Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia

పూజారి రాసలీలలు.. మంత్ర శక్తులతో వశీకరణ చేసి..?

romance
, బుధవారం, 13 జులై 2022 (19:25 IST)
గుడికి వచ్చే మహిళలను మాయమాటలతో వలలో వేసుకుని ఓ పూజారి నడుపుతున్న రాసలీలల బాగోతం బయటపడింది. 
 
వివరాల్లోకి వెళ్తే.. నంద్యాల జిల్లా, రంగాపురం గ్రామానికి చెందిన స్రవంతికి అనంతపురం జిల్లా మురిడి ఆలయ ప్రధాన అర్చకుడు అనంతసేన అనే వ్యక్తితో 2008లో వివాహం అయింది. వారికి కొడుకు, కుమార్తె ఉన్నారు. 
 
కాగా ఆలయానికి పూజల కోసం వచ్చిన కొందరు మహిళలను మంత్ర శక్తులతో వశీకరణ చేసి.. వారితో తన భర్త లైంగిక కోరికలు తీర్చుకుంటున్నట్లు స్రవంతి ఆరోపిస్తోంది.
 
యువతులతో రాసలీలలు కొనసాగిస్తున్న వీడియోలు, ఆడియోలు, ఫోటోలను స్రవంతి బయటపెట్టింది. తనను ఏడేళ్లుగా అదనపు కట్నం కోసం వేధిస్తున్నారని ఆరోపించింది. 
 
అక్రమ సంబంధాలపై ప్రశ్నించినందుకు తనను ఎన్నోసార్లు దాడి చేసి.. పుట్టింటికి పంపినట్లు వాపోయింది. అక్రమ సంబంధాల మోజులో పడి విడాకుల నోటీసులు కూడా పంపాడని చెప్పింది. 
 
అంతేకాదు రాసలీలలకు అడ్డుపడుతున్నాననే నేపంతో తనను హతమార్చేందుకు కూడా భర్త కుట్రపన్నాడని స్రవంతి ఆరోపించింది.

Share this Story:

Follow Webdunia telugu

తర్వాతి కథనం

తెలంగాణాలో మరో మూడు రోజులు విద్యా సంస్థలు బంద్