Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia

ఏపీ హైకోర్టుకు జ‌న‌వ‌రి 16 వ‌ర‌కు సెలవులు... 12న ఆన్ లైన్!

Advertiesment
ఏపీ హైకోర్టుకు జ‌న‌వ‌రి 16 వ‌ర‌కు సెలవులు... 12న ఆన్ లైన్!
విజ‌య‌వాడ‌ , సోమవారం, 10 జనవరి 2022 (09:59 IST)
ఏపీ హైకోర్టుకు ఈ నెల 10 నుంచి 12వ తేదీ వరకు సంక్రాంతి సెలవులు ప్రకటించారు. హైకోర్టు క్యాలెండర్‌ ప్రకారం 13న భోగి, 14న సంక్రాంతి, 15న కనుమ. ఈ మూడు రోజుల్లో హైకోర్టులో ఎలాంటి కార్యకలాపాలు ఉండవు. 16న ఆదివారం. 17వ తేదీ నుంచి హైకోర్టు తన కార్యకలాపాలను యథావిధిగా కొనసాగిస్తుంది.


ఈ సెలవుల్లో అత్యవసర కేసుల విచారణ నిమిత్తం వెకేషన్‌ కోర్టులు ఏర్పాటయ్యాయి. ఈ వెకేషన్‌ కోర్టుల్లో న్యాయమూర్తులు జస్టిస్‌ మల్లవోలు సత్యనారాయణమూర్తి, జస్టిస్‌ కుంభజడల మన్మధరావు, జస్టిస్‌ కంచిరెడ్డి సురేశ్‌రెడ్డి ఉంటారు. జస్టిస్‌ సత్యనారాయణమూర్తి, జస్టిస్‌ మన్మధరావు ద్విసభ్య ధర్మాసనంలో, జస్టిస్‌ సురేశ్‌రెడ్డి సింగిల్‌ జడ్జిగా కేసులను విచారిస్తారు. 
 
 
అత్యవసర కేసులను ఈ నెల 10న పిటిషన్లు దాఖలు చేయాల్సి ఉంటుంది. ఆ పిటిషన్లపై న్యాయమూర్తులు 12న విచారణ జరుపుతారు. హెబియస్‌ కార్పస్, ముందస్తు బెయిల్‌ పిటిషన్లు, మెజిస్ట్రేట్లు, సెషన్స్‌ జడ్జిలు తిరస్కరించిన బెయిల్‌ పిటిషన్లతో పాటు సెలవులు ముగిసేంత వరకు వేచిచూడలేనంత అత్యవసరం ఉన్న వ్యాజ్యాలను మాత్రమే వెకేషన్‌ కోర్టులు విచారిస్తాయి. ఈ మేరకు రిజిస్ట్రార్‌ జనరల్‌ రవీంద్రబాబు నోటిఫికేషన్‌ జారీ చేశారు.

Share this Story:

Follow Webdunia telugu

తర్వాతి కథనం

విజయవాడలో ప్రేమోన్మాది ఘాతుకం.. బాలికపై దాడి..