Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia

'నైపుణ్యం' మరింత వికసించాలి : మంత్రి మేకపాటి గౌతమ్ రెడ్డి

Advertiesment
Skill
, శుక్రవారం, 2 ఏప్రియల్ 2021 (09:28 IST)
నైపుణ్యాభివృద్ధి, శిక్షణ శాఖ, గిరిజన, సాంఘిక సంక్షేమ శాఖల ఆధ్వర్యంలో ఒక నోడల్ ఏజెన్సీ ఏర్పాటు చేయాలని నైపుణ్యాభివృద్ధి, శిక్షణ శాఖ మంత్రి మేకపాటి గౌతమ్ రెడ్డి అధికారులను ఆదేశించారు. 

మారుమూల గ్రామలు, ఏజెన్సీలలోని సాంఘిక, గిరిజన రెసిడెన్షియల్  పాఠశాలలలో విద్యనభ్యసించే చిన్నారులకు ఆ స్థాయి నుంచే విద్యార్థులకు ఆధునిక సాంకేతిక పరిజ్నాన్ని అందించే నైపుణ్య వికాసంపై ప్రత్యేక శ్రద్ధ వహించడమే కాకుండా పర్యవేక్షణ ఉండాలని మంత్రి మేకపాటి స్పష్టం చేశారు.

సచివాలయంలోని ఐ.టీ సమావేశమందిరంలో 'నైపుణ్య వికాసం' కార్యక్రమంపై ఆయన సంబంధిత శాఖల ఉన్నతాధికారులతో సమీక్ష నిర్వహించారు. ఇంగ్లీష్, లైఫ్ స్కిల్స్, ఐ.టీ, కంప్యూటేషనల్ థింకింగ్ వంటి అంశాలపై శిక్షణ కోసం అమలు జరుగుతున్న ఈ కార్యక్రమం అమలు జరిగిన తీరుపై మంత్రి ప్రత్యేకంగా అధికారులను అడిగి తెలుసుకున్నారు.

మూడు శాఖలు సమన్వయం చేసుకుంటూ నైపుణ్య వికాసం గురించి ఇంపాక్ట్ స్టడీ చేయాలని ఆదేశించారు. అనంతరం ఆ నివేదిక ఆధారంగా నైపుణ్య వికాసాన్ని నలుమూలలా వికసించేలా అవసరమైన కార్యాచరణను సిద్ధం చేయనున్నట్లు మంత్రి వెల్లడించారు.

నైపుణ్యాభివృద్ధి, శిక్షణ శాఖ ముఖ్య కార్యదర్శి జయలక్ష్మికి కార్యక్రమాన్ని ముందుకు తీసుకువెళ్లేందుకు ఏర్పాటు చేయవలసిన నోడల్ ఏజెన్సీ గురించి కీలక సూచనలిచ్చారు. ప్రతి శాఖలోని ఒక అధికారిని ఏజెన్సీలో ఉండేలా చూడాలని మంత్రి ఆదేశించారు.

గత ప్రభుత్వ హయాంలో అమలులో క్షేత్రస్థాయిలో జరిగిన  ఇబ్బందుల గురించి మంత్రికి సంబంధిత శాఖల అధికారులు మంత్రికి వివరించారు. వేలాది మంది విద్యార్థుల భవిష్యత్ ను మార్చే నైపుణ్య వికాసం కార్యక్రమాన్ని మరింత ముందుకు తీసుకువెళ్లాలని మంత్రి మేకపాటి పేర్కొన్నారు.
 
విదేశాలలో ఉపాధి కోసం వెళ్ళే ఆంధ్రప్రదేశ్ ఆడపడుచుల కోసం "ఆంధ్రప్రదేశ్ ప్రవాసాంధ్ర మహిళా సంక్షేమ నిధి" ఏర్పాటుకు ఛైర్మన్ మేకపాటి గౌతమ్ రెడ్డి నేతృత్వంలోని ఓమ్ క్యాప్ బోర్డు సమావేశం నిర్ణయం తీసుకుంది. 

Share this Story:

Follow Webdunia telugu

తర్వాతి కథనం

రాష్ట్ర వ్యాప్తంగా 61.12 లక్షల మందికి పెన్షన్లు