Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia
Advertiesment

సీఎం సారు వస్తున్నారు... ఏర్పాట్లు చేయాలి.. ప్లీజ్ డబ్బులు ఇవ్వండి... అధికారుల తిప్పలు

rupe notes

వరుణ్

, శుక్రవారం, 23 ఫిబ్రవరి 2024 (07:41 IST)
ఏపీ ముఖ్యమంత్రి, వైకాపా అధినేత జగన్మోహన్ రెడ్డి జిల్లాల పర్యటనకు వస్తున్నారంటే జిల్లా యంత్రాంగం వణికిపోతుంది. ఇది భయంతో వచ్చిన వణుకు కాదు. ఆయన పర్యటన సందర్భంగా చేయాల్సిన ఏర్పాట్ల కోసం అయ్యే ఖర్చుల కోసం డబ్బులు ఎక్కడ నుంచి సమీకరించాలి, ఎవరిని అడగాలి అన్నదే వారి ప్రధాన సమస్యగా మారింది. తాజాగా సీఎం జగన్ చిత్తూరు జిల్లా పర్యటనకు రానున్నారు. ఈ పర్యటన ఏర్పాట్లు చేసేందుకు నిధులు లేక జిల్లా యంత్రాంగం ఆపసోపాలు పడుతుంది.
 
ఈ నెల 26వ తేదీన సీఎం జగన్ చిత్తూరు జిల్లాలోని కుప్పం నియోజకవర్గం శాంతిపురం, రామకుప్పం మండలాల్లో పర్యటించనున్నారు. ఇందుకోసం అధికారులు ఏర్పాట్లు పనుల్లో నిమగ్నమయ్యారు. అయితే, రామకుప్పంమండలం రాజుపేటలో ఒక హెలిప్యాడ్, శాంతిపురం మండలం గుండుశెట్టిపల్లిలో మరొకటి, బహిరంగ సభ వద్ద, ఇతర చోట్ల కొన్ని పనులు చేయాల్సివుంది. ఈ ఏర్పాట్ల కోసం రూ.2 కోట్లకు పైగా నిధులు ఖర్చు అవుతాయని అంచనా వేసారు.
 
అయితే, వీటికి సరిపడ నిధులు లేకపోవడంతో జిల్లా ఉన్నతాధికారులు ప్రత్యామ్నాయ ఏర్పాట్లుపై దృష్టిసారించారు. జిల్లా గృహ నిర్మాణ సంస్థ ఖాతాలో ఉన్న నిధులను కలెక్టర్ ఖాతాకు బదిలీ చేసేలా ఆదేశాలు ఇవ్వాలంటూ జిల్లా ఉన్నతాధికారులు, రాష్ట్ర గృహ నిర్మాణ సంస్థ మేనేజింగ్ డైరెక్టర్‌ ప్రాధేయపడ్డారు. ఈ నిధులన్నీ రీయింబర్స్‌ చేస్తామని వారు హామీ ఇవ్వడం గమనార్హం. 

Share this Story:

Follow Webdunia telugu

తర్వాతి కథనం

ఉద్యోగం నుంచి తొలగించడానికి వివాహాన్ని కారణంగా చూపుతారా? సుప్రీంకోర్టు ప్రశ్న