Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia
Advertiesment

ఒక్క స్కూలు కూడా మూతపడకూడదు: సీఎం జగన్

ఒక్క స్కూలు కూడా మూతపడకూడదు: సీఎం జగన్
, బుధవారం, 19 మే 2021 (19:10 IST)
స్కూళ్లు, అంగన్‌వాడీల్లో నాడు – నేడుపై సీఎం శ్రీ వైయస్‌.జగన్‌ సమీక్ష సమావేశం నిర్వహించారు.
ఈ సందర్బంగా మహిళాభివృద్ధి, శిశుసంక్షేమ శాఖ అంగన్వాడీ ఉపాధ్యాయుల కోసం రూపొందించిన స్పోకెన్‌ ఇంగ్లీష్‌ పుస్తకం, సిడిలను సీఎం శ్రీ వైయస్‌ జగన్‌ ఆవిష్కరించారు. అంగన్‌వాడీ అభివృద్ధి కమిటి శిక్షణ కోసం రూపొందించిన  కరదీపిక నమూనాను సీఎంకు చూపించిన అధికారులు.
 
అనంతరం సమీక్షలో... రాష్ట్రంలో 10 మందికన్నా పిల్లలు తక్కువగా ఉన్న స్కూళ్లు, అలాగే 30 మందికన్నా పిల్లలు తక్కువగా ఉన్న స్కూళ్లు ఉన్నాయని తెలిపిన అధికారులు
కొన్నిచోట్ల పిల్లల సంఖ్య తక్కువ, టీచర్లు ఎక్కువ ఉన్న స్కూళ్లు కూడా ఉన్నాయని తెలిపిన అధికారులు.
 
స్కూళ్లను సమర్థవంతంగా వినియోగించుకోవడానికి, టీచర్ల సేవలను సమర్థవంతంగా వాడుకోవడానికి జాతీయ మార్గదర్శకాల ప్రకారం కొన్ని ప్రతిపాదనలు చేసిన అధికారులు
విద్యాభ్యాసంలో గట్టి పునాదులకోసం ఈ నిర్ణయాలు ఉపయోగపడతాయన్న అధికారులు 
స్కూళ్ల వారీగా అక్కడున్న విద్యార్థులు, టీచర్ల సంఖ్యను బట్టి మార్పులు చేస్తామన్న అధికారులు
పిల్లలు తక్కువుగా ఉన్న ప్రాథమిక పాఠశాలల్లో అంగన్‌వాడీ పిల్లలను కలుపుకునేట్టుగా చేస్తామన్న అధికారులు.
 
అంగన్‌వాడీ టీచర్లు, ప్రస్తుతం ఉన్న టీచర్లు వీరికి విద్యాబోధన చేస్తారన్న అధికారులు
దీనివల్ల శిక్షితులైన ఉపాధ్యాయులు వారికి ప్రాథమిక దశనుంచే మంచి బోధన ఇవ్వగలరని, అలాగే స్కూళ్లుకూడా సమర్థవంతంగా వినియోగపడతాయన్న అధికారులు. అవకాశం ఉన్న చోట మూడోతరగతి నుంచి ఐదో తరగతి వరకూ కూడా హైస్కూల్‌ పరిధికి తీసుకురావాలని ప్రతిపాదన
అవసరమైన చోట అప్పర్‌ప్రైమరీ స్కూళ్లను హైస్కూళ్లగా మారుస్తామని ప్రతిపాదన.
 
ఒక్క స్కూలు కూడా మూతపడకూడదు
కొత్తగా చేస్తున్న ప్రతిపాదనల వల్ల ఒక్క స్కూలు కూడా మూతపడే పరిస్థితి రాకూడదన్న సీఎం
ప్రతి స్కూలు కూడా వినియోగంలో ఉండాలన్న సీఎం. శిక్షితుడైన టీచర్‌ పీపీ–1, పీపీ–2 పిల్లలకూ అందుబాటులో ఉండడం ఈ ప్రతిపాదనల్లో ఒక సానుకూల అంశం అన్న సీఎం. అయినా అధికారులు మరోసారి కూర్చొని చర్చించి మరింత మంచి ఆలోచనలు చేయాలన్న సీఎం
ఈనెలలో మరోసారి దీనిపై సమీక్ష చేద్దామన్న సీఎం శ్రీ వైయస్‌.జగన్‌.
 
