Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia

భార్య శవాన్ని మోసుకెళ్తున్న అభాగ్యుడికి ఖాకీల సాయం

Advertiesment
wife deadbody
, గురువారం, 9 ఫిబ్రవరి 2023 (07:49 IST)
పోలీసులంటే కాఠిన్యం అనే అందరూ అనుకుంటారు కదా... కానీ కొన్ని కరకు ఖాకీ దుస్తుల వెనుక చల్లని మనసు కూడా ఉంటుందని నిరూపితమైన ఘటన ఇది... నిరుపేదలు దేశంలో చచ్చిన తరdవాత వారు సజావుగా కాటికి చేరడం కూడా కష్టమే అనే మరో జీవన సత్యం సైతం ఆవిష్కృతమైన సంఘటన ఇది. మార్గమధ్యంలోనే భార్య కన్నుమూస్తే ఆమె శవాన్ని 120 కిలోమీటర్లు మోసుకుని వెళ్లేందుకు సిద్ధమైన ఓ అభాగ్యుని దీన గాథ ఇది. 
 
బుధవారం ఒరిస్సాకు చెందిన ఈది గురు అనే మహిళ విశాఖ జిల్లాలోని ఓ ప్రయివేట్ ఆస్పత్రిలో చేరింది, బతికే అవకాశం లేదని డాక్టర్లు చెప్పారు. దీంతో భర్త సాములు ఆమెను ఆటోలో కోరాపుట్ జిల్లాలోని సరోడా గ్రామానికి బయల్దేరాడు....
 
ఖర్మ బాలేదు. పేదవాడికి చావు కూడా కష్టంగానే వస్తుంది.. అందుకే ఆటో విజయనగరం రాగానే గురు ఆటోలోనే కన్నుమూసింది. ఇక శవాన్ని నేను అంతదూరం తేలేను అంటూ 2000 లాక్కుని ఆటోడ్రైవర్ అక్కడే దించేశాడు. సాములుకు తెలుగు రాదు.. చేతిలో చిల్లిగవ్వ లేదు...
 
జీవితాంతం భార్యను ఆదరిస్తానని పెళ్లినాడు ఇచ్చిన మాట గుర్తొచ్చింది. ఇక వేరే ఏమీ ఆలోచించలేదు.. మిగిలిన ఆ 120 కిలోమీటర్లూ ఆమెను మోస్తూ నడిచేద్దాం అని నిర్ణయించుకుని ఆమె మృతదేహాన్ని భుజాన వేసుకున్నాడు.. కన్నీళ్లు దారి కప్పేస్తున్నాయ్.. అడుగులు తడబడుతున్నాయ్.. భుజాన భార్య వేలాడుతోంది.. అయినా సాములు నడుస్తూనే ఉన్నాడు..
 
ఈ విషయం ఏదోలా పోలీసులకు చేరింది. వెంటనే సీఐ తిరుపతి రావ్, ఎస్సై కిరణ్ కుమార్ హుటాహుటిన వచ్చి సాములును ఊరడించి, కాసిన్ని నీళ్లు తాగించి.. చేతిలో ఓ పదివేలు పెట్టి, అంబులెన్స్ కూడా ఏర్పాటుచేసి వారిని స్వగ్రామానికి పంపారు. పోలీసుల సహాయానికి సాములు కన్నీళ్ళతో కృతజ్ఞత తెలిపాడు... గురు శవాన్ని తీసుకుని అంబులెన్స్ ఒరిస్సా వైపు దారితీసింది. 

Share this Story:

Follow Webdunia telugu

తర్వాతి కథనం

ఇ-మొబిలిటీని ప్రోత్సహించేందుకు అతిపెద్ద కార్పోరేట్‌ ఔట్‌రీచ్‌ ప్రోగ్రామ్‌ పరిచయం చేసిన ఎథర్‌ ఎనర్జీ