భర్తతో విభేదాలు.. ప్రియుడికి అలా సమాధానం.. అంతే హత్యకు గురైంది..

గురువారం, 10 జనవరి 2019 (10:59 IST)
భర్తతో విభేదాల కారణంగా అతని దూరంగా వుంది. ఆపై 24 ఏళ్ల వ్యక్తితో ప్రేమలో పడింది. కానీ అనుమాన భూతం ఆమెను బలితీసుకుంది. వివరాల్లోకి వెళితే.. సెల్వి అనే 32 ఏళ్ల మహిళకు దౌలత్ అనే వ్యక్తి పరిచయమయ్యాడు. వీరిద్దరూ ప్రేమలో వుండగా.. దౌలత్‌కు సెల్విపై అనుమానం పెరిగింది. అంతే అనుమానంతో అతడు ప్రియురాలికి హత్య చేసేశాడు. 
 
ఈ ఘటన కర్ణాటకలోకి కృష్ణగిరిలో చోటుచేసుకుంది. సెల్వి, దౌలత్ కృష్ణగిరి.. జక్కప్పన్ నగర్‌లోని ఓ దుకాణంలో పనిచేస్తున్నారు. ఇంతలో ఆమె హత్యకు గురైంది. ఇందుకు కారణం దౌలతేనని పోలీసుల విచారణలో తేలింది. డబ్బులు అడిగిందని.. ఆమె పనిచేసే షాపు వద్దకు వెళ్తే.. అక్కడ మరో వ్యక్తితో నవ్వుతూ కనిపించిన సెల్విని తాను నిలదీశానని.. అందుకు ఆమె వెటకారంగా బదులిచ్చిందని దౌలత్ చెప్పాడు. 
 
తాను ఎవరితో మాట్లాడితే నీకెందుకని అడగడంతో ఆవేశానికి గురైన దౌలత్, అక్కడే వున్న కత్తితో ఆమెను నరికి చంపేశానని నిందితుడే ఒప్పుకున్నాడు. నిందితుడిని పోలీసులు కోర్టు ముందు హాజరు పరచి రిమాండ్‌కు తరలించారు.

వెబ్దునియా పై చదవండి

తర్వాతి కథనం జమ్మూకాశ్మీర్‌లో భూకంపం.... రిక్టర్ స్కేలుపై 4.6 తీవ్రత