Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia

బాబాయి ప‌వ‌న్ కోసం... మ‌హా ఛాన‌ల్ కొంటున్న రామ్ చ‌ర‌ణ్!

Advertiesment
బాబాయి ప‌వ‌న్ కోసం... మ‌హా ఛాన‌ల్ కొంటున్న రామ్ చ‌ర‌ణ్!
విజయవాడ , శనివారం, 11 సెప్టెంబరు 2021 (11:33 IST)
మెగా స్టార్ కుటుంబం అంతా ఒక‌టే... అంతా అప్ప‌టిక‌పుడు విభేదాలున్న‌ట్లు క‌న‌పడ‌తారు... అస‌లు ప్ర‌యోజ‌నాల విషయానికి వ‌చ్చేస‌రికి అంతా ఒక‌టై పోతారు. త‌మ్ముడు పవ‌న్ తో ఏదో పొస‌గ‌న‌ట్లు క‌నిపిస్తారు మెగా స్టార్... కానీ, మా త‌మ్ముడు ప‌వ‌న్ జెమ్ అంటూ, వేదిక‌ల‌పై ప్ర‌క‌టిస్తుంటారు.
 
ఇపుడు స‌రిగ్గా అలాగే జ‌రుగుతోంది. త‌మ్ముడు ప‌వ‌న్ క‌ల్యాణ్ జ‌న‌సేన పార్టీని పెట్టి, ఎన్నిక‌ల్లో ఒక్క సీటు గెల‌వ‌లేక‌పోయినా... పార్టీని ఎలాగోలా నెట్టుకొస్తున్నారు. ఒక ప‌క్క కేంద్రంలో బీజేపీకి స్నేహ హస్తం అందించి, ప్ర‌ధాని మోదీతోనూ, బీజేపీ ఢిల్లీ నేత‌ల‌తో త‌ర‌చూ చ‌ర్చిస్తూ, త‌న ప‌ర‌ప‌తిని హ‌స్తిన వ‌ర‌కు పెంచుకుంటూ పోయారు. 
 
స‌రిగ్గా ఇదే టైమ్ లో క‌మ‌ర్షియ‌ల్ గా బాబాయి జ‌న‌సేన పార్టీని ప్ర‌మోట్ చేయాల‌ని అబ్బాయి రామ్ చ‌ర‌ణ్ సంక‌ల్పించాడు. ఎందుకుంటే, వ‌చ్చే రెండేళ్ళ‌లో ఎన్నిక‌లు వ‌స్తాయి. అపుడు బాబాయి పార్టీని ప్ర‌మోట్ చేయ‌డానికి ఒక ఛాన‌ల్ కావాల‌ని, ఆ అరేంజ్ మెంట్ లో ఉన్నాడు అబ్బాయి రామ్ చ‌ర‌ణ్. దీని కోసం మ‌హా న్యూస్ ఛాన‌ల్ బేరం ఆడార‌ని స‌మాచారం. ఏ పార్టీకి ఆ పార్టీ న్యూస్ ఛాన‌ల్ పెట్టుకుంటుండ‌టంతో, అదే త‌ర‌హాలో ప‌వ‌న్ క‌ల్యాణ్ జ‌న‌సేన‌కు ప్ర‌త్యేకంగా ఛాన‌ల్ ఉండాల‌ని ఈ ఏర్పాటు చేస్తున్నాడు చ‌ర‌ణ్. దీన్ని క‌మ‌ర్షియ‌ల్ గా కూడా క్లిక్ చేయాల‌నే ప్ర‌య‌త్నంలో ఉన్నాడ‌ని తెలుస్తోంది. 

Share this Story:

Follow Webdunia telugu

తర్వాతి కథనం

అలెర్ట్: ఎయిర్ ఇండియా విమానాన్ని పేల్చేస్తాం: లండన్ వెళ్లే విమానాన్ని..?