Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia

ఒసే నా ప్రియురాలా.... నీ భర్త బాధ వదిలిపోయిందే...

Advertiesment
murder

ఠాగూర్

, ఆదివారం, 2 ఫిబ్రవరి 2025 (14:11 IST)
పరాయి పురుషుడుతో అక్రమ సంబంధం పెట్టుకున్న ఓ ఇల్లాలు.. తన ప్రియుడుతో కలిసి భర్తను మట్టుబెట్టింది. చివరకు ఈ హత్య కేసులోని మిస్టరీని పోలీసులు ఛేదించడంతో హత్యకు సంబంధం ఉన్నవారంతా జైలుపాలయ్యారు. తాజాగా వెలుగులోకి వచ్చిన ఈ వివరాలను పరిశీలిస్తే, 
 
శ్రీకాకుళం జిల్లా ఆమదాలవలస మండలం జగ్గువాని చెరువు వద్ద బొబ్బిలిపేట గ్రామానికి చెందిన జి. చంద్రయ్య (42) గత నెల 25న హత్య గురైన విషయం తెలిసిందే. ఆ కేసు ఈ వివరాలను డీఎస్పీ సీహెచ్ వివేకానంద శనివారం వెల్లడించారు. మృతుడు చంద్రయ్య భార్య ఈశ్వరమ్మ, బొబ్బిలిపేటకు చెందిన చింతాడ బాలమురళీకృష్ణ మధ్య వివాహేతర సంబంధం నడుస్తోంది. వీరి విషయం చంద్రయ్యకు తెలియడంతో అతడిని హతమార్చాలని ప్లాన్ చేశారు. 
 
ఆ మేరకు బాలమురళీకృష్ణ తమ్ముడు వరసైన అరవిందుతో కలిసి ప్రణాళిక రచించాడు. ఉప్పినవలస గ్రామానికి చెందిన ఏడుగురు యువకులకు సుపారీ ఇచ్చారు. వారు మూడు సార్లు హత్యకు ప్రయత్నాలు చేసి విఫలమయ్యారు. జనవరి 25న రాత్రి 7 గంటల సమయంలో చంద్రయ్య ఇంటి నుంచి బయలుదేరిన విషయాన్ని ఈశ్వరమ్మ మురళీకృష్ణకు ఫోనులో చేరవేసింది. అప్పటికే జగ్గువాని చెరువు వద్ద ఉన్న వారంతా ద్విచక్ర వాహనంపై వస్తున్న చంద్రయ్యను తలపై బీరు సీసాతో కొట్టారు. చెరువులో దూకి పారిపోయేందుకు ప్రయత్నించినా వదల్లేదు. కర్రలతో చనిపోయే వరకు కొట్టారు.
 
అనంతరం మెడకు గోనె సంచిని బిగించి చంపేసి అక్కడి నుంచి పరారయ్యారు. ఆ తర్వాత మురళీకృష్ణ ఈశ్వరమ్మకు ఫోన్ చేసి 'నీ భర్త బాధ వదిలిపోయింది' అని చెప్పాడు. అనంతరం ఏమీ తెలియనట్లు నిందితురాలు స్థానిక పోలీస్ స్టేషనులో భర్త కనిపించట్లేదని ఫిర్యాదు చేసింది. చంద్రయ్య మృతదేహన్ని గుర్తించిన స్థానికులు పోలీసులు సమాచారం ఇవ్వడంతో కేసు నమోదు చేసి దర్యాప్తు చేసి నిగ్గు తేల్చారు. 
 
ఈ కేసులో చంద్రయ్య భార్యతో పాటు మొత్తం 10 మంది నిందితులను అరెస్ట్ చేశారు. శనివారం కోర్టులో హాజరు పరిచి రిమాండుకు తరలించారు. ఎంతో చాకచక్యంగా కేసును ఛేదించిన సీఐ సత్యనారాయణ, ఎస్ఐలు బాలరాజు, సత్యనారాయణ, ప్రవల్లిక, హైమావతి, సిబ్బందిని డీఎస్పీ అభినందించారు. 

Share this Story:

Follow Webdunia telugu

తర్వాతి కథనం

'ఛోళీకే పీఛే క్యాహై' పాటకు వరుడు నృత్యం... పెళ్లి రద్దు చేసిన వధువు తండ్రి!