Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia

నేను నష్ట జాతకురాలిని.. బావా మంచి అమ్మాయిని చూసి పెళ్లి చేసుకో... నవ వధువు సూసైడ్

ఓ నవ వధువు తనవు చాలించింది. నేను నష్ట జాతకురాలిని అంటూ పేర్కొని... బావా నేను చనిపోయిన తర్వాత ఒక మంచి అమ్మాయిని చూసి పెళ్లి చేసుకో.. నాకోసం ఎవరూ ఏడవకండి. ప్లీజ్‌.. ఓకే బాయ్‌.. అంటూ ఆ నవ వధువు సూసైడ్ నో

Advertiesment
నేను నష్ట జాతకురాలిని.. బావా మంచి అమ్మాయిని చూసి పెళ్లి చేసుకో... నవ వధువు సూసైడ్
, మంగళవారం, 18 సెప్టెంబరు 2018 (15:50 IST)
ఓ నవ వధువు తనవు చాలించింది. నేను నష్ట జాతకురాలిని అంటూ పేర్కొని... బావా నేను చనిపోయిన తర్వాత ఒక మంచి అమ్మాయిని చూసి పెళ్లి చేసుకో.. నాకోసం ఎవరూ ఏడవకండి. ప్లీజ్‌.. ఓకే బాయ్‌.. అంటూ ఆ నవ వధువు సూసైడ్ నోట్ రాసిపెట్టి ప్రాణాలు తీసుకుంది. ఈ విషాదకర ఘటన శ్రీకాకుళం జిల్లా హరిపురంలో జరిగింది. తాజాగా వెలుగులోకి వచ్చిన ఈ వివరాలను పరిశీలిస్తే...
 
జిల్లాలోని మందస మండలం వీజీపురం గ్రామానికి చెందిన అంబల నవ్య (20) అనే యువతికి హరిపురంకు చెందిన తన మేనమామ కుమారుడు అంబల ధనరాజుతో గత జూలై నెలలో వివాహమైంది. ధనరాజు వివాహమైన తర్వాత ఇంటిపట్టునే ఉంటున్నారు. ఈ క్రమంలో అతని తల్లి ఆదెమ్మకు ఆరోగ్యం బాగలేక సోమవారం ఉదయం పలాసలోని ప్రభుత్వ ఆస్పత్రిలో చేర్పించారు. తల్లి వద్ద ధనరాజు ఉంటున్నాడు. 
 
ఈక్రమంలో సాయంత్రానికి వచ్చిన ధనరాజు... ఇంటి తలుపులు వేసివున్నాయి. తలుపులకు లోపల గెడియపెట్టివుంది. నవ్యను ఎంత పిలిచినా పలుకకపోవడంతో ఆందోళన చెందిన ధనరాజు.. ఇరుగుపొరుగువారి సాయంతో తలుపులు పగులగొట్టి ఇంటిలోపలికెళ్లాడు.
 
వంటింట్లో నవ్య ఫ్యాన్‌కు చున్నీతో ఊరివేసుకొని బలవన్మరణానికి పాల్పడివుండటాన్ని చూసి అక్కడే కుప్పకూలిపోయాడు. విషయం తెలుసుకున్న పోలీసులు సంఘటనా స్థలానికి చేరుకుని మృతదేహాన్ని స్వాధీనం చేసుకున్నారు. అయితే, పోలీసులు ఇంట్లో గాలించగా, ఒక సూసైడ్ నోట్ లభించింది. 
 
అందులో నవ్య ఇలా రాసిపెట్టింది. 'నేను ఒక నష్టజాతకురాలిని. నేను పుట్టినప్పటి నుంచి నా చుట్టుపక్కన ఉన్న వాళ్లందరికీ కష్టాలే. నేను పుట్టిన వెంటనే మా అమ్మానాన్నల మధ్య గొడవులు మొదలయ్యాయి. నేను పుష్పవతి అయిన ఏడు రోజుల తర్వాత మా నాన్న చనిపోయారు. నాకు పెళ్లయిన తర్వాత మా బావకి కుక్కకరిచి ఆసుపత్రి పాలయ్యాడు. 
 
ఈవిధంగా నేను ఉన్న ప్రదేశంలో ప్రతి ఒక్కరికీ కీడు జరుగుతుంది గానీ ఎవరికీ మేలు జరగడం లేదు. నేను భారం కాకూడదు అని ఎవరికీ కనిపించనంత దూరంగా వెళ్లిపోతున్నాను. ఓకే బాయ్‌.. నా గురించి ఆలోచించిన వాళ్లందరికీ గుడ్‌బాయ్‌.. బావా నేను చనిపోయిన తర్వాత ఒక మంచి అమ్మాయిని చూసి పెళ్లి చేసుకో.. నాకోసం ఎవరూ ఏడవకండి. ప్లీజ్‌.. ఓకే బాయ్‌' అంటూ ఆ లేఖలో రాసిపెట్టింది. 

Share this Story:

Follow Webdunia telugu

తర్వాతి కథనం

ప్రియుడితో ఏకాంతంగా ఉన్న వీడియోను భర్తకు చూపించిన భార్య... ఎందుకు?