Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia

బటన్‌ నొక్కి నేరుగా మత్స్యకార కుటుంబాల అకౌంట్లలోకి రూ.119.88 కోట్లు జమ చేసిన సీఎం జగన్‌

Advertiesment
బటన్‌ నొక్కి నేరుగా మత్స్యకార కుటుంబాల అకౌంట్లలోకి రూ.119.88 కోట్లు జమ చేసిన సీఎం జగన్‌
, మంగళవారం, 18 మే 2021 (16:54 IST)
వైయస్సార్‌ మత్స్యకార భరోసా మూడో ఏడాది చెల్లింపులు చేసారు. క్యాంప్‌ కార్యాలయంలో కంప్యూటర్‌ బటన్‌ నొక్కి నేరుగా 1,19,875 మత్స్యకార కుటుంబాల అకౌంట్లో రూ.119.88 కోట్లు జమ చేశారు సీఎం శ్రీ వైయస్‌.జగన్‌. ఈ సందర్భంగా వివిధ జిల్లాల్లోని లబ్ధిదారులతో వీడియో కాన్ఫరెన్స్‌ ద్వారా మాట్లాడారు ముఖ్యమంత్రి శ్రీ వైయస్‌.జగన్‌.
 
కె.వెంకటేశ్వరరావు, మత్స్యకారుడు, నిజాం పట్నం, గుంటూరు జిల్లా.
గౌరవ ముఖ్యమంత్రి గారికి హృదయపూర్వక నమస్కారాలు.
మీతో మాట్లాడే అవకాశం రావడం నిజంగా నా అదృష్టం. ఈ వేట నిషేధ సమయంలో, కరోనా విపత్తు వేళ కూడా మా అందరి మీద ఇంత ప్రేమతో ఈ రూ.10 వేలు ఇస్తున్నందుకు చాలా ఆనందంగా ఉంది.  గతంలో అయితే రూ.4 వేలు అరకొరగా ఇచ్చేవారు. ఎప్పుడు ఇచ్చేవారో తెలిసేది కాదు. ఇప్పుడు పార్టీలకతీతంగా, ఎవరి ప్రమేయం లేకుండా పూర్తిగా అర్హులైన 1 లక్షా 20 వేల మందికి ఇస్తున్నందుకు హృదయపూర్వక ధన్యవాదములు. మే 18న రూ.10 వేలు మాకు ఇస్తున్న సందర్భంగా 1 లక్షా 20 వేల కుటుంబాలకు పెద్ద పండగ. ఇది జగనన్న పండగ. మీకు కృతజ్ఞతలు. 

గతంలో బోట్లన్నీ స్క్రాబ్‌కు వేసేస్తున్న సందర్భంగా నాన్నగారు వచ్చి మమ్మల్ని ఆదుకున్నారు. మరలా ఆ తర్వాత వచ్చిన ప్రభుత్వాలేవీ సాయం చేయలేదు. వేటకు వెళ్లడానికి టైమంటూ లేదు, అలా వెళ్లి ప్రమాదవశాత్తూ చనిపోతే గతంలో రూ. 5 లక్షలు ఇచ్చేవారు. మీరు వచ్చిన తర్వాత రూ.5 లక్షలను రూ.10 లక్షలు చేశారు. హార్భర్‌లు లేక వలసవెళ్లి మత్స్యకారులు ప్రాణాలు కోల్పోతున్నారు. మన రాష్ట్రంలో వీటి ఏర్పాటు చేయడం చాలా ఆనందించదగ్గ విషయం. అన్ని వర్గాల వారికి ఇవి ఉపాధి కల్పిస్తాయి.

