Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia
Advertiesment

28న తిరుమలలో పల్లవోత్సవం

28న తిరుమలలో పల్లవోత్సవం
, సోమవారం, 19 జులై 2021 (09:31 IST)
మైసూరు మహారాజు జన్మించిన ఉత్తరాభాద్ర నక్షత్రాన్ని పురస్కరించుకుని తిరుమలలో ఈ నెల 28వ తేదీన పల్లవోత్సవం జరగనుంది. ఇందులో భాగంగా.. సహస్రదీపాలంకార సేవ తర్వాత శ్రీదేవి, భూదేవి సమేత మలయప్పస్వామి ఊరేగింపుగా కర్ణాటక సత్రానికి చేరుకుంటారు.

అక్కడ కర్ణాటక రాష్ట్ర ప్రభుత్వ ప్రతినిధులు, మైసూరు సంస్థానం ప్రతినిధులు స్వామి, అమ్మవార్లకు ఆహ్వానం పలికి, ప్రత్యేక హారతి సమర్పిస్తారు. మైసూరు మహారాజు జ్ఞాపకార్థం దాదాపు 300 ఏళ్ల నుంచి పల్లవోత్సవాన్ని టీటీడీ నిర్వహిస్తోంది.

మొదట్లో ఈ ఉత్సవాన్ని తోటోత్సవం అనేవారు. ఈ ఉత్సవంలో కర్ణాటక సత్రాలకు విచ్చేసిన స్వామి, అమ్మవార్లకు పూజలు నిర్వహించి, నైవేద్యం సమర్పించి భక్తులకు ప్రసాదాలు అందజేసేవారు. శ్రీవారికి పరమభక్తుడైన మైసూరు మహారాజు అచంచలమైన భక్తిభావంతో భూరి విరాళాలు అందజేశారు.

ప్లాటినం, బంగారు, వజ్రాలు, కెంపులు, పచ్చలు తదితర అమూల్యమైన అభరణాలు బహూకరించారు. బ్రహ్మోత్సవాల్లో వినియోగించే వాహనాలను కూడా అందజేశారు. పల్లకి ఉత్సవంలో ఉపయోగించే పల్లకిని ప్రత్యేకంగా ఏనుగు దంతాలతో, అద్భుతమైన కళాకృతులతో తయారు చేయించారు. 

Share this Story:

Follow Webdunia telugu

తర్వాతి కథనం

విజయవాడలో హైటెన్షన్