ప్రజలు ముఖ్యమంత్రిగా ఎన్నుకున్నారని అభిప్రాయపడ్డారు. ఏపీ అభివృద్ధి వైఎస్‌ జగన్‌తోనే సాధ్యమని, ఆ నమ్మకంతోనే పార్టీలో చేరుతున్నానని స్పష్టం చేశారు. 
 
పార్టీలోని సీనియర్లతో కలిసి జిల్లా అభివృద్ధికి సహకరిస్తానని పేర్కొన్నారు. పవన్ కల్యాణ్ కాపుల తరుపున మాట్లాడలేదని, ఆయన అభిప్రాయం మాత్రమే అని అన్నారు. గత అసెంబ్లీ ఎన్నికల్లో ఘోర పరాజయం పాలైన అనంతరం.. టీడీపీని నమ్ముకుంటే తమకు రాజకీయ భవిష్యత్తు ఉండదని గట్టిగా నమ్ముతున్న ఆ పార్టీ నాయకులు ఒక్కొక్కరుగా ‘చంద్రబాబుకో దండం’ అంటూ గుడ్‌బై చెప్పేస్తున్న విషయం తెలిసిందే. 
 
తాజాగా రామచంద్రపురం ఎమ్మెల్యే తోట త్రిమూర్తులు, తన అనుచరులతో కలిసి టీడీపీకి రాజీనామా చేయడం, వైఎస్సార్‌సీపీలో చేరడం జిల్లాలో టీడీపీని ఓ కుదుపు కుదిపింది. చంద్రబాబు నాయుడి వ్యవహార శైలి కారణంగా టీడీపీకి నానాటికీ ప్రజాదరణ తగ్గిపోతున్న నేపథ్యంలో.. ఆ పార్టీకి ఒక్కొక్కరుగా నాయకులు గుడ్‌బై చెప్పేస్తున్నారు.

Share this Story:

Follow Webdunia telugu

తర్వాతి కథనం

ఇండో-అమెరికా ఆర్మీ.. అదరగొట్టే స్టెప్పులు.. (వీడియో)