మే 2నుంచి 20 వరకు ఇంటర్ పరీక్షలు నిర్వహించేందుకు తెలంగాణ ఇంటర్ బోర్డు రంగం సిద్ధం చేస్తోంది. వివిధ పోటీ పరీక్షలతో ఈ ఎగ్జామ్స్ లింక్ అయి ఉండటంతో మే 2 నుంచి 20 వరకు నిర్వహించాలని యోచిస్తోంది. మరోవైపు ఏపీలోనూ మే 5 నుంచి 22 వరకూ ఇంటర్ పరీక్షలు ఉండే అవకాశముంది.
ఎంసెట్, జేఈఈ, నీట్ తదితర ఎగ్జామ్స్‌ను దృష్టిలో పెట్టుకుని ఇంటర్ పరీక్షల షెడ్యూల్‌ను ఇంటర్ బోర్డు తయారు చేస్తోంది. రాష్ట్రంలో మొత్తం 9 లక్షలకు పైగా స్టూడెంట్లు ఇంటర్ చదువుతున్నారు.
గతేడాది కొవిడ్ ఎఫెక్ట్ తో పరీక్షల నిర్వహణ సాధ్యం కాలేదు. దీంతో సెకండియర్ స్టూడెంట్లను ఫస్టియర్ మార్కుల ఆధారంగా పాస్ చేసింది. ప్రస్తుతం సెకండియర్ చదువుతున్న స్టూడెంట్లకు ఫస్టియర్ పరీక్షలు నిర్వహించింది.