ఏపీ సీఎం జగన్ వద్ద ఉద్యోగ సంఘాలు సమావేశం కానున్నాయి. ముఖ్యమంత్రి వద్ద జరిగే తుది చర్చల్లో అధికారికంగా పీఆర్సీ పైన నిర్ణయం వెలువడనుంది. ఈ మేరకు పీఆర్సీపై కసరత్తు ముమ్మరంగా జరుగుతున్నాయి.
రాష్ట్ర ఆర్దిక పరిస్థితిని సైతం పరిగణనలోకి తీసుకోవాలని ఉద్యోగులకు ప్రభుత్వం సూచిస్తోంది. దీంతో.. 32 నుంచి 35 శాతం వరకు సీఎం జగన్ పీఆర్సీ ప్రకటించే అవకాశం ఉందని ఉద్యోగ సంఘాల నేతలు అంచనా వేస్తున్నారు.
ఇక, ఏపీలో ప్రస్తుతం ఆర్దికంగా సమస్యలు ఉండటంతో..పీఆర్సీ ప్రయోజనాలు ఇప్పటి వరకు అందాల్సినవి ఉద్యోగుల పీఎఫ్ ఖాతాల్లో జమ చేస్తామని.. వచ్చే ఆర్దిక సంవత్సం, ఏప్రిల్ నుంచి పెరిగిన వేతనాలు ఉద్యోగులకు ఇచ్చే విధంగా ప్రతిపాదన సిద్దం చేస్తున్నట్లు విశ్వసనీయ సమాచారం.
సీఎస్ నేతృత్వంలోని హైలెవల్ కమిటీ ఇప్పటికే పీఆర్సీ నివేదికలోని అంశాలు..ప్రభుత్వానికి సూచనల పైన అమలుకు వీలుగా ఒక నివేదిక సిద్దం చేసినట్లుగా సమాచారం.