Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
Wednesday, 30 April 2025
webdunia

చనిపోయిన వ్యక్తి.. ఏడుపు శబ్ధం విని లేచి కూర్చున్నాడు.. కానీ కొంతసేపట్లో?

Advertiesment
Narasapur
, శనివారం, 12 జనవరి 2019 (14:49 IST)
ఏడుపు శబ్ధం విని ఆ శవం కన్ను తెరిచింది. కానీ అందరూ షాక్ కావడంతో పాటు సంతోషంతో పండుగ చేసుకునేలోపు.. తిరిగి ప్రాణాలు కోల్పోయాడు. ఈ ఘటన నిర్మల్ జిల్లా నరసాపూర్ మండలంలోని దర్యాపూర్ గ్రామంలో చోటుచేసుకుంది. వివరాల్లోకి వెళితే.. 49 ఏళ్ల లింగన్న అనే వ్యక్తి చాలా సంవత్సరాలుగా కిడ్నీ వ్యాధితో బాధపడుతూ వచ్చాడు. 
 
శుక్రవారం ఉదయం ఎంతసేపూ లేపినా లేవలేదు. దీంతో అతడు మరణించాడని భావించిన కుటుంబ సభ్యులు విదేశాల్లో వున్న కుమారుడికి సమాచారం ఇచ్చారు. కుటుంబసభ్యులంతా చేరడంతో ఆ ఇంట్లో విషాద వాతావరణం నెలకొంది. గంటల తరబడి ఏడిచి, ఏడిచి అలిసిపోయిన క్షణంలో ఒక్కసారిగా కళ్లు తెరిచాడు లింగన్న. నిద్రలోంచి లేచినట్టుగా లేచాడు. 
 
చనిపోయాడనుకున్న వ్యక్తి లేచి కూర్చోవడంతో అందరూ హ్యాపీగా పండగ చేసుకున్నారు. ఎలాగో కుటుంబసభ్యులు, బంధువులు రావడంతో సంతోషంగా లింగన్నతో కలిసి మాట్లాడుతూ కాలక్షేపం చేశారు. అంతలోనే లింగన్న మళ్లీ కన్నుమూశాడు. చివరికి చేసేది లేక కుటుంబ సభ్యులు అంత్యక్రియలు నిర్వహించారు.

Share this Story:

Follow Webdunia telugu

తర్వాతి కథనం

మీకు దణ్ణం పెడతా.. నా కుటుంబాన్ని రోడ్డుపైకి లాగొద్దండి.. ప్లీజ్?