Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia

కోటంరెడ్డి శ్రీధర్ రెడ్డి బండారాన్ని బయటపెడతా : వైకాపా ఎంపీ ఆదాల

Advertiesment
adala prabhakar reddy
, గురువారం, 9 ఫిబ్రవరి 2023 (16:40 IST)
నెల్లూరు గ్రామీణ ఎమ్మెల్యే కోటంరెడ్డి శ్రీధర్ రెడ్డి బండారాన్ని త్వరలోనే బయటపెడతానని నెల్లూరు వైకాపా ఎంపీ ఆదాల ప్రభాకర్ రెడ్డి అన్నారు. వైకాపా అధిష్టానంపై తిరుగుబాటు చేసిన కోటంరెడ్డి శ్రీధర్ రెడ్డి తనపై చేసిన విమర్శలకు ఎంపీ ఆదాల గట్టిగా కౌంటరిచ్చారు. ఇదే అంశంపై మాట్లాడుతూ, ప్రతి రోజూ ప్రెస్మీట్లు పెట్టి అసత్య ఆరోపణలు చేస్తున్నారంటూ ఆయన మండిపడ్డారు. 
 
ఎమ్మెల్యేగా గత మూడున్నరేళ్లలో ఎన్నో అరాచకాలు చేశారని ఆయన ఆరోపించారు. కోటంరెడ్డి అసలు స్వరూపాన్ని త్వరలోనే ప్రజల ముందు బయటపెడతానని చెప్పారు. గత ఎన్నికల్లో నెల్లూరు రూరల్ నియోజకవర్గంలో ఎమ్మెల్యే కంటే తనకే ఐదు వేల ఓట్లు ఎక్కువ వచ్చాయని తెలిపారు. పైగా వచ్చే ఎన్నికల్లో నెల్లూరు రూరల్ అసెంబ్లీ సెగ్మెంట్ నుంచి పోటీ చేసేది తానేనని ఆయన స్పష్టం చేశారు. 
 
మరోవైపు, కోటంరెడ్డిపై మంత్రి కాకాణి గోవర్థన్ రెడ్డి కూడా స్పందించారు. వైకాపా ప్రభుత్వంపై బురద చల్లడమే పనిగా పెట్టుకున్నారని మండిపడ్డారు. ఫోన్ ట్యాపింగ్ కాలేదని కోటంరెడ్డి స్నేహితుడు శివారెడ్డి చెబుతున్నారని, అయినా ప్రభుత్వంపై కోటంరెడ్డి తప్పుడు ఆరోపణలు చేస్తున్నారని అన్నారు. ఆడియో రికార్డ్‌ను ఫోన్ ట్యాప్ అంటున్నారని విమర్శించారు. 
 
అది ఫోన్ ట్యాప్ కాదని, చంద్రబాబు ట్రాప్ అని మంత్రి కాకాణి అన్నారు. కోటంరెడ్డి శ్రీధర్ రెడ్డి చేస్తున్న తప్పుడు ఆరోపణలకు ఎల్లో మీడియా కూడా వంతపాత పాట పాడుతూ విస్తృతంగా ప్రచారం చేస్తుందన్నారు. వాపును చూసుకుని బలుపు అని అనుకుంటున్నారని, రాష్ట్ర యావత్ ప్రజానీకం ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి వెంటే ఉన్నారని మంత్రి కాకాణి అన్నారు. 

Share this Story:

Follow Webdunia telugu

తర్వాతి కథనం

చెన్నైలో హిటాచీ ఎనర్జీ అధునాతన విద్యుత్ వ్యవస్థ కర్మాగారం ప్రారంభం