మీరు వచ్చిన వెంటనే ఆక్వా రైతులకు విద్యుత్‌ ఛార్జీలు తగ్గించారు.. ఇందుకు ఆక్వా రైతుల తరపున మీకు ధన్యవాదములు. 2020లో కరోనా కంటే పెద్ద సంక్షోభం ఆక్వారంగంలో వచ్చింది. మీరు లేకపోతే మేమంతా చనిపోయి ఉండేవాళ్లం. మా జీవితాల్లో మత్స్యకార కుటుంబాల్లో మర్చిపోలేని మేలు జరిగింది. స్వాతంత్య్రం వచ్చిన తర్వాత రాజకీయ ప్రాధాన్యత మీ వల్లే మాకు జరిగింది. నాలుగు ఎమ్మెల్యేలు, ఒక ఎంపీ, ఒక ఎమ్మెల్యే, ఒక మేయరు, రెండు మున్సిపాల్టీలు ఇచ్చి ప్రాధాన్యత కల్పించినందుకు ఇంతకంటే ఆనందం మాకు లేదు. మీకు దేవుడు నిండు నూరేళ్లు ఆయుష్షు ఇవ్వాలని ప్రార్ధిస్తున్నాను. 
 
చింతా గోవిందరాజులు, గిలకల దిన్నె, కృష్ణా జిల్లా. 
కరోనాతో చచ్చిపోతామో, కరువుతో చచ్చిపోతామో తెలియని కాలంలో మీరు ఇచ్చే రూ.10 వేలు మాకు సంజీవినిలా ఉపయోగపడుతున్నాయి. గత పది సంవత్సరాలుగా వేటే జీవనాధారంగా బతుకుతున్నాం. రెండు నెలల పాటు వేట నిషేధ సమయంలో ఇంటి వద్దే ఉండాలి. గతంలో రూ.4 వేలు ఇచ్చేవాళ్లు. అవి అందరికీ అందేవి కావు. పాదయాత్రలో మీరు ఇచ్చిన మాట ప్రకారం రూ.10 వేలు గత రెండు సంవత్సరాలతోపాటు మూడో ఏడాది కూడా ఇప్పుడు ఇస్తున్నారు. నిజంగా ఇది చాలా కష్టకాలం. కరోనాతో చచ్చిపోతామో, కరువుతో చచ్చిపోతామో తెలియని కాలంలో మీరు ఇచ్చే రూ.10 వేలు మాకు సంజీవినిలా ఉపయోగపడుతున్నాయి.
 
 గతంలో ప్రమాదవశాత్తూ మత్స్యకార కుటుంబంలో వేటకువెళ్లినవారు చనిపోతే మృతదేహం దొరికితే కానీ డబ్బులు వచ్చేవి కాదు. లేదంటే ఏడు సంవత్సరాలు అగాలి. ఆరు నెలలు కాలంలో మీరు మాటిచ్చిన ప్రకారం ఆ కుటుంబానికి రూ.10 లక్షలు ఇచ్చి ఆ కుటుంబం రోడ్డున పడకుండా కాపాడుతున్నారు. అందుకు మీకు నమస్కారాలు తెలియజేస్తున్నాను. మాకు జెట్టీ లేకపోవడం వల్ల, మొగ పూడుకుపోవడం వల్ల వేటకు వెళ్లే బోటులు తగ్గిపోయాయి. మీరు రూ. 348 కోట్లు పూడిక తీత కోసం కేటాయించారు. మీ రుణం తీర్చుకోలేనిది. మాకు ఇంటి స్ధలం, ఇళ్లు పట్టాలు కల. గతంలో తుఫాను వచ్చినప్పుడు పంచారని పెద్దలు చెప్పారు. ఇప్పుడు మీరు మా గ్రామంలోనే వేయి పట్టాలు పంచారు. 
 
బర్రె లక్ష్మీ నరసింహరాజు, తాళ్లరేవు మండలం, తూర్పుగోదావరి జిల్లా.
మత్స్యకార భరోసా గతంలో రూ.4వేలు ఉండేది. అనుకున్న సమయంలో అందేది కాదు. ఇచ్చిన తర్వాత కొంతమందికే వచ్చేది. చాలామంది ఇబ్బంది పడేవాళ్లు. మీరు పాదయాత్రలో దీనిపై హామీ ఇచ్చారు. మీరు అధికారంలోకి వచ్చిన వెంటనే రూ.10వేలకు పెంచడమే కాకుండా మా జిల్లా నుంచి ఆ కార్యక్రమాన్ని ప్రారంభించారు. గడిచిన మూడేళ్లుగా ఈకార్యక్రమాన్ని మీరు ఏ రోజైతే బటన్‌ నొక్కి ప్రారంభిస్తారో ఆ రోజే మాకు డబ్బులు అకౌంట్‌లో పడుతున్నాయి. వేటకు వెళ్లిన మత్స్యకారులు ప్రమాదవశాత్తూ చనిపోతే  రూ.10 లక్షలు పరిహారం వాళ్ల అకౌంట్లోనే నేరుగా జమ చేస్తున్నారు. గతంలో దీని కోసం కాళ్లరిగేలా తిరగాల్సి వచ్చేది.
 