మనిషిని కష్టపెట్టి, బాధపెట్టి.. ఏం సాధించలేం
ఆప్యాయతతో మన లక్ష్యాలను టీచర్లకు వివరించడం ద్వారా మంచి పనితీరు సాధించుకోగలం.
అసహనం ఎప్పుడూ కూడా బయటకు రానివ్వకూడదని అధికారులకు సీఎం సూచన. మనం తీసుకుంటున్న విప్లవాత్మక మార్పుల్లో టీచర్ల పాత్ర కీలకం. వారిని ఆప్యాయతతో దగ్గరకు తీసుకోండి... మంచి పనితీరు రాబట్టుకోండి.
 
స్కూళ్ళ నిర్వహణలో జాతీయ ప్రమాణాలు పాటించాలి
స్కూళ్ళ నిర్వహణ, టీచర్లని వినియోగించడంలో జాతీయ ప్రమాణాలను పాటించాలి. పిల్లల సంఖ్యకు తగినట్టుగా టీచర్లు ఉండాలి. పిల్లలకు 2 కి.మీ. దూరం లోపలే బడి ఉండాలి. ఇంతకన్నా ఎక్కువైతే పిల్లలకు భారం అవుతుంది. నాడు– నేడు కింద అన్నిరకాల స్కూళ్లు, అంగన్‌వాడీలను అభివృద్ధిచేస్తున్నాం. ఏ పాఠశాలనూ మూసివేసే పరిస్థితి ఉండకూడదు. అవసరమైన చోట అదనపు తరగతి గదులను నాడు–నేడు కింద నిర్మించడానికి అధికారులకు సీఎం ఆదేశాలు.
 
అంగన్‌వాడీ టీచర్లకు మంచి శిక్షణ ఇవ్వాలి
రూపొందించిన పాఠ్యాంశాలను అంగన్‌వాడీ టీచర్లు పిల్లలకు బోధించగలగాలి. పెద్దవాళ్ల పిల్లల మాదిరిగా పేదవాడి పిల్లలు కూడా ఇంగ్లీషులో మంచి విద్యను అందుకోవాలి. దీనికోసం తీసుకోవాల్సిన చర్యలన్నీ తీసుకోండి. పాఠ్యప్రణాళిక పటిష్టంగా ఉండాలి. నాడు – నేడు కింద బాగుచేసిన భవనాల నిర్వహణపై దృష్టిపెట్టాలి. ఏం సమయానికి ఏం చేయాలన్న దానిపై ఎస్‌ఓపీ తయారు చేయండి. రూ.వేల కోట్లు ఖర్చు చేశాం కాబట్టి భవనాలను బాగా చూసుకోవాల్సి ఉందని సీఎం శ్రీ వైయస్‌ జగన్ అన్నారు.
 
ఈ సమీక్షా సమావేశంలో విద్యా శాఖ మంత్రి ఆదిమూలపు సురేష్, మహిళా శిశు సంక్షేమ శాఖ మంత్రి తానేటి వనిత, ఆ శాఖ ముఖ్య కార్యదర్శి ఏఆర్‌ అనూరాధ, విద్యా శాఖ ముఖ్య కార్యదర్శి బి.రాజశేఖర్, పాఠశాల విద్యా కమిషనర్‌ వి.చినవీరభద్రుడు, పాఠశాల విద్యా శాఖ కమిషనర్‌ వి.రామకృష్ణ, సర్వశిక్షా అభియాన్‌ స్టేట్‌ ప్రాజెక్టు డైరెక్టర్‌ వెట్రిసెల్వి, సర్వశిక్షా అభియాన్‌ సలహాదారు ఎ.మురళితో పాటు, విద్యా శాఖకు చెందిన పలువురు సీనియర్‌ అధికారులు పాల్గొన్నారు.

Share this Story:

Follow Webdunia telugu

తర్వాతి కథనం

షాపులో పనిచేస్తున్న యువతికి కూల్ డ్రింక్‌లో మత్తుమందు ఇచ్చి..