Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia

దేశ సమైక్యత కృషి చేసిన కమ్యునిస్టు ఉద్యమం: బి.వి.రాఘవులు

Advertiesment
Communist Movement
, గురువారం, 14 నవంబరు 2019 (07:55 IST)
భారత స్వాతంత్ర్య పోరాటంలోను,  స్వతంత్ర భారతదేశంలో ప్రజా సమస్యల పరిష్కారం కోసం భారత కమ్యునిష్టు ఉద్యమం గణనీయమైన కృషి చేసిందని సీపీఎం పొలిట్ బ్యూరో సభ్యులు బి.వి.రాఘవులు అన్నారు.

స్థానిక గవర్నర్ పేట ఎం.బి.విజ్ఞాన కేంద్రంలో బుధవారం సాయంత్రం జరిగిన భారత కమ్యూనిస్టు ఉద్యమ శత వార్షికోత్సవ సభలో ముఖ్య అతిధిగా ఆయన పాల్గొన్నారు. 1920లో పుట్టిన కమ్యునిష్టు పార్టీ స్వరాజ్య నినాదాన్ని ఇచ్చిందన్నారు. బ్రిటిషు సామ్రాజ్య వాదానికి వ్యతిరేకం గా ప్రజలను భాగస్వాములను చేయటానికి సంఘాలను నిర్మించిందని చెప్పారు.

అనేక అణిచివేతలు, మోసపూరిత కేసులు ఎదుర్కుంటు కమ్యునిష్టులు పురొగమించారని తెలిపారు. నిజాం నవాబుకు వ్యతిరేకంగా సాగిన తెలంగాణ సాయుధ పోరాటం వంటివి ఆయా రాజ్యాలు మన దేశంలో విలీనం కావటానికి దోహదపడ్డాయన్నారు. భాషా ప్రయుక్త రాష్ట్రాల ఏర్పాటులో కమ్యునిష్టుల పాత్ర ముఖ్యమైందని చెప్పారు.

భూ సమస్య పరిష్కారం కోసం ఉద్యమాలు చేశాయన్నారు. మాతృభాషలో కూడా  విద్యా బోధన ఉండటం అవసరమని వివరించారు. మాంద్యం పరిస్ఠితిలో చేపట్టాల్సిన చర్యలు ప్రభుత్వాలకు తెలియ చేస్తున్నవి వామ పక్షాలని చెప్పారు.

ప్రజల ఐక్యతను దెబ్బ తీసే కుల మత విచ్ఛిన్న భావాలకు వ్యతిరేకంగా పోరాడుతున్నది కమ్యునిష్టు ఉద్యమమని తెలిపారు. ప్రజా కార్మిక వ్యతిరేక  సరళీకరణ ప్రైవేటీకరణ విధానాలపై పోరాడుతున్నదని వివరించారు.

సోషలిజం ప్రస్తుత కాలంలో ప్రజా సమస్యలకు పరిష్కార మార్గం చూపుతుందని చెప్పారు. డి.కాశీనాధ్ అధ్యక్షత వహించిన ఈ సభలో సి హెచ్ బాబూరావు, డివి కృష్ణ, కె.శ్రీదేవి, డి.విష్ణు వర్ధన్, నాగొతి ప్రసాద్, బి.నాగేశ్వరరావు పాల్గొన్నారు.

Share this Story:

Follow Webdunia telugu

తర్వాతి కథనం

ఆర్ధిక ఇబ్బందుల్లో ఆర్టీసీ కార్మికులు