చినబొడ్డు వెంకటాయపాలెం గ్రామంలో ఇంతవరకు ఇళ్లు ఇవ్వడం, స్ధలాలివ్వడం లేదు. మీరు వచ్చిన తర్వాత గ్రామానికి పక్కనే భూమి సేకరించి ఇళ్ల స్ధలాలతో పాటు ఇళ్లు ఇవ్వడం జరుగుతుంది. ఇందుకు మీకు ధన్యవాదములు తెలియజేస్తున్నాను. మా మత్స్యకారుల కోసం ఇన్ని మంచి కార్యక్రమాలు చేపడుతున్న మీరు పదికాలాలపాటు ముఖ్యమంత్రిగా ఉండాలని కోరుకుంటున్నాను.
 
పి.ధర్మారావు, గంగువాడ, మందస మండలం, శ్రీకాకుళం జిల్లా.
26 సంవత్సరాలుగా వేటే జీవనాధారంగా బతుకుతున్నాం. వేట నిషేధసమయంలో రూ.4వేలు ప్రకటనే తప్ప డబ్బులు వచ్చిన పరిస్ధితి లేదు. దీంతో వలసబాట పట్టేవాళ్లం. ఆ సమయంలో మీరు పాదయాత్ర ద్వారా మా గుడిసెల్లోకి వచ్చి రూ.10 వేలు ఇస్తామని మాట ఇచ్చి అధికారంలోకి వచ్చిన తర్వాత దాన్ని నిలబెట్టుకున్నారు. మాకు ఇంజన్‌ బోట్లు కోసం డీజిల్‌  సబ్సిడీ గతంలో రూ.6.3 పైసలు ఇస్తామని చెప్పడం తప్ప ఇచ్చిన దాఖలాలు లేవు, ఇప్పుడు మీరు అధికారంలోకి వచ్చిన తర్వాత దాన్ని రూ.9 చేసి అది కూడా బంకులు వద్దే  మాకు సబ్సిడీ వచ్చేట్టు చేశారు, అందుకు మీకు ధన్యవాదాలు.
 
గతంలో మేం వేటకు వెళ్లి చనిపోతే అధికారుల చుట్టూ కాళ్లరిగిలా తిరిగితే ఆ వచ్చే డబ్బులు ఐస్‌గడ్డలా కరిగి మిగిలినది మా చేతికి వచ్చేది. మీరు అధికారంలోకి వచ్చిన తర్వాత రూ.10 లక్షలు మృతుల కుటుంబాలకు నేరుగా జమ అవుతున్నాయి. వేట కోసం ఐస్‌ బాక్సులు, బోటులు, వలలు అన్నీ అందిస్తున్నారు. మేం వలసబారిన పడకుండా ఉండేందుకు... రూ.12 కోట్లతో మంచినీళ్లపేట, వజ్రపుకొత్తూరు మండలంలో నిర్మిస్తున్న జెట్టీ వలన చాలా ఉపయోగపడుతుంది.  ఎచ్చెర్ల మండలం బుడగట్ల పాలెంలో నిర్మించతలపెట్టిన హార్భర్‌ భవిష్యత్తులో ఇంకా ఉపయోగపడుతుంది.

Share this Story:

Follow Webdunia telugu

తర్వాతి కథనం

ఫైబర్ ఆప్టిక్ జలాంతర్గామిని నిర్మించనున్న జియో.. సముద్ర మార్గం ద్వారా..?