ఖోఖో ఆటలో బహుమతి.. మృత్యువు పాము రూపంలో వచ్చింది..
దేశ వ్యాప్తంగా ఆగస్టు 15వ తేదీన స్వాతంత్ర్య దినోత్సవ వేడుకలు అట్టహాసంగా జరిగాయి. స్వాతంత్ర్య దినోత్సవ వేడుకల్లో భాగంగా పలు పాఠశాలల్లో విద్యార్థులకు పోటీలు నిర్వహించి వాటిలో గెలుపొందిన విజేతలకు బహుమతుల
దేశ వ్యాప్తంగా ఆగస్టు 15వ తేదీన స్వాతంత్ర్య దినోత్సవ వేడుకలు అట్టహాసంగా జరిగాయి. స్వాతంత్ర్య దినోత్సవ వేడుకల్లో భాగంగా పలు పాఠశాలల్లో విద్యార్థులకు పోటీలు నిర్వహించి వాటిలో గెలుపొందిన విజేతలకు బహుమతులను ఇస్తుంటారు. ఇదే తరహాలో శ్రీకాకుళానికి చెందిన దీపిక పాఠశాలలో బహుమతిని గెలుచుకుంది. కానీ జీవితంలో గెలవలేకపోయింది. మృత్యువు పాము రూపంలో రావడంతో దీపిక తిరిగి రాని లోకాలకు వెళ్ళిపోయింది.
వివరాల్లోకి వెళితే.. శ్రీకాకుళం జిల్లా సంతబొమ్మాళి మండలంలోని రుంకు గ్రామానికి చెందిన టంకాల దీపిక(13) పాము కాటుతో మృతి చెందింది. టంకాల అప్పన్న, అమ్మలుకు ఇద్దరు కుమార్తెలు పెద్ద కుతూరు డిగ్రీ చదువుతుంది, చిన్న కుతూరు జగ్ననాథపురంలోని ఉన్నత పాఠశాలలో ఏడో తరగతి చదువుతుంది. బుధవారం పాఠశాలలో నిర్వహించిన స్వాంతంత్య్ర వేడుకల్లో పాల్గొన్న దీపిక ఖోఖో ఆటలో గెలుచుకున్న బహుమతితో ఇంటికి వచ్చింది.
ఆమె అందుకున్న బహుమతిని తల్లికి ఆనందంగా చూపించింది. ఆ తర్వాత బావి దగ్గర వున్న అక్క వద్దకు వెళ్లింది. ఆమె బట్టలుతుకుతుండగా, సబ్బు ఇచ్చి తిరిగి ఇంటికి వెళ్తుండగా.. పాము దీపికను కాటేసింది. స్థానికులు, కుటుంబీకుల సాయంతో దీపికను ఆస్పత్రికి తరలిస్తుండగానే ఆ బాలిక ప్రాణాలు కోల్పోయింది.